70ఏళ్లు వస్తున్నా రజనీకాంత్‌లా ఉండాలంటే..?


సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఇప్పుడు 67ఏళ్లు..ఐనా ఆయనలో గత ముఫ్పై ఏళ్లుగా ఎలాంటి ఉత్సాహం కన్పిస్తుందో
ఇప్పటికే అదే జోరు కన్పిస్తుంటుంది. వయసు మీద  పడి గతంలోలాగా డ్యాన్సులు, పైట్లూ చేయలేకపోవచ్చు కానీ
ఆయనలో వేగం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు..ఈ వయసుకి సాధారణంగా ఎవరైనా వంగిపోయి కదలికల వేగం తగ్గుతుంది మాట, నడక, చూపు మందగిస్తాయి. కానీ రజనీకాంత్‌కి మాత్రం అవేం పాడవలేదు సరికదా..ఎప్పటికప్పుడు తన అభిమానులలో కుర్రకారుని చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

తాజాగా ఆయన సినిమా కాలా రివ్యూల సంగతి పక్కనబెడితే..నాలుగు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇది ఆయన బాక్సాఫీస్ స్టామినాకి ఫాలోయింగ్‌కి నిదర్శనం. సినిమా విజయం గురించే చెప్పాలంటే మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ ప్రసార హక్కులతోనే నిర్మాతకి 230కోట్లు తెచ్చిపెట్టిందట..ఇక సినిమా ఆడితే ఏంటి ఆడకపోతే ఏంటనే సంగతి పక్కనబెడితే, రజనీకాంత్ చురుకుదనం మరోసారి చర్చకు వస్తోంది

అసలు ఓ మనిషి శరీరం ఎలా తయారవుతుందనడానికి అతను తీసుకునే ఆహారమే కారణం. మితంగా తీసుకుంటే సన్నగా..భారీగా లాగిస్తే బరువుగా తయారవుతుంది. మరి రజనీకాంత్ ఉరఫ్ శివాజీరావ్ గైక్వాడ్ ఆహారం ఏంటి..అదే చూద్దాం. 1970లలో అంటే కెరీర్ ప్రారంభమైన మొదటి పదేళ్లలో రజనీకాంత్ చికెన్, మటన్ బాగా లాగించేవాడట. దాంతో పాటే తమిళ వంటకమైన మీన్ కళంబు అనే ఐటెమ్ కూడా బాగా ఇష్టమట. ఇప్పటికీ ఈ మీన్ కళంబు రజనీకాంత్ తింటాడట. కానీ నూనె, కారం బాగా తగ్గించి తీసుకుంటాడట.ఐతే ఎప్పుడైతే డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటు చేసుకుని  కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడో..ఆ తర్వాత ఆయన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడట
ప్రతి ఏటా హిమాలయాలకు వెళ్లి వస్తుంటాడు రజనీ. ప్రతి రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం..ఓ గంట జాగింగ్ చేస్తాడు. యోగా, నడక ఈ రెండూ ఆయన పాటించే వ్యాయామాలు. ఉదయంతో పాటు సాయంత్రం నడక కూడా ఖచ్చితంగా పాటిస్తాడు సూపర్ స్టార్. పాలతో చేసిన పదార్ధాలు అంటే నెయ్యి, పెరుగు వంటి వాటికి దూరంగా ఉంటాడు. అలానే పంచదార కూడా రజనీ ఫుడ్‌లో బ్యాన్ చేయబడింది. ఇక బియ్యంతో చేసిన ఆహారం కూడా తినడట. గత ఇరవై ఏళ్లుగా ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడట రజనీకాంత్. రజనీకాంత్ మాత్రమే కాదు ఇంకెవరైనా సరే 40ఏళ్లు దాటాయంటే పైన చెప్పిన పదార్ధాలకు దూరంగా ఉంటే నిత్యం చురుకుగా ఉండవచ్చని సలహా ఇస్తాడట ఈ భాషా..ఇంత స్ట్రిక్ట్‌గా డైట్ కంట్రోల్ ఉండటానికి కారణం రజనీకాంత్ కి టైప్ టు డయాబెటీస్ ఉండటమే
దానికి తోడు ఏడేళ్ల క్రితం రజనీకాంత్‌కి లివర్( కాలేయం) ప్రాబ్లెమ్స్ కూడా వచ్చాయ్.  సో అలా తన ఆహారపు అలవాట్లతో వ్యాధులను అదుపులో ఉంచుకోవడంతో పాటు శరీరవయసును కంట్రోల్ చేయగలుగుతున్నాడన్నమాట


Comments