నేను రెడ్డిని..లీడర్‌ని..జేసీ తిట్ల పురాణం పరిటాల శ్రీరామ్ రాకతో సైలెన్స్

పాపం జేసీ దివాకర్ రెడ్డి...
టిడిపి ఎంపి ఈ మధ్యన మనకి బోలెడంత వినోదం పంచుతున్నాడు. ఎక్కడ టిడిపి ఎంపిలు దీక్షలంటూ హడావుడి చేసినా అక్కడ ప్రత్యక్షమైపోయి తన భావావేశం వెల్లిబుచ్చుతున్నారు. ఈ ప్రవాహంలో ఆయన నోటివెంట జాలువారుతున్న ముత్యాలు ఏరుకోలేక పాపం చిడిపి నేతలు  అల్లాడుతున్నారు. వైఎస్ జగన్ పైనే ఎప్పుడూ చిందులు తొక్కడంలో సిద్దహస్తుడైన జేసీ..ఈ సారి నీయమ్మ కడుపు గాల..నేను రెడ్డినిరా..అసలైన రెడ్డిని రా అంటూ తన నోటికొచ్చిన ప్రసంగం చేశారు. అసలు ఈ దీక్షలు..వాటి ఉద్దేశం సంగతేమో కానీ ఈయనగారు టిడిపికి శల్యసారధ్యం వహించడం లేదు కదా అని  ఈయనతీరుపై సందేహాలు కూడా వెళ్లిబుచ్చుతున్నారు తెలుగు తమ్ముళ్లు.


పైగా, ఆయన ప్రసంగం సాగుతున్న సమయంలో లోకల్ లీడర్ పరిటాల శ్రీరామ్ రాగానే జనం ఒక్కసారిగా తమ కేకల ద్వారా స్వాగతాన్ని పలికితే..వెంటనే సైలెంటై పోవాల్సి వచ్చింది. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవి మర్డర్ కేసులో జేసీ దివాకర్ రెడ్డి కూడా నిందితుడంటూ సాక్షాత్తూ ఈ కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ పరిణామం ఆసక్తి కలిగించింది. ఆ వీడియో కావాలంటే 
కింద లింకు చూడండి..లేదూ ఇక్కడే ప్లే చేసుకుని చూస్తామంటే కింద క్లిక్ చేయండి
Comments