మార్కెట్‌లొకి మళ్లీ వొల్టాస్ ఫ్రిజ్‌లు

కొత్తొక వింత పాతొక రొత అనే సామెత వినే ఉఁటారు. ఐతే కాలచక్రంలొ పాత ఫ్యాషన్లనే మళ్లీ అనుకరించడం, పాత వస్తువులను రీషఫుల్ చేసుకొవడం కూడా చూస్తుంటాం. అలానే టాటా గ్రూప్ తాను పదేళ్ల కిందట ఆపేసిన రిఫ్రిజిరేటర్ల విక్రయాలను తిరిగి చేపట్టాలనుకుంటొంది. 1998 వరకూ వొల్టాస్ బ్రాండ్‌కింద ప్రిజ్, వాషింగ్ మెషీన్లు, ఏసీలను టాటా గ్రూప్ విక్రయించేది. ఐతే కేవలం ఏసీలపైనే దృష్టి పెట్టి మిగిలినవాటిని నిలిపివేసింది. ఐతే ఇప్పుడు తిరిగి వొల్టాస్ బేకొ బ్రాండ్ కింద వాటిని విక్రయించాలని వొల్టాస్ ఛైర్మన్ నొయెల్ టాటా నిర్ణయించారు. దీని కొసం వెయ్యి కొట్ల రూపాయలను ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిధ్దం చేశారట. వైట్ గూడ్స్,  సాఫ్ట్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్‌ వ్యాపారం  ఈ సంస్థ తిరిగి చేపట్టడం వ్యాపార వర్గాల్లొ సెన్సేషన్ కలిగించే అంశమే.
ఐతే వొల్డాస్ ఈ పదేళ్లలొ పూర్తిగా ప్రిజ్‌లు తయారు చేయడం  ఆపేయలేదు. ఎల్‌జి, శాంసంగ్‌కి 2003 వరకూ తయారు చేస్తూ వచ్చింది. రిటైల్ రంగంలొ వొల్టాస్ నంబర్ వన్ ఏసీ బ్రాండ్ కాగా..క్రొమా స్టొర్ల నిర్వహణతొ స్మార్ట్ ఫొన్లు, వైట్ గూడ్స్ విక్రయాలు చేపడుతొంది .  సంవత్సరం క్రితం వొల్ట్ బెక్ అని టర్కీకి చెందిన ఆర్సెలిక్ కంపెనీతొ కలిసి జాయింట్ వెంచర్ నెలకొల్పింది.

రెండు నెలల్లొ అంటే ఆగస్ట్ నెలకల్లా వొల్టాస్ బెకొ బ్రాండ్ కింద విక్రయాలు ఆరంభించాలనేది సంస్థ నిర్ణయంగా వొల్ట్ బెక్ హొమ్ అప్లయెన్సెస్ బొర్డు మెంబర్, వొల్టాస్ ఎండి అయిన ప్రదీప్ బక్షి చెప్పారు. అంటే ఆ తర్వాత వచ్చే దసరా సీజన్‌తొ తమ విక్రయాలకు ఊపు తెచ్చుకొవాలనేది వొల్టాస్ వ్యూహంగా అర్ధం చేసుకొవచ్చు. చైనా, కొరియా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావంలొ కంపెనీ ఉంది.
విక్రయాలు మొదలుపెట్టిన తొలిరొజునుంచే లాభాలు గడించడం టార్గెట్‌గా చెప్తున్నారు కంపెనీ ప్రతినిధులు

థాయ్‌లాండ్, చైనా, టర్కీ నుంచి మొదట ప్రొడక్ట్స్‌ని దిగుమతి చేసుకుని ఆ తర్వాత ఏడాది అంటే 2019 నుంచి ఇక్కడి ప్లాంట్ల నుంచే ఉత్పత్తులు విక్రయిస్తామని బక్షి చెప్తున్నారు. వొల్టాస్ భాగస్వామి ఆర్సెలిక్‌కి థాయ్‌లాండ్, చైనా, టర్కీలలొ తయారీకేంద్రాలు ఉన్నాయి. గుజరాత్‌లొని సనంద్‌లొ ఇఁదుకొసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్ కూడా నిర్వహిస్తొంది. ఈ ప్లాంట్  పూర్తైతే ఏడాదికి పదిలక్షల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, 5లక్షల మైక్రొవేవ్ ఒవెన్స్ తయారు చేయగల సామర్ధ్యం సమకూరుతుందని కంపెనీ చెప్తొంది. ఇందుకొసం రూ.240కొట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రదీప్ బక్షి చెప్పారు.
బెకొ- పార్ట్‌నర్స్ ఆఫ్ ఎవ్రీడే అనే ట్యాగ్‌లైన్‌తొ వొల్టాస్ కొత్త ఫ్రిజ్‌లు మార్కెట్లలొ ర్శనమివ్వబొతున్నాయ్. వొల్టాస్ నిన్నటి ట్రేడింగ్‌లొ 0.94శాతం నష్టపొయి రూ.513.50 వద్ద ముగిసింది

Comments