ప్రతి సుఖం వెనుకా ఎంతో కష్టం ఉంటుంది..ఇదే పృధ్వీ జీవితంలో ఫిలాసఫీ


బాయిలింగ్ స్టార్ బబ్లూ...బత్తాయి బాబ్జీ...జకాస్ బాబ్జీ...ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప ఈ నిక్‌నేమ్స్ వినగానే మీకు గుర్తొచ్చే పేరు ఫృధ్వీరాజ్..హలో...వ్...థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా అంటూ ఖడ్గం సినిమాలో బ్రేక్ తెచ్చుకున్న ఈ ఫృధ్వీరాజ్ ఇప్పుడంటే అందరికీ నవ్వులు పంచుతున్నాడు కానీ..నిజంగానే మనోడు ఇండస్ట్రీకి వచ్చి థర్ట్ ఇయర్స్ దాటిపోయింది. జనానికి తాను చేసిన మొదటి సినిమా ఆ ఒక్కటీ అడక్కు అని చెప్తాడు కానీ..నిజానికి అతగాడి మొదటి సినేమా..గండిపేట రహస్యం ఇది 1989లో వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ క్యారికేచర్‌లో నటించిన ఫృధ్వీ ఆ సినిమా తర్వాత అయిపూ అజా లేకుండా పోయాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహించడమే. ఈ సంగతి పక్కనబెడితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఫృద్వీ సొంతఊరు. పృధ్వీ తండ్రిగారైన బలిరెడ్డి సుబ్బారావ్ కి నాటకాల పిచ్చి ఉండేదట. స్థానికంగా రైల్వే పార్సిల్ మాస్టర్‌గా పని చేసిన ఆయనతో పాటు శోభన్ బాబు,సత్యనారాయణ కూడా కలిసి నటించేవారట. అలా ఆయన ఓ నాటకం చూసిన ఎన్టీఆర్ తాను తీసిన కృష్ణావతారంలో కర్ణుడిగా నటించమని ఆఫర్ చేశారట. ఆ తర్వాత కూడా రణభేరి, పేదరాసిపెద్దమ్మ కథ, ధనమా దైవమా లాంటి సినిమాల్లో నటించారట. అలా ఆయన చెన్నైలోనే ఉండిపోగా..పృథ్వీ మాత్రం తన తల్లితో తాడేపల్లిగూడెంలోనే ఉన్నారట. అలా తండ్రి దూరం కావడంతో ఆస్తులు కరిగిపోగా..తల్లి కష్టపడి చదివిస్తే తన విద్యాబ్యాసం పూర్తి చేశారని పృధ్వీ గుర్తు చేసుకుంటారు.

