కత్తికి పిడి దిగింది..పార్ట్ 2


గత కథనంలోనే మనం ముచ్చటించుకున్నాం..నోరుంది కదాని ఏది పడితే అది మాట్లాడి అది ప్రజాస్వామ్యమని..దళితుడిని కాబట్టే తిడుతున్నారని అనడం కరెక్ట్ కాదని..ఇప్పుడు  ఇదే విషయం డిజిపికి కూడా అన్పించింది. వెంటనే నగర బహిష్కరణ చేయడం గమనించాలి. ఆరు నెలలకే పరిమితమైనా కూడా ఇలాంటి నిర్ణయం అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేవారికి అదుపు వేస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే ఈ ఆరు నెలల్లో ఇతగాడు
ఏదైనా పోస్ట్ పెట్టినా..సిటీకి వచ్చే ప్రయత్నం చేసినా క్రిమినల్ కేసు పెట్టి మూడేళ్లు జైలుకి పంపిస్తామని చెప్పడం చాలామంది హర్షిస్తున్నారు
దీంతో పాటు డిజిపి చెప్తున్నట్లు టివి ఛానళ్లను నియంత్రించడం కూడా అవసరమే..కేవలం రేటింగుల కోసం పనికిమాలిన అంశాలను పదే పదే ప్రసారం చేయడం తద్వారా ఏదో సమాజానికి మేలు కలిగించామనే ఫీలింగ్ తీసుకురావడం సరికాదు. ఈ ఛానల్ ఇలా చేసి రేటింగ్ తెచ్చుకుంది కాబట్టి మేమూ అదే బాటలో పయనిస్తాం అని మిగిలిన వాళ్లూ అదే దారిలో నడవడం మరింత విషాదం. అసలు ఇలాంటి చర్చలకు ఈ మధ్య ఒక మహానుభావుడు బాగా ఆజ్యం పోస్తున్నాడు కేవలం తన ఛానల్ రేటింగ్ పెంచడం తప్ప అందులో సమాజ ఔన్నత్యం పెంచడం లేదు సరి కదా....సామాజిక స్పృహ   శూన్యం. మేమింతే చేస్తాం మమ్మల్ని విమర్శించే హక్కు లేదు ఏదైనా అంటే కులం కార్డు తీస్తాం..పత్రికాస్వేఛ్చని అడ్డు పెట్టుకుంటాం అంటూ చెలరేగే హీరోలకి ఇవాళ తెలంగాణ డిజిపి మంచి సమాధానమే చెప్పారు

కనీసం ఇప్పుడైనా మేధావులమని చెప్పుకునే వాళ్లు దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తే సమాజంలో ఏదోనాటికి కాస్త మంచి నేర్చుకుందామనేవారికి గురువులుగా మిగులుతారు. లేదూ తాము చెప్పిందే వినాలని..అనుకుంటే ఇదే శాస్తి జరుగుతుంది..ఈ బహిష్కరణలపై కోర్టులకు వెళ్లవచ్చు..స్టే తెచ్చుకోవచ్చు కానీ..మనమేం చేసినా చెల్లుతుందనే ధోరణికి మాత్రం కాస్త  అడ్డుకట్ట పడ్డట్లే

Comments

  1. అద్వానీ వాగితే 2000 మందిని చనిపోయినపుడు ఎక్కడున్నారు మీరంతా ?
    ఎకరం నేలను సేకరించలేని మీరు హిందువులని చెప్పుకుని మీరు మురుసుకోవాల్సిందే !

    ReplyDelete

Post a Comment