జియోపై ఇంత ప్రేమా...! పునాదిరాయే పడని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టేటస్సా..!


కొద్దిగా వంగండి..అంటే సాష్టాంగ పడి, పొర్లు దండాలు  పెట్టే రకాలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..? ఇదిగో మన కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖలా ఉంటుంది. ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పేరుతో దేశంలోని అత్యున్నత ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్రప్రభుత్వం గుర్తింపు ఇవ్వదలిచింది. ఇలా ప్రభుత్వం నిర్వహించే పది..ప్రవేట్ నిర్వహించే పది యూనివర్సిటీలకు ఇవ్వజూపింది..ఐతే ఈ క్రమంలో పాపం జియో యూనివర్సిటీ అట...దీనికి కూడా ఈ హోదా ఇచ్చేసింది..అసలు ఇది యూనివర్సిటీనే కాదు.

మూడు నెలల క్రితం తమ సంస్థలో ఉపకరణాలు, విడిభాగాలు, ఇఁకా ఇతర కార్యక్రమాల కోసం ఓ యూనివర్సిటీ స్థాపించబోతున్నట్లు నీతా అంబానీ చెప్పారు..బహుశా ఆ ప్రతిపాదనలు ఇంకా యుజిసి కానీ..మానవవనరుల శాఖ వద్ద చేరాయో లేదో కూడా తెలీదు. అలాంటి యూనివర్సిటీకి ఇంత ప్రతిష్టాత్మక హోదా ఎలా ప్రకటించేస్తారు..అంటే రాజుగారి దేవతా వస్త్రాల్లాగా ఇంకా పురుడే పోసుకోని ఈ వర్సిటీని నెత్తినబెట్టుకుని జనం చెవిలో పూలు పెట్టడానికి కేంద్రం సిధ్దమైంది..దీంతో పాపం అభాసు పాలవడం కూడా వెంటనే జరిగిపోయింది..ఇంకా తప్పు జరిగింది ఒప్పుకోకపోగా..ఏదో గ్రీన్ ఫీల్డ్ ..ఎల్లో సన్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పడానికి కథలు తయారు చేసుకునే పనిలో పడిపోయింది..

పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలు పాటించిన 500 సంస్థల్లోనే ఈ ఎఁపిక , వడపోత చేశామని ..వరసగా పదేళ్లపాటు  ఆ జాబితాలోని వాటినే ఎన్నిక చేశామని చెప్పడం ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్..ఇంత సిగ్గు లేకుండా అంబానీల ముందు సాగిలపడేబదులు ఆ మంత్రిత్వశాఖనే వాళ్లకి ధారబోయొచ్చు కదా అనే విమర్శలు వస్తే తప్పేముంది. గతంలో ఇలానే ఓ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన మినిట్స్ బుక్‌లో కూడా అంబానీల హస్తలాఘవంతో మార్పులు చేశారంటే..ఈ దేశంలో వాళ్లు ఏం చేసినా చెల్లుతుందనే అనుకోవాలిగా..!

Comments