రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమా కథ ఇదేనా


అచ్చమైన కమర్షియల్ మసాలా సినిమా అంటే వచ్చి చాలారోజులైపోయింది. రాజమౌళి సింహాద్రి, సై, విక్రమార్కుడు తర్వాత ఈగ, మగధీర, బాహుబలి సిరీస్‌తో ఈ జోనర్‌కి దూరమైపోయాడు. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో తీసే సినిమాతో ఆ లోటు ఫుల్లుగా తీర్చేస్తాడట. ఇందుకోసం తీసుకున్న సబ్జెక్ట్‌లో  ఓ పాయింట్ లీకైపోయింది. అది ఇద్దరు హీరోలూ పోలీస్ క్యారెక్టర్లు..ఆ  సంగతి పక్కనబెడితే అసలు ఈ ట్రిపుల్ ఆర్ మూవీ అసలు కథ ఇదేనంటూ
ఓ స్టోరీ ఇప్పుడు సర్కిల్ అవుతోంది. అదేంటో చూద్దాం.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లిదండ్రులు బాగా ధనవంతుల కుటుంబం. విలన్ కుట్రతో వీళ్లు ఆస్తిపాస్తులకు దూరం అవుతారు. తండ్రిని విలన్లు క్రూరంగా కొట్టి చంపేస్తారు. ఇదంతా చూసిన తల్లి ఇద్దరు కొడుకులతో తన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది..అప్పటిదాకా తన భర్త అస్థికలు కూడా గంగలో కలపనని ప్రతిజ్ఞ చేసుకుంటుంది. ప్రతి రోజూ దేవుడి గుడికి వెళ్లి తన పగ నెరవేర్చాలని కోరుకుంటుంది. ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దై ఒకరు పోలీస్ ఆఫీసర్‌గా మారగా..మరొకరు చిల్లర దొంగతనాలు చేస్తూ ఏదోక రోజు పెద్ద డీల్ కొట్టి ధనవంతుడిగా మారిపోవాలని ఆలోచిస్తుంటాడు. ఈ క్రమంలో పెద్ద నేరస్తుడిని ఒకడిని పట్టిస్తే పెద్ద రివార్డు ఇస్తామని పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రకటిస్తుంది. ఇది చిల్లరగా తిరిగే హీరో
చేయగానే పోలీస్ డిపార్ట్ మెంట్ అతనికి తమ శాఖలోనే ఉద్యోగం ఇస్తుంది. అలా ఇద్దరు కొడుకులు పోలీస్ ఆఫీసర్లు అవుతారు. అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.
ఇద్దరు కొడుకులు ప్రయోజకులైన సంతోషంలో తల్లి తీర్ధయాత్రలకు వెళ్లి వస్తుంది. ఐతే ఈలోపే ఇద్దరూ బద్ద విరోధులుగా మారి కొట్టుకుంటుంటారు. పోలీస్ గా మారిన దొంగ నిజాయితీకి పెద్ద విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తుంటాడు. అలానే తనకి తెలీకుండానే విలన్లతో చేతులు కలిపి వాళ్లిచ్చిన సొమ్ముతో పెద్ద బంగ్లాలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. పెద్ద కొడుకు మాత్రం పాత ఇంట్లోనే ఉంటాడు. ఇలా ఒక కొడుకు విలన్లకు అడ్డు పడుతుండగా..మరో కొడుకు వారికి సాయపడుతూ అన్నతో పైట్ చేస్తుంటాడు.

తల్లిద్వారా  తమ గతం తెలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు కొడుకులూ ఒక్కటై విలన్ల భరతం పట్టడమే మిగిలిన స్టోరీ..ఇదీ రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న మూవీ మెయిన్ లైన్..ఓ హిందీ సినిమా ఆధారంగా ఇది తెరకెక్కుతుందని అంటున్నారు. ఐతే పాత సినిమాల లైన్లని తీసుకుని అస్సలు అనుమానం రాకుండా కొత్త
సినిమాగా ప్రజెంట్ చేసే విజయేంద్రప్రసాద్ ఎవరికీ డౌట్ రాకుండా దీన్ని కూడా కొత్త కథగా తయారు చేశాడంటున్నారు.

Comments