తాడేపల్లిగూడెంలో చదువుకునే రోజుల్లోనే నాటకాలంటే మంచి ఆసక్తి ఉన్నా పృధ్వీరాజ్ విద్యార్ధి రాజకీయాలన్నా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడటఐతే నాటకాలు, లేదంటే క్రికెట్ అంటే బాగా ఇష్టంగా ఉండే ఫృథ్వీరాజ్ పుట్టడం కోనసీమలో పుట్టినా..రాయలసీమకి మకాం మార్చడం విశేషం.
డిగ్రీవరకూ శ్రీకాళహస్తి కాలేజీలోనే చదివాడట. శ్రీకాళహస్తిలో శివాలయం లేదంటే క్రికెట్ గ్రౌండ్ ఈ రెండే లోకంగా బతికాడట ఈ కామెడీ స్టార్. ఇప్పటికైనా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ దిగితే గ్రౌండ్ దడదడలాడిపోద్దని చెప్తాడు. అక్కడ్నుంచి తిరిగి ఆంధ్రాయూనివర్సిటీకి వచ్చి విద్యాభ్యాసం పూర్తి చేశాడట. అలా తన చదువుకి స్వస్తి
పలికిన పృద్వీ సినిమా ఇండస్ట్రీలో ప్రభాకర్ రెడ్డి తన తండ్రికి బాగా స్నేహితుడైనా కూడా ఆ విషయం బైటికి చెప్పకుండానే ట్రయల్స్ వేశాడు. ఇక్కడే ఆయన మానసికంగా పెద్ద దెబ్బ తిన్నాడట. తాను చదువుకునే రోజుల్లో ప్రభాకర్ రెడ్డిగారు తన ఫిజిక్ బావుంటుందనే మాట పట్టుకుని మద్రాస్ వెళ్లాడు. ఐతే ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం సందర్భాన్ని బట్టి అనేకానేక మాటలు చెప్తాం. ఇలా అయితే ఎలా ఇంత అమాయకుడివిగా ఉంటే కష్టం అని చెప్పగానే పృధ్వీ గుండెల్లో రాయిపడిందిట. తనని నమ్ముకుని వచ్చినందుకు తన దగ్గరే అట్టిపెట్టుకున్నా..తల్లి వరలక్ష్మి వచ్చి ప్రభాకర్ రెడ్డిపై వత్తిడి తీసుకురావడంతో ఓ హోటల్‌లో ఫ్రంట్ ఆపీస్ పని చూపించారట ప్రభాకర్ రెడ్డి..అలా తన సినిమా ఆశలు కల్లలుగా మిగిలిపోతాయానే భయంతో చిన్నా చితకా క్యారెక్టర్లు చేశాడట..అలా చేసిన సినిమాల్లో అత్యంత పెద్ద క్యారెక్టర్ గండిపేట రహస్యం..సరే ఆ స్టోరీ ఎలా ముగిసిందో ముందే చెప్పుకున్నాం కదా..అలా  సినిమా ఛాన్సులు తక్కువే రావడంతో  ఏడేళ్లపాటు జర్నలిస్టుగా కూడా పనిచేశాడు. తెలుగు టివి ఛానల్లకి ఓ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసిన సిటి కేబుల్‌లో కొన్నాళ్లు పని చేయగా.. ఆ తర్వాత ఈటీవికోసం ఏడేళ్లు పని చేశాడంటే ఎవరైనా నమ్మగలరా..భాగవతం సీరియల్లో ఒక్క నారదుడు తప్ప అన్ని క్యారెక్టర్లు చేశానని గర్వంగా చెప్తాడు.ఈ క్రమంలోనే ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో హాటల్ మేనేజర్ క్యారెక్టర్ చేసే సమయంలో రావుగోపాలరావుతో 40 రోజులు గడిపే అవకాశం దక్కిందట పృధ్వీకి. ఆ మండలం రోజులే తనకి జీవితం అంటే ఏంటో..సినిమా జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసిందని పృధ్వీ చెప్తుంటారు. ఇలా రోజులు గడుస్తుండగానే పృధ్వీని ఎంతగానో ప్రేమించిన తల్లి చనిపోవడం డిప్రెషన్‌లోకి నెట్టేసింది..కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ సినిమా మొదలుపెడుతున్నాడని తెలిసి కలిస్తే..సింధూరంలో ఛాన్స్ వచ్చిందట. అక్కడ్నుంచీ కృష్ణవంశీ ప్రతి సినిమాలో కన్పించినా గుర్తింపు రాలేదు..మా ఇంటి సందులో ఉండేవాడివి..నాకు ఎంతో దగ్గరైనవాడివి..నువ్ కాకపోతే నాకు ఎవరు ఛాన్సిస్తారు మంచి క్యారెక్టర్ ఇవ్వు అని కృష్ణవంశీని అడిగాడట. అలా ఖడ్గంలో క్యారెక్టర్ వచ్చింది పృధ్వీకి..సింగిల్ డైలాగే కదాని బాధపడుతుంటే..సినిమా రిలీజైన తర్వాత చూడు అని వంశీ చెప్పడాట. అలా .2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఇండస్ట్రీకి ఓ బాయిలింగ్ స్టార్‌ని ఇచ్చింది.. దాంతో అప్పటిదాకా చేసిన క్యారెక్టర్లు అన్నీ మరిచిపోయేట్లుగా పంచ్ డైలాగుల క్యారెక్టర్లు పృధ్వీకి వచ్చాయ్. బాగా భారీగా బండ పర్సనాలిటీతో కన్పిస్తున్నా...ఆయన నోటి వెంట కాస్త ముద్దగా వచ్చే డైలాగ్స్‌కి ప్రేక్షకులు కేరింతలు కొట్టడం ప్రారంభమైంది. అలా 16ఏళ్లుగా పృధ్వీ అలరిస్తూనే ఉన్నాడు..ఈ మధ్యనే దేశముదుర్లు అనే సినిమాలో హీరో క్యారెక్టర్ చేసే రేంజ్‌కి వెళ్లింది పృథ్వీ క్రేజ్ 2017లో 15 సినిమాలు..2016లో 14 సినిమాలు..చేయగా ఇప్పటికి దాదాపు వంద సినిమాలు పూర్తయ్యాయ్. పొలిటికల్‌గా కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించే పృధ్వీరాజ్ మంచి విద్యావంతుడు కూడా కావడం విశేషం. ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌, జర్నలిజం‌లో డిప్లొమా పూర్తి చేసిన పృధ్వీ బతికినంత కాలం నిజాయితీగా బతకాలని చెప్తుంటాడు

Comments