2019కి ముందే టిడిపి-కాంగ్రెస్ దోస్తీ?రాహుల్ మతి ఉండే ఏపి గురించి ఆ కామెంట్స్ చేసాడా


వరసగా చోటు  చేస్కుంటున్న పరిణామాలు పై డౌట్ తెప్పించకమానవ్. కర్నాటకలో చేతులు కలిసిన నాటి నుంచి చూస్తే..పార్లమెంట్‌లో టిడిపి ఎంపిల మద్దతుగా కాంగ్రెస్ నేతల సైదోడు, రాహుల్  గాంధీ బేటీలకు టిడిపి లీడర్ల వారసులు వెళ్లడం ...తర్వాత టిడిపితోనైనా కలిసి ముందుకు వెళ్తానని రాహుల్ గాంధీ చెప్పడం చూస్తుంటే 2019కి ముందే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే సందేహం కలగజేస్తున్నాయ్

2019కి ముందే అని ఎందుకు అంటున్నానంటే, లోక్ సభ ఎన్నికలకు ముందే తెలంగాణ ఎన్నికలు వస్తాయని
జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయ్. అంటే అక్కడ ఏపీలో ఎన్నికల సంగతి ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి ఇక్కడ
ఉనికి నామమాత్రం అయిపోయిన టిడిపి, పోరాటం ప్రదర్శిస్తోన్న కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతుందని టాక్.
ఓ వేళ ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా అయినా రెండు పార్టీలు కలివిడిగా  టిఆర్ఎస్‌ను ఎదుర్కొంటాయని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పట్లో అదికారంలోకి రాదు అని ఓ పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్తున్నాడంటే ఆ పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయ్..అంటే ఇక వేరే పార్టీకి మళ్లండి అని చెప్పడమే కదా..తాను స్యయంగా అవసరమైతే టిడిపితో దోస్తీకి సై అంటూ మరో పార్టీకి ఓటేసుకోండి అని ఇన్ డైరక్ట్‌గా చెప్తున్నాడంటే అక్కడా కాంగ్రెస్
పోటీ ఏపాటిగా ఉండబోతోందో తెలిసిపోతుంది. ఇలాంటి చోట తమకి పార్లమెంట్ సీట్లు..రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను టిడిపికి వదిలేసే పద్దతికి రాహుల్ గాంధీ ఓటేస్తాడని అంటున్నారు. పైకి చంద్రబాబునాయుడు అండ్ కో మాకు 25 సీట్లు ఇవ్వండి హోదా తెస్తాం..మాకు పాతిక సీట్లు ఇవ్వండి ప్రధానమంత్రిని డిసైడ్ చేద్దామనడం అంతా హంబక్ అని
ఈ వ్యూహం చూస్తే తేలిపోతుంది.

Comments