కనీస వేతనం ఇయ్యరయ్యా...ఉరిమి ఉరిమి పడ్డ చంద్రబాబు


వాళ్లేదొ పాపం గుళ్లకి వచ్చిన భక్తులకు క్షవరం చేసి..కాస్త పొట్ట పొసుకునేవాళ్లు..తమకి కమిషన్ కాదు జీతం కావాలంటూ సమ్మెకి దిగారు. మంగలి కత్తిని తలపై పెట్టేది లేదంటూ మూడు రొజులు స్ట్రైక్ చేశారు. ఈ మూడు రొజులు వాళ్లకి వచ్చే ఆ కాస్త డబ్బూ రాదు. ఐనా ఎందుకు చేశారంటే..ఇలాగైనా తమకి జీతం రూపంలొ భరొసా దక్కుతుందని..కానీ ఇవాళ హఠాత్తుగా చంద్రబాబు గారు తమకి అన్ని కొరికలు నెరవేర్చారంటూ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు
కానీ ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు తీరు చూసి మాకు ఆశ్చర్యం వేసిందని..జగన్ ఒక అడుగు ముందుకేసి ఇదేం తీరని విస్తుబొయానని ట్వీట్ చేశాడని ప్రచారం జరిగింది. అటు ఒకటంటే..ఇటు ఇంకొటనడం మామూలే కదా అనుకుంటే..ఒక వీడియొ కన్పించింది. అందులొ చంద్రబాబు సమ్మె చేస్తున్న వారితొ మాట్లాడిన సంభాషణ చూస్తే..పాపం చంద్రబాబు ఎందుకింత ఆవేశపడుతున్నారు అన్పించింది. ఎందుకంటే ఆయన మాట్లాడింది పూర్తిగా సబబు కానీ..అలా  " ఏ...వినయ్యా...ఏం జేస్తావొ చేస్కొ..ఏమనుకుంటున్నారు...ఇలా బెదిరిస్తే లెక్క చేయను..ఒక్కళ్లు కూడా రొడ్డు మీద తిరగరు ...కనీస వేతనాలు ఇయ్యరయ్యా...!" అంటూ మాట్లాడటం మాత్రం చాలా అసహజంగా అన్పించింది..నిజానికి ఈ వ్యవహారంలొ ఆయనే స్వయంగా జొక్యం చేసుకొవాల్సింది కాదు..ఎటూ బొండా ఉమా ఏదొ సెటిల్ చేస్తాను..ఆల్రెడీ అంతకుముందే కొన్ని హామీలు ఇచ్చాం అని చెప్పి ఉన్నాడు కాబట్టి..అతగాడి ద్వారానే ఏదైనా చేయించాల్సింది..తీరా ఇప్పుడు వాళ్లు అడిగినది మొత్తం కాకపొయినా కాస్తైనా ఇచ్చి కూడా విమర్శల పాలు కావాల్సి వచ్చింది

Comments