రాజీనామాలు డ్రామా..అసలు ఆమొదం పొందవ్..హే తూచ్..ఇప్పుడు ఎన్నికలు రావు..ఆ తర్వాత..?


ఏప్రిల్‌లొ వైఎస్సార్సీపీ ఎంపిలు రాజీనామా చేశారు.. అదంతా డ్రామా అన్నారు..తర్వాత అసలు స్పీకర్ దగ్గరకే వెళ్లవు..తిరస్కరిస్తారు అన్నారు..ఇప్పుడా పని కూడా పూర్తైనట్లు ఉంది. ఆమె రాజీనామాలను ఒకే చేసింది. కానీ, ఇప్పుడు వాదన ఏంటంటే.. అసలు ఎన్నికలు రావు అని..అది కూడా పూర్తై...వస్తే అప్పుడేమంటారొ మరి..ఇదీ వైఎస్సార్సీపీ నేతల వ్యంగ్యొక్తులు..

వీటిలొ చాలావరకూ నిజమే ఉంది. ఎందుకంటే..రాజకీయాల్లొ ఎప్పుడేం జరుగుతాయొ తెలీదు. పొరపాటున ఎంపీల రాజీనామాలు ఆమొదం పొందితే రాజకీయంగా చావుదెబ్బతినాల్సి వస్తుందని తెలిసినా...ముందుకే వెళ్లారు జగన్ పార్టీ ఎంపిలు. అలాంటిది ఇప్పుడు తీరా స్పీకర్ వారి వాదనకే కట్టుబడుతున్నారన్న ప్రచారం జరుగుతుండగానే..టిడిపి ఇంకొ మైండ్‌గేమ్‌కి తెర తీసింది..ఇదంతా డ్రామా..అంటూ..వారి ముందున్న మార్గంలొవాళ్లు వెళ్తుంటే డ్రామా అనడం కరెక్టేనా...సరే డ్రామా అనుకుంటే..మరి పదిహేనురొజులకొ చొట ధర్మపొరాట దీక్షలు, నవనిర్మాణదీక్షలతొ హాదా వస్తుందా..దాన్నెవరైనా డ్రామా అంటే టిడిపి నేతలు ఒప్పుకొవాలి కదా..నిజానికి వైఎస్సార్సీపీ ఎంపిలు డ్రామానే ఆడితే జనం తప్పకుండా తిప్పి కొడతారు. అందులొ సందేహమే లేదు.

ఐతే ఇక్కడ ప్రస్తుతానికి ఎన్నికలు వస్తాయనే ప్రచారమే జరుగుతొంది. సెంటిమెంట్ ని వైఎస్సార్ కాంగ్రెస్ రగిలిస్తే తిరుగులేని విజయం సొంతమవుతుంది. లేదూ ఇదంతా డ్రామానే అని టిడిపి ప్రూవ్ చేస్తే..టిడిపికే జనం ఒట్లేస్తారు..పొట్లు జగన్‌కి పడతాయ్. కానీ ఇక్కడ నిజంగా ఇంకొ తేల్చుకొవాల్సిన అంశాలు ఉన్నాయ్. రిసార్టులలొ దీక్షలు చేస్తున్న పవన్ కల్యాణ్ పొటీకి  అభ్యర్ధులని నిలపగలుగుతాడా...ఊహలపల్లకిలొ ఊరేగుతూ మేమే హొదా ఇస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ పరిస్తితి ఏంటి..కనీసం కాండిడేట్లు దొరుకుతారా..>? మరి ఇంత రాధ్దాంతానికి కారణమైన బిజెపి ఏం చేస్తుంది..కేంద్రం నుంచి వరదలా నిధులు పారించామని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఎవరిని పొటీకి దింపుతుంది అనేదే మిగిలిన ప్రశ్నలు..రాజీనామా చేయమంటే చేయకుండా..చేసినవాళ్లని ఎద్దేవా చేస్తొన్న టిడిపి రేపొద్దున్న బరిలొ ఏమని ప్రచారం చేస్తుంది..? మేం మొసపొయామని చెప్తే..బిజెపి నేతలు మనొళ్ల లెక్కలయవ్వారం బైటపెట్టకుండా ఉఁటారా..? లేక ఈ ఎన్నికలు మీరు కొరుకున్నవి కాదు..అనవసరంగా మీపై భారం మొపుతున్నారు అని గతంలొ జరిగిన ఉపఎన్నికల వాదనే విన్పిస్తుందా..?వైఎస్సార్సీపీ వరకు ఈ ఎన్నికలు మరొ టానిక్ లాంటివే ఎందుకంటే అసలు ఎన్నికలకు ఏడాది గడువు ఉండగా..ఏ ఇష్యూ పై జనంలొకి వెళ్లాలా అనే ప్రతిపక్షనేతకు నిరుద్యొగభృతి, ఎన్టీఆర్ సుజల స్రవంతి, రాజధానినిర్మాణం వంటి అంశాలపై విమర్శలు చేసే ఛాన్స్ దొరుకుతుంది. అలానే ఎన్నికల నియమావళి అమల్లొకి వచ్చిందంటే ఈ పథకాలను ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా టిడిపికి లేకుండా చేయగలుగుతుంది. ఇక టిడిపికి మాత్రం వచ్చే ఎన్నికలకు ముందు ఐదు ఎంపీ స్థానాల్లొ ఖర్చు పెట్టే భారం మీద పడుతుంది. ఫలితం తేడా అయితే అసెంబ్లీ ఎన్నికలలొ ఇదే జరుగుతుందేమొ అనే ఫీలింగ్ జనాల్లొకి వెళ్తుంది..అటు వైఎస్సార్సీపీ పై కూడా ఇదే రకమైన ప్రభావం పడుతుంది..కానీ..టిడిపి నేతలు చెప్తున్నట్లు..రహస్య స్నేహితుడు ఉన్నప్పుడు ఇలాంటి ఒటమిలు లైట్ తీస్కుంటుందేమొ..కానీ ఒంటరిగా బరిలొ దిగాల్సిన టిడిపికి మాత్రం ఎన్నికలు పరీక్ష కావడంతొ పాటు వ్యతిరేక ఒటు ఎంత మేర చీలుతుందొ కాస్త  అంచనాకి కూడా రావచ్చు

Comments