మనదేశంలో మగాడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు కానీ..ఆడది మాత్రం రెండో పెళ్లి చేసుకుంటే అదో ఘోరం అన్నట్లు చూస్తారు. ఆ లిస్టులో ఆడాళ్లే ఎక్కువ కూడా..ఇక సెలబ్రెటీ అయితే చెప్పేదేముంది..సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు వచ్చిన తర్వాత ప్రతి వాడూ హీరోనే ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు కామెంట్ పెట్టుకుంటూ పోతాడు. ఇదే సిచ్యుయేషన్‌ని ధైర్యంగా ఫేస్ చేస్తోన్న రేణూ దేశాయ్ ఇంకో మంట మండించింది. పవన్ కల్యాణ్‌కి కొన్ని సంవత్సరాలుగా విడిగా ఉంటున్న తనకి  తోడు కావాలని అన్పిస్తుందని ఎన్నోసార్లు చెప్పుకున్న రేణూ నిశ్చితార్ధం అయినట్లు కూడా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. దీంతో పాపం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు.
వీళ్ల పైత్యం చూస్తుంటే..ఒకళ్లో ఇద్దరూ సచ్చినా సస్తారు అన్పించకమానదు. వాళ్లలో ఒక పైత్యకారి ఆమె పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయంటూ స్పందించడమే ఇందుకు పరాకాష్ట. ఐతే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా..తనకి సపోర్ట్ ఇస్తోన్నవాళ్లకి కృతజ్ఞతలు చెప్పిందామె. నిజానికి ఇలా స్పందించేవాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వడమనేది అంత అవసరం లేదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత, కుటుంబ విషయాల్లోని బాధలు సుఖాలు వాళ్లకే తెలుస్తాయి కానీ..బైట కూర్చుని నాలుగు రాళ్లు వేద్దామనే వెధవలతో పని ఏముంది.
పైగా ఇందులో హీరో పెళ్లాం (ఒకప్పుడు ) కాబట్టి అతగాడు ఏం చేసినా పడి ఉండాలనే ధోరణే ఎక్కువ కన్పించడం దారుణం. ఐతే రేణూదేశాయ్ కి మద్దతు పలుకుతున్నవారిలో కొంతమందికి నిజాయితీ లేదు. కేవలం పవన్‌ని వ్యతిరేకించే ఫ్యాన్స్ కొంతమంది కావాలని ఇలా ట్రోల్ చేసేవాళ్లూ ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులను పెళ్లాం బిడ్డలను సరిగా చూసుకోవడం చేతగాని ప్రతి వెధవా ఊళ్లోవాళ్లకి సలహాలు  ఇచ్చేందుకు బైల్దేరుతుంటారు.వారిలో 90శాతంమంది ఇప్పుడు ఫేస్ బుక్ ట్విట్టర్లో కాలం గడుపుతున్నట్లు తేలింది. అందుకే రేణూదేశాయ్ వ్యక్తిగతం కానీ స్వగతంకానీ ఆమెకే వదిలేస్తే బెటర్.

Comments