సిఎం రమేష్ దీక్ష విరమించలేదట..గడ్డం తీయడట


మొన్నా మధ్య కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసమంటూ పదిరోజులు తిండితిప్పలు మానేసిన టిడిపి ఎంపి ఇవాళ మరో
సంచలన ప్రకటన చేశారు. తాను దీక్ష విరమించలేదని చెప్పారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించిన తర్వాత బైటికి వచ్చిన రమేష్ ఈ రాజకీయప్రసంగం చేయడం గమనార్హం.

ఇప్పటికీ తాను ద్రవాహారమే తీసుకుంటున్నా అని..ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన జరిగేంతవరకూ ఇదే రకంగా
ముందుకు వెళ్తానని చెప్పారు రమేష్. అప్పటిదాకా గడ్డం కూడా తీయనంటూ ఉఖ్కు సంకల్పం ప్రకటించారాయన
కడప జిల్లాలో ఇతర నేతలతో సరిపడదని..ప్రతి కాంట్రాక్టులో వాటాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న
సిఎం రమేష్ ఇప్పుడు ఇలా దీక్షావ్రతం చేపట్టడం వెనకు వాటిని తొలిగించుకోవడమే కారణంగా చెప్తున్నారు.

 తనపై ఎలాంటి మరకా ఉండకూడదనుకుంటున్న రమేష్ అవినీతి ఆరోపణలను దీక్షలతో ఎలా తొలగించుకుంటారని ప్రత్యర్ధి పార్టీల ప్రశ్న పైగా గడ్డం తీయనని చెప్తే అదేం పెద్ద  త్యాగమా అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి, శ్రీకాంత్ రెడ్డి అప్పుడే వాగ్భాణాలు  సంధిస్తున్నారు కూడా

Comments