పసికూనలాంటి ఈ హీరోపై ఓ ఘరానా నిర్మాత చేసిన కుట్ర తెలుసా


నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్..రిలీజై పదేళ్లు దాటుతున్నా..ఇప్పటికీ ఆ సినిమా అంటే యూత్‌ విరగబడి చూస్తుంటారు ఓ ట్రెండే క్రియేట్ చేసిన సినిమా..అందులో నటించిన హీరోలంటే మాంచి క్రేజ్ కూడా..ఐతే ఈ హీరో మాత్రం ఈ పదేళ్లలో రెండంటే రెండే సినిమాల్లో  నటించడమే కాకుండా..ఓ రకంగా కెరీర్ నాశనమైంది కూడా..దీనికి కారణం ఓ ప్రొడ్యూసర్..కేవలం తన అనుభవరాహిత్యం, తప్పటడుగులతో పాటు  ఇండస్ట్రీలోని మాయాజాలానికి బలైపోయిన ఈ హీరో గురించి తెలిస్తే పాపం అనుకోకుండా ఉండరు..కానీ ఇప్పటికీ ఇతగాడి మాటలకు కాస్త వళ్లు మండుతుంది కూడా
అతనే హ్యాపీడేస్ వంశీ..ప్రెండ్స్ ని మోసం చేసి..చివరకు గాళ్ ప్రెండ్ చేతిలో మోసపోయిన శంకర్‌గా బాగా పాపులర్ అయిన వంశీ పూర్తి పేరు చాగంటి వంశీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో పుట్టిన ఇతను తండ్రి బ్యాంకు ఉద్యోగి కావడంతో చాలా ఊళ్లే తిరిగి రావడంతో చాలామంది యూత్  ఇతన్ని మా ఊరివాడే అనుకునేవారు అప్పట్లో.. హ్యాపీడేస్‌లో నటించిన వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా, అంతా మంచి పేరుతో పాటు సినిమాలు తెచ్చుకున్నా..ఇతగాడు మాత్రం చతికిలబడ్డాడు..హిట్టో ఫ్లాపో ఓ నాలుగు సినిమాల్లో నటించకుండా..స్క్రిప్ట్ బావుంటేనే చేస్తా అంటూ భీష్మించుకు కూర్చున్నాడు..కాల్ సెంటర్ అనే సినిమా ఒక్కటి చేయగా అది కాస్తా ఫట్టైంది. ఐతే ఆ తర్వాత కే విశ్వనాధ్ తీసిన శుభప్రథం సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో మాత్రమే కన్పించాడు. నిజంగానే తనని ప్రూవ్ చేసుకోవాలనుకున్న అతని ప్రయత్నం చివరకు వంశీని ఆర్ధికంగా కూడా దెబ్బతీసింది. సొంతంగా తానే నిర్మాతగా మారి పేరెంట్స్ అనే సినిమా తీయగా..అది కాస్తా పూర్తై కూడా విడుదల కాకుండా మిగిలిపోయింది. ఐతే ఇక్కడే అతని కెరీర్‌ని చావుదెబ్బ కొట్టాడు ఓ ప్రొడ్యూసర్.
మొత్తం సినిమాని తానే తీసుకుంటానని..పేరు కూడా తనదే వేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేశాడట. ఆ ప్రొడ్యూసరే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్..సినిమా తీసినందుకు కానూ మొత్తం కోటిరూపాయల పదిలక్షలు ఇస్తాం..ఆ తర్వాత విడుదల చేయడం అంతా మా పనే అని చెప్పి ఆ తర్వాత ఐపూ ఆజా లేకుండా పోయాడట సినిమా విడుదలైతే తన ప్రతిభకి మంచి గుర్తింపు వచ్చి ఉండేదని వాపోతాడు ఇప్పటికీ వంశీ..ఐతే అలా తనని మోసం చేస్తున్న సంగతి గ్రహించకుండా..అనుభవరాహతియంగా వ్యవహరించడం కూడా వంశీ తప్పు అంటారు కొందరు. ఐతే ఇక్కడ ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కూడా ఆ తర్వాత బావుకుంది లేదు..వరసగా సినిమాలు దెబ్బతినడంతో బొక్క బోర్లాపడ్డాడు. ఐనా ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ చేసిన మోసాన్ని తక్కువగా చూడకూడదు. అప్పుడప్పుడే పైకొచ్చే ఓ హీరోని ఇలా తొక్కేయడం కేవలం ఇండస్ట్రీలోనే  సాధ్యపడుతుందంటే నమ్మాలేమో..ఆ తర్వాత పాపం వంశీ, రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటిలో దేవినేని మురళి క్యారెక్టర్ చేశాడు..ఐనా బ్రేక్ లేదు..సినిమాలు లేకపోయినా...ఈటీవీలో మురళీమోహన్‌తో కలిసి టివిషోలు కూడా చేశాడు..ఇప్పుడవీ లేవు..సినిమాలపై ఆశతో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలిపెట్టి వచ్చిన వంశీ పాపం ఇప్పుడు తనకి ఉన్న పరిచయాలతో కొన్ని కంపెనీలకు ట్యాక్స్ కన్సెల్టెంట్‌గా పని చేస్తున్నాడు..ఎప్పటికో అప్పటికి తన పేరెంట్స్ సినిమా విడుదల చేస్తా అంటూ మాట్లాడుతుండటమే ఇంకా జాలి కలిగిస్తుంది. మొత్తానికి అలా ఓ ఔత్సాహిక నటుడు తన ఆశ నెరవేరకుండానే
అర్ధాంతరంగా సినిమారంగంనుంచి నెట్టివేయబడటం బాధాకరం

Comments