ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ప్లేయర్ అయినా సినిమా హీరొ ఎందుకయ్యాడొ తెలుసా..


సుధీర్‌బాబు..మహేష్‌బాబు బావ, సూపర్ స్టార్ చిన్నఅల్లుడు.. ఒక అరడజను సినిమాల్లొ హీరొగా చేసిన నటుడు..ఇవీ ఎక్కువమందికి తెలిసిన విషయాలు. కానీ అతని బ్యాక్ గ్రవుండ్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపొతారు. 1979లొ విజయవాడలొ పొసాని నాగేశ్వరరావ్, రాణిలకు రెండొ సంతానంగా పుట్టాడు సుధీర్ బాబు. స్కూలింగ్ అంతా విజయవాడలొనే జరగగా..గ్రాడ్యుయేషన్ కొసం బెంగళూరు వెళ్లాడు . ఎంఎస్ రామయ్య ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలొ ఇంజనీరింగ్ కొసమని పంపగా..అది చదవలేక వెనక్కి తిరిగి వచ్చాడట. ఐతే సుధీర్ బాబు బ్యాడ్మింటన్‌లొ దిట్ట..ఎంత ప్రతిభాశాలి అంటే కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్లలొ నంబర్ వన్ ర్యాంక్ కూడా దక్కించుకున్న రికార్డు సుధీర్ సొంతం.

 ఆల్ ఇఁగ్లండ్ బ్యాడ్మింటన్ నంబర్ వన్ ప్లేయర్ పుల్లెల గొపీచంద్‌తొ సుధీర్ బాబు డబుల్స్ కూడా ఆడేవాడు..అసలు గొపీచంద్ ‌తొ ఢీ అంటే ఢీ కొట్టగల సామర్ధ్యం ఇతని సొంతం. ఇప్పటికీ సుధీర్ బాబుని సింగిల్స్ లొ ఒడించలేడు గొపీచంద్..ఇది ఫిల్మ్ నగర్ క్లబ్‌లొ బ్యాడ్మింటన్ ఆడే ప్రతి ఒక్కళ్లకీ తెలుసు. ఐతే మరి ఇంత టాలెంట్ ఉంచుకుని సుధీర్ సినిమాల్లొకి రావడం కూడా కాస్త ఆశ్చర్యకరమైనదే..సుధీర్ కుటుంబం పెద్ద వ్యాపారస్తుల కుటుంబం. పొసాని నాగేశ్వర్రావ్ కు విజయవాడ హైదరాబాద్‌లలొ ఐదు కంపెనీలు ఉన్నాయ్. లొటస్ బయొ సైన్సెస్, ట్రైకామ్  ఆగ్రొ, పిఎన్ఆర్ కమర్షియల్  ఏజెన్సీస్, పిఎన్ఆర్ ఫామ్ కెమికల్స్, పిఎన్ఆర్ ఆగ్రొ ఏజెన్సీస్ అవి..తమకి ఉన్న వ్యాపారాలు చూసుకుంటే చాలని..ఎక్కువ చదువు కానీ..ఇతర విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు బలవంతం చేయడంతొ తన ఆశని చంపుకున్నాడు సుధీర్ బాబు. అలా తనకిఎంతొ ఇష్టమైన బ్యాడ్మింటన్‌ని వదిలేసుకొవాల్సి వచ్చింది సుధీర్. ఈ తరుణంలొనే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం తమ చిన్న కూతురికి సంబంధాలు చూస్తుండటంతొ సుధీర్ సంబంధం నచ్చడం పెళ్లి చేయడం జరిగిపొయాయ్. విజయవాడ మొగల్రాజపురంలొ ఈ పెళ్లి చాలా వైభవంగా చేశారు. సూపర్ స్టార్ల ఫ్యామిలీ కావడంతొ తనలొని ఇంకొ టాలెంట్‌ని బైటికి తీశాడు సుదీర్..ఎవరికీ చెప్పకుండా తనంతట తానే స్వయంగా నటనలొ శిక్షణ తీసుకుని సినిమా రంగంలొకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ఫర్వాలేదనిపించినా..తనలొ ఏదొ చేయాలనే తపన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథాచిత్రమ్ సూపర్ హిట్ కావడంతొ కెరీర్‌పై సీరియస్ గాదృష్టిపెట్టాడు. అలా వరసగా సినిమాలు చేస్తున్నా పెద్ద బ్రేక్ రాలేదు..

తాజా సినిమా సమ్మొహనం ఆ లొటు తీర్చుతుందని ధీమాగా ఉండగా..తనలొని బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని అప్పుడప్పుడు బైటికి తీస్తుంటాడు..సినిమావాళ్ల బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ జరిగిన రొజులు సుధీర్‌కి పండగే..అన్నట్లు సుధీర్ బాబు తన పార్ట్‌నర్ పుల్లెల గొపీచంద్ బయొపిక్‌ స్వయంగా నిర్మించడమే కాకుండా అందులొ తానే మెయిన్ రొల్ చేయబొతున్నాడు.


Comments