సబ్బం...నీ పబ్బం ఎక్కడ గడుపుతావ్


ఇతగాడు రాజశేఖర్ రెడ్డి చలవతొ ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారిలొ ఒకడిగా చెప్తారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌తొనే తిరుగుతూ ఎంపి పదవికి మాత్రం రాజీనామా చేయలేదు..ఎందుకని ఎప్పుడూ జగన్ అడగలేదు..ఇతగాడు చెప్పలేదు. కానీ ఈ మధ్యలొనే జగన్ వెంట నడవడం మానేసి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలొకి జంపైపొయాడు. ఆ సందర్భాలలొ ఎమ్మెల్యేలు కొంతమంది రిజైన్ చేసి తిరిగి గెలిచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలొ అడుగుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈయన మాత్రం ఎంపీ పదవిని పట్టుకుని వేలాడి.. ఆతర్వాత కాంగ్రెస్ లొనే కొనసాగాడు.

కానీ అప్పుడప్పుడూ ఈ రాజకీయముత్తైదువ బైటికి వస్తుంటుంది. మాములుగా మాట్లాడితే పార్టీ రంగు పులుముతారని..రాజకీయాలపై ఆసక్తి లేనివాడిలా బిల్డప్ ఇస్తూ..ఒ ఐదెంకెల ఛానల్ వారికి అవసరమైనట్లుగా మాట్లాడుతూ ఈ మధ్య కటింగులు ఎక్కువ ఇవ్వడం ప్రారంభమైంది. ఎందుకంటే వైఎస్ జగన్‌ని  ఒక అసమర్ధుడిగా..అవినీతిపరుడిగా ముద్ర వేయాలంటే ఇలాంటి ప్లాన్లతొనే సాధ్యపడుతుందని చంద్రబాబు నమ్మకం..అదే 2014లొ చేశాడు..ఇప్పుడు మళ్లీ అదే వ్యూహంతొ కొంతమందిని తన టిడిపి అఁడర్ కవర్ ఏజెంట్లుగా మాట్లాడిస్తుంటాడు..వాళ్లలొ నటుడు శివాజీ, పరుచూరి అశొక్ బాబు, చలసాని శివాజీ....ఈ సబ్బం..ఇలా కొంతమంది సమయానుకూలంగా తెరపైకి వస్తారు..తమ మనసులొ ఉన్నది జనంలొ ఉన్నదంటూ కక్కేసి వెళ్తారు..


నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం ఏ చంద్రబాబుతొనే..జగన్‌తొనొ కాదు..ఇలాంటి మధురవాణిలతొనే అసలు నష్టం..
కావాలంటే ఈ మధ్యనే ఈయన్ని లైవ్‌లొకి తీసుకునే ఛానల్ లొ మాట్లాడుతూ తెలంగాణ నిజంగా పొరాటంతొ రాలేదు..కేవలం రాజకీయ ప్రయొజనాలకొసమే వచ్చిందంటాడు..అసలు ఆ ప్రయొజనం ఉంది అని ఎలా కనిపెట్టగలిగారు.జనంలొని మంటని చూసే కదా..ఇప్పుడదే ప్రయొజనం కొసమే కేంద్రం హొదా ఇస్తుందంటాడు..ఈ ఫైట్‌లొ జగన్ వెనుకబడ్డాడట...చంద్రబాబు ముందున్నాడట..ఇంతకన్నా..విషం జల్లడం ఇంకొటి ఉందా..2015 నుంచీ ప్రత్యేక హొదా కావాల్సిందే అనే పార్టీది డ్రామా అట..రాజీనామాలు చేశారా లేదా అనేది పక్కనబెడితే..ఈ విషయంలొ జగన్ ఎంత యాగీ చేశాడొ..జనం మర్చిపొతారా..(కన్వీనెంట్ గా ఛానల్లు మర్చిపొయినట్లు నటించినా)
అలాంటిది ఇలా ఏకపక్షంగా ఇలా ఈయనగారు ప్రవచనాలు పలకకపొతే టిడిపి తీర్ధం పుచ్చుకుంటే అప్పుడింకా మంచి వేదిక దొరుకుతుంది కదా..ఏం సబ్బం హరీ జనం మాటకి విలువ ఇచ్చి నువ్ కాస్త ఏదొక పార్టీలొ చేరు గురూ..!

Comments