బాబీ సెట్స్‌పై పెద్ద అవమానం నుంచి మహేష్‌ని కాపాడిన బాలయ్య..విషయం ఏంటో తెలుసా


ప్రిన్స్ మహేష్‌బాబు ఇప్పుడు తెలుగుతెరపై తిరుగులేని సూపర్ స్టార్..సినిమా హిట్టైనా ఫట్టైనా కనీసం వందకోట్ల రూపాయలు కలెక్ట్ చేసే రేంజ్ ఆయనది..ఐతే ఇలాంటి మహేష్‌బాబుని మరో టాప్‌హీరో బాలకృష్ణ పెద్ద ఆపదనుంచి కాపాడారు. ఇదేదో మహేష్  బాబు సినిమా రిలీజ్ రోజున తన సినిమా రిలీజ్ ఉంటే వెనక్కి తగ్గడంలాంటిది కాదు..ని ఒకానొక సందర్భంలో నందమూరి బాలకృష్ణ కాపాడారు..అదెలానో చూడండి

2002లో మురారి సినిమా తర్వాత బాబీ అనే సినిమా తీస్తున్నారు. దానికి నిర్మాత స్వయంగా దర్శకేంద్రుడిగా పేరుతెచ్చుకున్న రాఘవేంద్రరావ్, ఆర్కె ఫిల్మ్స్ అసోసియేట్స్ పతాకంపై ఈ సినిమాకి దర్శకుడు వర్షం ఫేమ్ శోభన్..ఈ సినిమా కోసం 70లక్షల పెట్టి పెద్ద పబ్ సెట్ కూడా వేశారు. భారీ కాస్ట్యూమ్స్, భారీ తారాగణంతో తీసిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉన్నాకూడ చివర్లో దర్శకుడు
భావుకతకి పెద్ద పీటేయడంతో జనం థియేటర్ బైటికి నెట్టేశారు. బాబీ సెట్‌లో షూట్ చేస్తున్న సమయంలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌తో ఓ సెట్ బాయ్, డ్రైవర్ వెకిలిగా బిహేవ్ చేశాడట. దాంతో పాటు షూటింగ్ ముందుకు సాగకుండా రోజూ లేట్ చేయడం కూడా జరిగిందట..దీంతో ఓ దశలో మహేష్ బాబు సహనం కోల్పోయి ఓ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడట. దీంతో జూనియర్ ఆర్టిస్టులంతా షూటింగ్ ఆపేశారట..మహేష్ బాబు సారీ చెప్తే కానీ తిరిగి షూటింగ్ జరగనీయమంటూ హెచ్చరించడంతో  కాసేపు అక్కడ షూటింగ్ ఆగిపోవడమే కాకుండా..ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డారు.
అలాంటి టైమ్‌లో విషయం తెలుసుకున్న బాలకృష్ణ నేరుగా సెట్‌కి వచ్చాడట ఒకే ఒక నిమిషంలో మహేష్‌బాబుతో మాట్లాడి..బాబు సారీ చెప్పే ప్రసక్తే లేదు అని డిక్లేర్ చేశాడు. అంతేకాదు మహేష్‌ని తనతో పాటు తన కార్లోనే ఎక్కించుకుని తీసుకుపోయాడట.దీంతో ఏం చేయాలో పాలుపోని జూనియర్ ఆర్టిస్టులు ఆ రోజుకి ప్యేకప్ చెప్పుకుని వెళ్లిపోగా..తర్వాత రోజు తిరిగి యధావిధిగా షూటింగ్ జరిగింది. ఇది జరిగిన తర్వాత బాలయ్యబాబు పెద్ద కుమార్తెని మహేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తారనే పుకార్లు బాగా విన్పించాయ్. మరోవైపు అశ్వనీదత్ కూడా తన కూతుళ్లలో ఒకరిని మహేష్‌కి కట్టబెడతారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ మహేష్ బాబు మాత్రం వీటిని కొట్టి పారేశాడు. హరికృష్ణ, బాలయ్యబాబుని తాను బ్రదర్స్‌గా భావిస్తానని ఇలాంటివాటికి చెక్ పెట్టండని సీరియస్‌గా చెప్పడంతో ఆ పుకార్లకి అడ్డుకట్ట పడింది. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణ పాపులర్ స్టార్లు కాగా వారి మధ్య విబేధాలు కొన్నేళ్లు చోటు చేసుకున్నాయ్. ఐతే ఆ తర్వాత మాత్రం కలిసిపోయారు. ఇప్పటికీ అదే స్నేహం మహేష్ బాబు, బాలయ్యబాబుల మధ్య కొనసాగుతుందని అనుకోవచ్చు. బహుశా అదే అనుబంధంతో పాటు..పైన సంఘటనవలన కూడా
 ఎన్టీఆర్ బయోపిక్‌లో  చేసేందుకు మహేష్ ఓకే చెప్పినట్లు అనుకోవాలి


Comments