అందుకే బాబుతో పెట్టుకోవద్దు


విమానరంగంలో ఎయిర్ఏషియా అడ్డదారిలో లైసెన్స్ తెచ్చుకుంటుందంటూ ఆరోపణలు వస్తుండగా..ఇందులో
చంద్రబాబు ప్రస్తావన రావడం సెన్సేషన్ అయింది. ఐతే అంతకు మించిన వార్త ఇప్పుడు గుప్పుమంటోంది. ఏ వ్యవస్థనైనా, మేనేజ్ చేయగలడని ఏపీ ముఖ్యనేతపై ఇప్పటికే బోలెడంత ప్రచారం జరుగుతుండగా..ఈ ఎయిర్ఏషియా వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టాక్ వస్తోంది. మనవాడు ఏం చేసినా చెల్లుతుందనే కోణంలో కులాన్ని పైకి తెచ్చి కొంతమంది మీడియాబాసులు పార్క్ హయత్‌లో సిట్టింగ్ వేశారట. తెలుగు మీడియాలో ఈ కేసుకి సంబంధించి కానీ..ప్రస్తావనా మాత్రంగా కూడా  బాబుగారి పేరు రాకూడదని వీళ్లంతా చర్చించుకున్నారట.

కేసులో ఇరుక్కున్న ఎయిర్ఏషియా అధినేత టోనీ ఫెర్నాండెజ్,  ఆ సంస్థ సీఈఓ శాండిల్య
మాట్లాడుకుంటున్నట్లుగా ఓ ఆడియో టేప్ సిబిఐకి చిక్కింది. అందులో వాళ్లిద్దరి సంభాషణల సారాంశం..చంద్రబాబుని పట్టుకుంటే ఎలాంటి పనైనా జరిగిపోతుందని..ఆయన ఏలాంటి వ్యవస్థైనాన మేనేజ్ చేయగలడని శాండిల్య చెప్పడం..టోనీ ఫెర్నాండెజ్ దానికి మీరు ఏదైనా చేయండి మనకి పని కావాలని
చెప్పడం బైటపడింది.

ఆ తర్వాతే టోనీ ఫెర్నాండెజ్‌తో అశోక్ గజపతిరాజు క్లోజ్ గా ఉన్న ఫోటోలు..వాళ్లిద్దరితో పాటు కంభంపాటి రామ్మోహన్ రావ్ కలిసి ఉన్న ఫోటోలుకూడా ఇప్పుడు ఏదో జరిగిందనే భావన కలిగిస్తున్నాయ్. ఎందుకంటే ఎయిర్ ఏషియా సంస్థ ఇండియాలో ఐదేళ్లు సర్వీసులు నడపలేదు. అలానే 20 ఫ్లైట్లూ లేవు..ఈ రెండూ ఉంటేనే ఇంటర్నేషనల్ సర్వీసులు నడపడానికి లైసెన్సులు ఇస్తారు..ఐతే తర్వాత ఈ నిబంధనలు సడలింపు జరిగింది. దీనికి కారణం లంచాలు ఇవ్వడమే కారణం అని సిబిఐ నిగ్గు తేల్చింది. ఇదే కేసులో టోనీ ఫెర్నాండెజ్ పై చార్జ్ షీటు దాఖలు అయింది కూడా అలాంటి సడలింపు అశోక్ గజపతిరాజు హయాంలోనే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు హస్తం ఉందనేది టాక్. దానికి సిబిఐ చేతికి చిక్కిన ఆడియో నిదర్శనంగా చూపుతున్నారు. మార్చి 21న హైదరాబాద్ నోవాటెల్‌లో ఎయిర్ఏషియా బోర్డు మీటింగ్ జరిగింది. ఇక్కడే ఈ తారుమారు  వ్యవహారానికి నాందిపడిందని..లైసెన్సుల జారీ వ్యవహారానికి ఒప్పందం ముడుపులు చేతులు మారడం కూడా ఇలానే అయిందని ప్రచారం జరుగుతోంది..ఐతే ఇంత జరిగినా..ఎక్కడా ఏ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి వార్తా రాకపోవడం విచిత్రం..ఇలా అవడం వెనుక మీడియాబాసులను బాబు మేనేజ్ చేయడమే కారణమంటున్నారు

Comments