బావ కోసం ఎప్పుడూ చేయని పని చేసిన మహేష్

ఎంత వయసొచ్చినా ఫ్యాన్స్‌కి ప్రిన్స్‌గానే ఉండే మహేష్ బాబు కెరీర్ బిగినింగ్‍‌లో ఫంక్షన్లకి వెళ్లేవాడు కాదు. ఆ తర్వాత
ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లకి వెళ్లేవాడు. కానీ తను మాట్లాడితే ఆ సినిమాలు పోతున్నాయని ఊరికే హాజరై
ఆల్‌ది బెస్ట్ చెప్పేవాడు. ఆ తర్వాత ఇక ఇతర ఫంక్షన్లకి వెళ్లడం కూడా తక్కువైంది. ఐతే ఈ మధ్యకాలంలో మాత్రం
తన బావ సుధీర్ సినిమాల ప్రమోషన్లకి బాగానే వెళ్తున్నాడు. తాజాగా సమ్మోహనం  సినిమా ప్రమోషన్ కి వెళ్లాడు
ప్రమోషన్ అంటే ప్రమోషన్ కాదు కానీ..ఆ ఆడియో రిలీజ్‌కి హాజరై ఉత్సాహం తెచ్చాడు.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా జరుగుతుందంటే ఎవరూ ఆ డీటైల్స్ బైటపెట్టే సాహసం చేయడం లేదు
లుక్ విషయం నుంచి సబ్జెక్ట్‌కి సంబంధించి ఏ చిన్న విషయం కూడా బైటపెట్టడంలేదు..ఎందుకంటే పోస్టర్ చూసి సినిమా కథ చెప్పేయగల సమర్ధులు తయారవుతున్నారు ఇప్పుడు..అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాతలు హీరోలు ఐతే మహేష్ మాత్రం తన పాతికో సినిమా లుక్ ని ఈ ఫంక్షన్‌కి రావడం ద్వారా బైటపెట్టాడు.


ఇది ఓ రకంగా రిస్కే అని చెప్పాలి. ఫ్యాన్స్ అంతా బ్రహ్మాండం ఆహో ఓహో అంటున్నా..ఆ లుక్ పెద్ద గొప్పగా ఏం లేదు. రాజకుమారుడు సమయంలో కొన్ని సీన్లలో ఇప్పటి మహేష్‌లానే ఉన్నాడు తప్ప అదిరింది లేదు బెదిరింది లేదు. ఇలాంటి కామెంట్లు వస్తాయనే చాలామంది లుక్ కూడా రిలీజ్ చేయరు. అయినా తన బావకోసం ఈ రిస్క్ తీసుకున్నాడు మహేష్ పనిలోపనిగా ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తీసిన అష్టాచెమ్మా తనకి బాగా ఇష్టమైన సినేమా అంటూ పొగిడేశాడు..తన ఫంక్షన్లకి వచ్చి బాగా మాట్లాడే సుదీర్ ఈ సినిమాకి మాత్రం ఎమోషన్ అవుతున్నాడంటూ భరోసా ఇచ్చాడు బావకి బావమరిది మహేష్..
Comments