బాలకృష్ణ కెరీర్‌లోనే పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..


ఫ్లాపులతో అల్లాడుతున్న బాలయ్య కెరీర్‌లో పెద్ద హిట్ట్ ఆ సినిమా..అది ఒక్క బాలయ్యబాబు సినిమాలలోనే కాదు
తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్..అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు చేసిన సినిమా అది. మాస్ సినిమాలకు ఊపు తీసుకురావడమే కాకుండా బాలయ్యబాబు అభిమానులకు పాత రోజులు గుర్తుకుతెచ్చిన సినిమా అది..అదే సమరసింహారెడ్డి..ఇప్పటికీ ఆ సినిమా మాటల రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్  రాసిన డైలాగ్స్ జనం వాడుతూనే ఉంటారు. విశాఖపట్నానికి చెందిన టిడిపినేత చెంగల వెంకట్రావ్ ఈ సినిమా ప్రొడ్యూసర్. దాదాపు పాతికకోట్ల రూపాయలు షేరు కలెక్ట్ చేసిన ఈ సినిమా తర్వాత చెంగలవెంకట్రావ్ బాలకృష్ణకి అత్యంత ఆత్మీయుడిగా మారాడు. టిడిపి తరపున ఎమ్మెల్యేగా టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచాడాయన

ఐతే ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడుని తీసి బొక్క బోర్లా పడ్డాడు..నష్టాల నుంచి డిస్ట్రిబ్యూటర్ల తాకిడి నుంచి తట్టుకునేందుకు ట్యాంక్ బండ్‌పై నుంచి దూకాడు కూడా..ఇలాంటి నిర్మాత ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే ఎవరైనా అరే ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు అని కాస్త జాలి పడతారు. చినిగిపోయిన  లుంగీ..అడ్డబనీనుతో తింటానికి తిండి కూడా లేనట్లు కన్పిస్తున్నాడు ఇప్పుడు అదికూడా జైల్లో..

ఇలా ఎందుకు జరిగిందో కొంతమందికే తెలుసు..1999 నుంచి 2009 వరకూ ఎమ్మెల్యేగా కూడా ఉన్న చంగల వెంకట్రావ్ తన నియోజకవర్గంలో మత్స్యకారుల ఆందోళనపై తీవ్రంగా స్పందించాడు. ఆ సందర్భంగా జరిగిన గొడవలలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆయనపై హత్యకేసు నమోదు కాగా..వెంకట్రావు సహా 21మందికి యావజ్జీవిత ఖైదు శిక్ష పడింది. ఇక్కడే ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. తండ్రి జైలు పాలు కావడంతో కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. ఇందుకోసం పెరోల్ కోసం ధరఖాస్తు చేసుకున్న వెంకట్రావ్ కొంతకాలం బైటే గడిపి మళ్లీ జైల్లోకి వెళ్లాడు. ఐతే ఈసారి జైల్లో ఉన్న వెంకట్రావ్ అనారోగ్యం పాలవగా..విశాఖ కేజీహెచ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సాధారణ తనిఖీలకు వెళ్లిన విశాఖపట్నం కలెక్టర్‌కి ఈయన కన్పించగా..అయ్యా నేనో మాజీ ఎమ్మెల్యేని..సినిమా నిర్మాతని కూడా అని చెప్పుకొచ్చాడట. దీంతో కలెక్టర్ కాస్త ఆశ్చర్యపోయారట. సమరసింహారెడ్డి విడుదలైన సమయంలో ఆయన డాబూ దర్పం చూసినవారు..ఇప్పటి ఆయన బీదఆకారం చూసి విధి వక్రించడం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు..ఐతే ఇండస్ట్రీలో మనసున్న మనిషిగా ఫ్యాన్స్ చెప్పుకునే బాలయ్య తన నిర్మాత ఇలా అయిపోవడంపై స్పందించకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు..ఐతే ఈయనగారు టిడిపి నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడమే బాలయ్య కినుకకి కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. ఈ సమాచారం తెలిసిన
తర్వాతైనా తన నిర్మాతకి మంచి చికిత్స అందించమని బాలయ్య చెప్తాడేమో చూడాలి.


Comments