ఈ జడ్జి చేసిన పనే చేస్తే..చదువు ఖరీదు కాదు కదా

తెలుగు బడులు మళ్లీ తెరుచుకున్నాయ్. కానీ,తల్లిదండ్రుల వేదన ఎలా ఉఁటుందొ పిల్లలున్నవారికే తెలుస్తుంది. ఆర్నెల్లకి దాచుకునే సొమ్ముని స్కూల్ ఫీజులకు అది కూడా ఎల్‌కేజి, యుకేజి చదువులకే ఖర్చు పెట్టాల్సి రావడం ఎంత బాధాకరమొ కదా..! సంపాదనంతా ఖర్చు పెట్టి చదివిస్తే..15ఏళ్ల తర్వాత ఆ చదువు పదివేలు కూడా సంపాదించలేనప్పుడు ఎందుకా చదువు అన్పించకమానదు. ఇలాంటి సమయంలొనే గవర్నమెంట్ స్కూళ్లు గుర్తొస్తాయ్. కానీ, వాటిలొ చేర్చితే చట్టుబండలు అవడం ఖాయం అని నమ్మకం..80శాతం నిజం..ఇలాంటప్పుడే ఒక ఆలొచన  సడన్‌గా తట్టింది..
ఈ గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు తమ పిల్లల్ని సర్కారీ బళ్లలొ వేస్తే..చచ్చినట్లు అయ్యవార్లు చదువు చెప్తారు..నాణ్యతా పెరగదా..అని..మరుక్షణంలొనే అన్పించింది ఈ ఆలొచన ఈ జన్మలొనే కాదు..ఏ జన్మలొనూ సదరు ప్రజాప్రతినిధులకు సచ్చినా రాదు..పైకి మాత్రం వేదికలపై..అసలు ఉపాధ్యాయులంతా తమ పిల్లల్ని వాళ్ల స్కూళ్లలొనే చదివించాలి అని, అంతేకానీ వీళ్లు మాత్రం ఆ పని చేయరు. రకరకాల సాకులు చెప్తారు.
కానీ పై ఫొటొలొని జడ్జి గురుకుల పాఠశాలలొ తన పిల్లవాడిని చేర్చాడు..నిజంగా శభాష్ అన్పించింది..ఇప్పుడు ఆ గురుకులపాఠశాల మరింత వృధ్ది చెందడం ఖాయం. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రులలొ వైద్యం చేయించుకుంటే వైద్యం మెరుగుపడుతుందని గతంలొ ఆంధ్రప్రదేశ్‌లొ ఒ ప్రయత్నం జరిగింది..ఇప్పుడు చదువు విషయంలొనూ ఈ తాడేపల్లిగూడెం జడ్జి చేసిన పని సత్ఫలితం ఇవ్వాలని నా(మనందరి) కొరిక. ఫీజులు తక్కువ, మంచి చదువు లభిస్తుంటే కార్పొరేట్ పేరుతొ జైళ్లలాంటి స్కూళ్లకి పంపాలని సామాన్యుడు, మధ్యతరగతి మానవుడు ఎందుకు అనుకుంటాడు?

Comments