ఈ స్టార్ల ఫ్యామిలీలలో దగ్గరవారితో అసలు సంబంధాలు కలుపుకోరు


పెద్ద కుటుంబాలలో వాళ్లలో వాళ్లే తమ పిల్లలకు సంబంధాలు చూడటం సహజమే..అలానే దగ్గరి బంధువుల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడం కూడా మామూలే..ఐతే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ ఆనవాయితీ ఎందుకో లేదంటే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సమాచారం ఎవరికీ తెలీనిది కాదు ఐనా అంతగా గ్రహింపు ఉండదు
నందమూరి తారకరామారావు విషయమే చూస్తే..ఆయనకి ఒక తమ్ముడు..మరో అక్క ఉన్న విషయం తెలిసిందే. ఆయన వరకూ మేనరికం చేసుకున్నా ఆ తర్వాత తన సంతానంలో మాత్రం అది కనబడదు.

12 మంది పిల్లలు ఎన్టీఆర్‌కి. వీరిలో నందమూరి రామకృష్ణ చిన్న వయస్సులోనే చనిపోయాడు. నందమూరి జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ మగపిల్లలు కాగా..లోకేశ్వరి,  పురంధీశ్వరి, భువనేశ్వరి,  ఉమా మహేశ్వరి కూతుళ్లు. ఇంతమంది సంతానంలో ఆయన మనవళ్లు పాతికమంది ఉన్నారు. అలానే లోకేశ్వరి, భువనేశ్వరి పురంధీశ్వరి, ఉమామహేశ్వరికి కూడా ఆడకూతుళ్లు ఉన్నారు..వీరిలో ఒక్క నారా ద్రబాబునాయుడితో పెళ్లైన భువనేశ్వరికి లోకేష్ ఒక్కరే సంతానం.

ఐతేనేం అప్పట్లో మేనరికాలు వద్దన్న  నోటితోనే చంద్రబాబు బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణిని కోడలిగా చేసుకున్నారు..ఆ ఒక్క పెళ్లి తప్ప ఇంక ఇంత పెద్ద కుటుంబంలో సంబంధాలు కలుపుకోలేదు. జయకృష్ణ కుమార్తె, జయశంకర్ కృష్ణ కుమార్తెలను బైటి వారికి  ఇచ్చి దెబ్బతిన్నారు. వాళ్లలో ఒకరు ఎల్వీ ప్రసాద్ మనవడు ప్రసాద్..ఇతగాడు చేసిన ఘోరానికి పాపం జయకృష్ణ కుమార్తె కుముదిని చెన్నైలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక మరో విషయం నటుడు వడ్డే నవీన్ విడాకులు ఇవ్వడం కారణంగా నష్టపోయిన మనవరాలు. ఇక బాలయ్య బాబు మాత్రం తన రెండో కుమార్తెను గీతం యూనివర్సిటీ ఎంవివిఎస్ మూర్తి ఇంట్లో ఇచ్చాడు. అంతేకానీ తన అక్కగార్ల పిల్లల్లో ఎవరికీ ఇచ్చే ఆలోచన చేయలేదు. ఇది ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం.మరో పెద్ద కుటుంబమైన అక్కినేని ఇంట్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగింది. అక్కినేనికి ఐదుగురు సంతానం. ఇద్దరు కొడుకులు..ముగ్గురు కూతుళ్లు..వీళ్లలో అటు నాగార్జున కానీ ఇటు వెంకట్ కానీ ఇద్దరూ తమ కొడుకులకు బైటి సంబంధాలే ఖాయం చేశారు. వెంకట్‌కి అన్నపూర్ణ అని ఓ కుమార్తె ఉంది. ఆమెకి నాగసుశీల కొడుకులను చేసుకునే ఆలోచన చేయలేదు. సత్యవతి కుమార్తె సుప్రియ ఉందంటే ఆమె జివికే గ్రూప్ ఫ్యామిలీలోని చరణ్ ని పెళ్లి చేసుకుంది. కానీ అతగాడు 40 ఏళ్లకే గుండెపోటుతో చనిపోవడంతో అలా ఒంటరిగానే ఉంటోంది.  అలానే  సత్యవతి కొడుకైన సుమంత్ పరిస్థితీ అంతే..సుమంత్ డిచ్ పల్లి మాజీ ఎమ్మెల్యే గంగారెడ్డి మనవరాలు హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లాడినా ఎక్కువ రోజులు నిలవలేదు.


ఇండస్ట్రీలో కృష్ణ ఫ్యామిలీకి మాత్రం ఈ బెడదలేదు. ఎందుకంటే మహేష్ రమేష్ మంజుల, ప్రియదర్శిని, పద్మావతి అంతా సంవత్సరాల గ్యాప్‌తో ఉన్నారు కాబట్టి వియ్యంకులు అయ్యే పరిస్ధితి తలెత్తలేదు. ఇక ఆశ్చర్యం కలిగించే విషయం మెగాస్టార్ కుటుంబంలో కూడా ఇలా సంబంధాలు కలవకపోవడమే. ఎందుకంటే చిరంజీవి అల్లు అరవింద్ సతీమణిని చేసుకున్న తర్వాత అర్వింద్ కి ఇద్దరు కొడుకులు , చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు సంతానం కలిగారు. నాగేంద్రబాబుకి ఒక కొడుకు, కూతురు..పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు ఇంకా పిల్లలు పెద్దకాలేదు. అటు అల్లు  అర్జున్ బైట సంబంధమే చేసుకున్నారు. నీహారిక, సుస్మిత, శ్రీజ వీరిలో నీహారికకి తప్ప మిగిలిన ఇద్దరీకీ బైట సంబంధాలే చేశారు. ఎవరి ఇంట్లో పిల్లలకు వారి ఇష్టం వచ్చినవాళ్లకో, లేక పిల్లలు ప్రేమించినవాళ్లకో ఇచ్చి చేయడం జనరల్‌గా జరిగే పనే..కానీ ఇంత సంతానాలు ఉండి కూడా ఆ ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటో అన్పించకమానదు. బహుశా కలిసి పెరిగారు కాబట్టి అలా అనుకోకపోవచ్చు అని సరిపెట్టుకోవాలమో..కానీ వీళ్లంతా కూడా తమ సినిమాల్లో చుట్టరికాలు, బంధుత్వాలు, ఆప్యాయతల గురించి భారీ లెంగ్తున్న సీన్లలో నటిస్తుంటారు. దూరమైన సంబంధాలు దగ్గర చేయడానికి పెళ్లి చేసుకోవడమే పరిష్కారం అన్నట్లు చూపిస్తుంటారు. నిజజీవితంలో మాత్రం వాటికి దూరం అని చెప్పకనే చెప్తున్నారేమో మరి

Comments