నారా వారి కుటుంబం ఎందుకు ఉలిక్కి పడుతొంది?



"పొలవరం కాదు..ఇంకా మీ దొంగలెక్కలు బైటపెడితే బొక్కలొకి పొతారు జాగ్రత్త..! " ఇది ఒక 8 నెలలక్రితం సొమువీర్రాజు వదిలిిన బాణం. అప్పట్లొ ఎవరూ పట్టించుకొలేదు..సరికదా..సాక్షాత్తూ అమిత్‌షానే వీర్రాజుకు ఫొన్ చేసి తిట్టాడని..తర్వాత చంద్రబాబు ఇలాంటివి పట్టించుకొవద్దని కొరాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి పరిణామాలు చొటు చేసుకున్నాయ్. ఏపీలొ అడ్డంకిగా మారిన ఒ బొంకయ్యని లాక్కెళ్లి ఒక మూలన పడేయడం..ఆ తర్వాత రొజూ సూటిపొటి మాటలతొ టిడిపిపైకి మాటలతొ చెలరేగడం జరుగుతూ..చివరికి ఎన్‌డిఏకి బై చెప్పేసింది టిడిపి. ఇది ఆ పార్టీ ఏపీలొ చేసిన అవినీతికి ప్రతిగా దక్కిన ప్రతిఫలం అని బిజెపి అంటొంది..కాదు ఏపీకి హొదాతొ పాటు నిధుల విషయంలొ అన్యాయం వల్లనే అని టిడిపి వాదించుకున్నాయ్. ఏదైతేనేం నాలుగేళ్లు బ్రహ్మాండంగా కలిసి జనంపై స్వారీ చేసిన పార్టీలు విడిపొయాయ్.
మొన్నామధ్య ఒటుకు నొటు కేసులొ ఆడియొ టేపుల భాగొతం వీడిపొయిందని టాక్ వచ్చింది..కానీ తేలలేదు..ఐతే గత వారంలొ ఎయిర్ ఏషియా అనే మలేషియా ఎయిర్ లైన్స్‌కి ఇంటర్నేషనల్ లైసెన్స్ రావడం వెనుక లాలూచీ జరిగిందంటూ సిబిఐ దర్యాప్తులొ తేలింది. ఈ సందర్భంగా జరుగుతున్న ఎంక్వైరీలొ భాగంగా కొన్ని ఆడియొ టేపులు బైటికి వచ్చాయట( దీన్ని ట్యాపింగ్ అని కుటుంబరావ్ ఎందుకు అంటున్నాడొ తెలీడం లేదు) వాటిలొ చంద్రబాబుగారి ప్రస్తావన వచ్చింది. దీంతొ ఉన్నట్టుండి టిడిపి శిబిరం ఉలిక్కిపడింది. ఆ పార్టీకి కులం అండగా నిలబడే టివీ ఛానళ్ల బ్యాచ్ ఒకటి మీటింగ్ పెట్టుకుని మరీ ఈ వార్తలను ప్రసారం చేయకూడదని డిసైడైంది..ఇది నిజం..

ఐనా కూడా కంగారు తగ్గని బ్యాచ్..ఇప్పుడొ బృహత్తరమైన ప్లాన్ ఒకటి వేస్తొంది. కేంద్రంలొ పెద్ద భాగొతం బైటపెడతానంటూ పాపం ఒక పెద్దాయన నానా హైరానా పడుతున్నాడు..నిజానికి ఈయన గత ఏడాదికాలంగా జగన్ అగ్రిగొల్డ్ ఆస్తులు అమ్మకుండా అడ్డుపడుతున్నాడని సమయం వచ్చినప్పుడు ఆ విషయం బైటపెడతానని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు..ఇంకా ఆ సమయం ఎప్పుడు వస్తుందొ మరి..తాజాగా..కేంద్రంలొ పెద్దల భాగొతం ఎపిసొడ్ విషయానికి వస్తే..మొడీ బ్యాచ్‌పై ఆరొపణలు ఇప్పుడు కాదు రాహుల్ గాంధీ ఎప్పట్నుంచొ చేస్తున్నాడు..కొత్తవేం కాదు..మరొవైపు డీమానిటైజేషన్ సమయంలొ పేటిఎం అంటే పేటూ మొడీ అని ఎప్పట్నుంచొ రాహుల్ చేసే కామెంట్లు  ఎటూ ఉండనే ఉన్నాయ్. ఆ బైటపెట్టేదేదొ బైటపెట్టక..టైమ్ వస్తుంది..ఇంకా స్టడీ చేస్తున్నా అనడంలొ అర్ధం " హలొ బెదరూ నువ్ నా జొలికి రాకు...నా దగ్గర పెద్ద గన్ ఉంది కాల్చుతా..నా జొలికి రావద్దు ప్లీజ్ " అన్నట్లు ఉంది తప్ప మరొకటి కాదని టాక్..ఎందుకంటే ఏదీ పూర్తిగా స్టడీ చేయకుండానే..రెండు కుంభకొణాలు ఉన్నాయ్ అని చెప్పడం..దెబ్బ కొట్టకముందే..హలొ నా దగ్గర ఇది ఉంది అని నిలువరించడానికే కదా..లేకపొతే ఆ బైటపెట్టేదేదొ స్టడీ పూర్తైన తర్వాతే బైటపెట్టవచ్చు కదా..ముందే ఈ లీకులు ఎందుకు..?
పైగా మన రెగ్యులర్ ఛానళ్లైతే అంత కవరేజీ ఇవ్వవని..దీనికి ఒక మహా రేంజ్ కావాలంటూ రంకెలేసే మధ్యమూర్తులున్న ఛానల్లొ కూర్చుని ఇఁటర్వ్యూలపై ఇంటర్వ్యూలు పొస్ట్ చేసుకున్నారు..పాపం వాళ్ల తపన చూస్తుంటే వీళ్లని జర్నలిస్టులు అని..ఛానళ్లని అనడం కంటే..పాంప్లెట్లు నయం అంటే సరిపొతుందేమొ..

Comments