నిర్మాత దానయ్య డబ్బు ఎగ్గొడతాడా?


సినిమా ఇఁడస్ట్రీలో పేమెంట్స్ దగ్గర ఖచ్చితంగా ఉండేవాళ్లు కొందరైతే..ఎగ్గొట్టినా ఏ మాట మాట్లాడకుండా
సైలెంట్‌గా బాధపడేది కొందరు. అలాంటి బాధే ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ అనుభవిస్తున్నాడట. ఈ ఏడాదికే
బిగ్గెస్ట్ హిట్ అయిన భరత్ అను నేను నిర్మాతకి లాభాల పంట పండించింది.దీంతో ఇదే కాంబినేషన్‌లో మళ్లీ పని చేయబోతున్నాం అంటూ హీరో, దర్శకుడు కూడా ప్రకటించేశారు. కానీ ఆ కాంబినేషన్ వర్కౌట్ అవడం అటుంచి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కోసం నిశ్శబ్ద యుధ్దమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మావిడాకులు, సముద్రం లాంటి సినిమాలు చేసిన దానయ్య పుల్లారావులు ఆ తర్వాత విడిపోయారు. నిర్మాత డివివి దానయ్య పదేళ్లకి ముందు నుంచే  దేశముదురు, దుబాయ్ శీను, కృష్ణ, నేనింతే,జులాయి, కెమెరామెన్‌ గంగతో రాంబాబు బ్రూస్ లీ, ఇలా బడ్జెట్ ఎక్కువ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. వాటిలో కొన్నింటికి ఫైనాన్షియర్ గా కొన్నిటికి సమర్పకుడిగా పని చేశాడు. ఐతే ఈయనపై ఇప్పుడు దర్శకుడు, హీరోయిన్‌కి డబ్బు పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని ప్రచారం బైల్దేరింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి అప్పుడప్పుడూ బైట పడుతుంటాయ్. ఐతే ఎవరికి వారు ఎందుకు సైలెంట్‌గా ఉంటారంటే ఆ తర్వాతి సినిమాల్లో ఛాన్సులు ఇస్తారని..గట్టిగా అడిగితే
మిగిలిన నిర్మాతలు కూడా దూరం పెడతారని భయపడతారు. ఇదే దానయ్యలాంటి నిర్మాతలకి అవకాశంగా మారుతోంది. అందులోనూ కొరటాల శివ పెద్దగా బైటికి మాట్లాడే వ్యక్తి కాకపోవడంతో దానయ్య ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నాడంటున్నారు.

 అసలు ఈ కథ కోసమే కొరటాల శివ తన స్నేహితుడికి సొంతంగా కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. ఇదే విషయం చాలాసార్లు చెప్పాడు కూడా..అలాంటిది ఆయనకి ఇప్పుడు ఇస్తామన్న పారితోషికం ఇవ్వకపోవడం ఆవేదన కలిగించిందట. దీనికి తోడు కియారా అద్వానికి కూడా ఇస్తామన్నంత ఇవ్వలేదట.. కియారా అద్వానీ బోయపాటితో రామ్ చరణ్ తీస్తోన్న సినిమాలో నటిస్తోంది. కాబట్టి ఈ సెటిల్ మెంట్ అవుతుందని అంటున్నారు. ఇక కే కొరటాల శివ తన సంగతి పదే పదే దానయ్యని అడిగినా పట్టించుకోలేదట. దీంతో ఇక ఈ కాంబినేషన్‌లో తర్వాతి సినిమా ఉండకపోవచ్చని టాక్. అందుకే సినిమారంగంలో పేమెంట్ల  విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే డబ్బు వసూలు అవుతుందని లేకపోతే ఇలానే ఎగ్గొడతారని అంటారు

Comments