వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఎత్తులు వేస్తోందే...!


ఇరకాటంలో పడిందో...పెట్టిందో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ కూడా వ్యూహాలు  రచించడంలో తానూ దిట్టే అన్పించుకుంటోంది..సభలో లేని ఐదుగురు ఎంపిలు సరే..మరి జంప్ జిలానీ ఎంపిలు ఆ పార్టీలో ఉన్నట్లే స్పీకర్ ఫీలవుతుంది కదా..అందుకే తానూ ఓ విప్  వదిలింది. అదేమిటంటే, అవిశ్వాసానికి మేం కూడా మద్దతు ఇస్తాం అని.

దీంతో అవిశ్వాసతీర్మానంపై తాము కూడా వెనక్కి తగ్గనట్లే చెప్పుకోవాలనేది వైఎస్సార్సీపీ ప్లాన్, పైగా తెలంగాణ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా విప్ ఇవ్వడంతో తన ఇమేజ్ కాపాడుకున్నట్లే..ఎందుకంటే ఒక్క ఎంపీ కాదు..మొత్తం మా పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపిలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాం అని బైట చెప్పుకుంటుంది.

ఈ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ వరకూ ఈ జంప్ జిలానీ యవ్వారాలు తెలుసు కానీ..మిగిలిన ప్రపంచానికి రేపొద్దున్న లైవ్‌లో మాట్లాడుతున్న ఎంపి ఫలానా పార్టీ అని నేమ్ స్లగ్ వేస్తారు కానీ..వీళ్లు జంప్ అయిన ఎంపిలు అని దూరదర్శన్, రాజ్యసభ,లోక్ సభ టివిల్లో వేయరు. అందుకే గాలికిపోయే పిండి కృష్ణార్పణంలాగా ఆ మద్దతు తెలిపిన ఎంపిలు మావాళ్లే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ . కొత్తపల్లిగీత, బుట్టా రేణుక, ఎస్పీవైరెడ్డి రేపు సభకి హాజరు అయిన తర్వాత ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారో చూడాలి


Comments