ఎన్‌టిఆర్ మనవరాలిని పెళ్లాడాడు.. సూపర్ హిట్లూ ఇచ్చాడు..ఐనా ఈ హీరో పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా


పెద్ద పేరున్న నిర్మాత కొడుకు..మరో పెద్ద కుటుంబానికి అల్లుడు..ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరో, సూపర్ స్టార్ కాకపోయినా కనీసం స్టార్‌గా అయినా సినిమాల్లో స్థిరపడతారు. కానీ ఇప్పుడు మనం చెప్తోన్న హీరో మాత్రం తెరమరుగు  అయ్యాడు అలాగని అందం లేదా అంటే ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్నాడు కూడా. ఐనా అతని పరిస్థితి చూస్తే జాలేయకతప్పదు .
అతనే వడ్డే నవీన్. ఈ మధ్యనే టి.సుబ్బరామిరెడ్డి మనవడి పెళ్లికి వచ్చిన ఇతన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఐతే సినిమా జనం  మాత్రం ఒక్కళ్లూ పట్టించుకోలేదు. దీంతో ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే విలువ అనే మాట అనుకోకతప్పదు. విజయమాధవీ కంబైన్స్ పేరుతో తండ్రి వడ్డే రమేష్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు నిర్మించాడు. ఆయన కొడుకుగా హీరోగా 1997లో ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ ప్రామిసింగ్ హీరోగా మారాడు. కోరుకున్న ప్రియడు, పెళ్లి, ప్రియా ఓ ప్రియా అంటూ మూడు సినిమాలు మంచి సక్సెస్ సాదించడంతో ఇండస్ట్రీలో ఇక తిరుగుండదని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయ్. ఐనా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో మనసిచ్చి చూడు, స్నేహితులు హిట్లతో స్వింగ్ అయ్యాడు. ఐతే ఆ దశనుంచి క్రమక్రమంగా తెరమరుగు కావడం ప్రారంభించాడు. వరసగా ఆరేడు ఫ్లాపుల తర్వాత ఇక సినిమాలు చేయడం మానేశాడు. మధ్య మధ్యలో చేసినా వాటిపై శ్రద్ద ఉన్నట్లు కన్పించదు. ఇతని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసిన రవితేజ టాప్ రేంజ్‌కి వెళ్లిపోగా..ఇతను మాత్రం డల్ అయిపోయాడు. ఓ దశలో పవన్ కల్యాణ్‌కే పోటీ అనుకున్న నవీన్ సీన్ సితారైపోయి..చివరికి ఎవరికీ పట్టుకుండా పోయాడు. తండ్రి వడ్డే రమేష్ ఐదేళ్ల క్రితం చనిపోయాడు.

అన్నింటికన్నా ముఖ్యమైన మలుపు ఇతను ఎన్టీఆర్ మనవరాలిని పెళ్లాడగా ఆ పెళ్లి పెటాకులు అయింది. దీనికి కారణంగా కూడా ఇంజనీరింగ్ చదివిన రోజుల్లో ఓ మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడని చెప్తారు. అంతే కాకుండా వడ్డే నవీన్ ఔట్ డోర్స్ షూటింగ్ టైమ్‌లో దర్శకులను, నిర్మాతలను బాగా ఇబ్బంది పెట్టేవాడట. అందుకే మంచి హైటు, ప్రతిభ ఉన్నా కూడా తర్వాత తర్వాత ఎవరూ కథలు చెప్పడానికి ఇతగాడి జోలికి వెళ్లేవారు కాదంటారు. అప్పటికీ 30దాకా సినిమాలు చేశాడు వడ్డే నవీన్.

ఈ మాత్రం టాలెంట్ ఉన్న ఏ హీరో అయినా ఎన్టీఆర్ మనవరాలిని పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లభించి ఉండేదో ఊహించవచ్చు. పైగా వడ్డే రమేష్ వ్యాపారాలూ తక్కువవి కాదు, పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. దాంతో పాటు దాదాపు 100 అశోక్ లేలాండ్ లారీలతో ట్రాన్స్‌పోర్ట్ సర్వీసు నడిపే ఆఫీస్ కూడా వీళ్లకి ఉందట. అప్పట్లోనే అంటే 1980లలోనే వంద లారీలు అంటే ఎంత ధనవంతులో అర్ధం చేసుకోవచ్చు. ఐతే ఎన్ని ఉండి ఏం లాభం..అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తయారైంది వడ్డే నవీన్ పరిస్థితి. తన ప్రవర్తన మార్చుకోనందువల్లనే చివరికి ఇండస్ట్రీలో ఏకాకిగా మిగిలాడని అంటారు. ఐతే సుబ్బరామిరెడ్డిలాంటి షో మేన్లు చేసే ఫంక్షన్లకు ఇన్విటేషన్లు వస్తుంటాయ్ కాబట్టి వాటిలో కన్పిస్తుంటాడు. 

Comments