క్రిష్ విడాకులు తీసుకోబోతున్నాడా..? ప్రచారం సంగతేమో కానీ విడాకులు మాత్రం కుదరవ్


గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్రశాతకర్ణి లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి కెరీర్ పరంగా తక్కువ సినిమాలతో మంచి పొజిషన్‌కు వెళ్లారు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మక 'మణికర్ణిక' చిత్రం చేస్తున్న ఆయన ఈ మూవీ పూర్తయిన వెంటనే తెలుగులో 'ఎన్టీఆర్ బయోపిక్' చేయబోతున్నారు. క్రిష్ ప్రొఫెషనల్ లైఫ్ బావున్నప్పటికీ పర్సనల్‌ లైఫ్‌లో సమస్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.  క్రిష్ తన భార్య రమ్యతో విడాకులకు సిద్ధం అయ్యాడని టాక్. . కారణాలు ఏమిటో తెలియదు కానీ క్రిష్, ఆయన భార్య రమ్య విడాకులకు సిద్ధమయ్యారని ఇందుకోసం ధరఖాస్తు కూడా చేసుకున్నారని అంటున్నారు. ఐతే విడాకులు మంజారు కావడం మాత్రం కుదరని పని.. క్రిష్-రమ్య వివాహం 2016లో జరిగింది. అంటే రెండేళ్లు కూడా  పూర్తవలేదు.
క్రిష్‌. రమ్య వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఆగస్టు 2016లో జరిగింది. ''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''... నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా హాజరయ్యారు.

ఐతే రెండేళ్లు కూడా గడవకముందే ఇలాంటి ప్రచారం జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఐతే విడాకులు మంజూరు మాత్రం అవదని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారం ఏ జంటకైనా విడాకులు ఇవ్వాలంటే కనీసం పెళ్లై మూడేళ్లు దాటాలి..మరి క్రిష్ ఉరఫ్ జాగర్లమూడి కృష్ణ విషయంలో రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ విడాకులు అనేవి కోర్టు మంజూరు చేయదునిజంగా వీళ్లమధ్య కలిసి ఉండలేనంత పొరపొచ్చాలు ఉంటే ఎవరికివారేగా ఉంటారేమో కానీ..చట్టబద్దంగా విడాకులు మాత్రం కుదరదు

Comments