ఈ సూపర్‌స్టార్ ఒకప్పుడు వేసిన చీప్ క్యారెక్టర్లు చూస్తే..ఖచ్చితంగా ఆశ్చర్యపొతారు


తెరపై కన్పించడం మొదలుపెట్టి 40 ఏళ్లవుతున్నా..ఆయన స్టైల్‌కి తిరుగులేదు. ఏజ్ ఎంత వచ్చినా..యూత్‌లొ ఆయన క్రేజ్‌కి తిరుగులేదు. ఆయన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు..పైన దేవుడు శాసించకపొయినా..ఈ బాసు శాసిస్తే మాత్రం ఫ్యాన్స్‌ పాటిస్తారు. దేశం దాటి విదేశాలల్లొని జనం కూడా ఈయన ఫ్యాన్సే..పంచ్ డైలాగ్ అంటే గుర్తొచ్చేదే ఆయన. అసలు ఇలాంటి ఉపమానాలు..పరిచయాలు..ఉపొద్ఘాతాలూ అవసరం లేని పేరు..రజనీకాంత్..ప్రతి తరంలొ తనకి ఫ్యాన్స్ ఉన్నారు..ఇంకొ పదేళ్లూ ఆయనే సూపర్ స్టార్ అంటే అతిశయొక్తి కాదు..రజనీ సినిమా మొదలైందంటేనే అదొ శతదినొత్సవ వేడుక అంత సంబరం..


ఇక రిలీజైతే ఫ్యాన్స్ సంబరం చెప్పలేం..వరస ఫ్లాప్‌లతొ కాస్త ..వయసైపొయి కాస్త ఆయన ఫ్యాన్స్ దూకుడు తగ్గించారేమొ కానీ రజనీకాంత్ వేగం మాత్రం తగ్గలేదు. ఒక్కొ సినిమా ఒక్క వంద కొట్లు పెట్టు ఇప్పుడు..20 ఏళ్ల నుంచి మధ్యలొ ఒకటి రెండు సినిమాలు తప్ప అన్నీ ఒకేలా ఉంటాయనే విమర్శ ఉంది..ఐనా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు దద్దరిల్లిపొతాయ్. కొట్లకి కొట్లు కనకవర్షం కురిపిస్తాయ్. వరసగా రెండు ఫ్లాప్ సినిమాలు కబాలి, కాలా అయినా...నిర్మాతకి మాత్రం నష్టం రాలేదు. ఎందుకంటే పరాజయం పాలైన సినిమాలు కూడా డబ్బు వసూలు చేస్తుంది కాబట్టి..







ఇంత హిస్టరీ ఉన్న రజనీకాంత్..మొదట్లొ చీప్ క్యారెక్టర్లు..ఆవారా క్యారెక్టర్లు, ఇఁకా చెప్పాలంటే ఆడది కన్పిస్తే చాలు ఎలాగైనా అనుభవించాలనే క్యారెక్టర్లు చేశాడంటే నమ్మగలరా..అది కూడా దాదాపు 20 సినిమాల్లొ ఇదేరకం వేషాలు..ఒక రకంగా ఆయన క్యారెక్టర్ తెరపై కన్పించిందంటే చాలు అప్పట్లొ మహిళలు మెటికలు విరిచేవారట.  తన కెరీర్ రెండొ సినిమా అయిన కథాసంగమలొ ఒ గుడ్డి మహిళను రేప్ చేస్తాడు. తర్వాత కమల్ హసన్ శ్రీదేవితొ నటించిన మూండ్రుముచ్చి సినిమాలొ కమల్ చనిపొతాడు. తన ఫ్రెండ్ ప్రేమించిన శ్రీదేవిని ఎలాగైనా వశం చేసుకొవాలనే నీచమైన క్యారెక్టర్‌లొ రజనీకాంత్ ప్రేక్షకులు తిట్లు తిన్నాడు. అంటే అంత బాగా నటించాడన్నమాట. బాలుజేను, అవగల్, పదహారు వయదినేలేలొ కూడా సేమ్ క్యారెక్టర్స్. ఇక తెలుగులొ అయితే మరీ దారుణంగా కామెడీ ఆరిస్ట్ అయిన అల్లురామలింగయ్యతొ కలసి హీరొ హీరొయిన్లని విడదీసే క్యారెక్టర్ కూడా చేశాడు. అది 1977లొ విడుదలైన తొలిరేయి గడిచింది. ఇందులొ హీరొ మురళిమొహన్ హీరొయిన జయచిత్ర, మొహన్ బాబు కూడా నటించారు. ఇలాంటి క్యారెక్టర్ చేసిన నటుడు సూపర్ స్టార్ అవగలడని ఎవరూ ఊహించరు. అదే  ఏడాది తమిళంలొ విడుదలైన గాయత్రి సినిమాలొ అయితే తన భార్యతొ బెడ్‌రూమ్ సీన్లని ఆమెకి తెలీకుండా చిత్రీకరించే పొర్నగ్రాఫర్‌గా నటించాడు. ఇతగాడి చెర నుంచి భార్య అయిన శ్రీదేవి ఎలా తప్పించుకుందొ అనేదే ఈ సినిమా కథ. చిన్నవయస్సులొనే శ్రీదేవి ఇంత బరువైన క్యారెక్టర్ చేయడం విశేషం. క్లైమాక్స్‌లొ ఆమె చనిపొతుంది.






ఇలాంటి శాడిస్ట్ క్యారెక్టర్ చేసిన రజనీకాంత్‌కి అసలు సిసలు హీరొ క్యారెక్టర్ వచ్చింది మాత్రం 1978లొ వచ్చిన అన్నదమ్ముల సవాల్..అలా రెండొ హీరొగా చేస్కుంటూ..భైరవి అనే సినిమాతొ సొలొ హీరొగా మారాడు..అప్పటిదాకా అతనిలొ విలన్ ని, చీప్ క్యారెక్టర్లకి మాత్రమే చూసిన జనం ఆ సినిమా తర్వాతే హీరొగా అంగీకరించారు. భైరవి రజనీకాంత్‌కి 25వ సినిమా..అప్పటిదాకా అలా చీప్ క్యారెక్టర్లు మాత్రమే చేసిన ఆయన తర్వాత ఇక తిరిగి చూడలేదు..ఐతే ఎలాంటి క్యారెక్టర్ చేసినా..అప్పటి నటులను పాత రొజులను మర్చిపొలేదు కాబట్టే ఎంత ఎదిగినా ఒదిగినట్లు కన్పిస్తారు రజనీకాంత్..ఇంత దారుణమైన క్యారెక్టర్లు చేసిన వ్యక్తి ఇండియన్ సూపర్ స్టార్ అవుతాడని..అది కూడా 70 ఏళ్లు వచ్చినా తన స్టార్ డమ్ ఏమాత్రం తగ్గదని మాత్రం అప్పట్లొ ఎవరూ ఊహించలేరు. ఆ అవకాశమే ఉండదు కూడా..మన తెలుగులొ ఇలాంటి  ఛాయలు మనకి తెలుగులొ ఒక్క చిరంజీవిలొ మాత్రమే చూస్తాం..పట్టుదల, తపన, అవకాశం, అదృష్టం ఇవన్నీ కలిసే వీళ్లని సూపర్ స్టార్లు చేశాయని చెప్పొచ్చు.







Comments