ప్రజాసేవ ముసుగులో స్పీకర్లు పార్టీ కార్యకర్తలా పని చేయొచ్చా


పోలవరం..ప్రాముఖ్యత గుర్తించిన పొలిటికల్ పార్టీలు ఎవరికి వారే తమ ఆపసోపాలు పడుతున్నాయ్. ఏది ఎలా ఉన్నా కూడా  పోలవరం ప్రాజెక్టు ఎన్నికలకు ముందు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఐతే ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏది పూర్తైన అదో పెద్ద కార్యక్రమంలాగా హడావుడి చేయడం టిడిపి ప్లాన్‌లో భాగంగా మారిపోయింది. లేకపోతే డయాఫ్రమ్ వాల్ పూర్తైతే ఒకసారి..గేట్లు పెడితే ఒకసారి, నీళ్లు వస్తే  ఓసారి కార్యక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు.  అదో ప్రాముఖ్యత కలిగిన డ్యామ్ అన్నప్పుడు ఆ మాత్రం హడావుడి ఉండాలనుకుంటే సరే కానీ..ఇప్పుడు జిల్లాల నుంచి బస్సుల్లో రైతులు తరలివెళ్తున్నారని చెప్పడం విడ్డూరం. పైగా ఈ వార్తలు
కేవలం కొన్ని పత్రికలల్లోనే రావడం మరీ విడ్డూరం. ఎందుకంటే ఈ బస్సులు అన్నీ టిడిపి సమకూర్చి, తమకి అనుకూలమైన రైతులను ఎంచుకుని..పంపిస్తున్నవని విమర్శలు ఉన్నాయ్.


లేకపోతే వర్షాలు పడే సమయంలో రైతులు తమ పనులు మానుకుని ఇలా ప్రాజెక్టుల సందర్శనకి ఎవరూ వెళ్లరు. కేవలం తాము చాలా చిత్తశుధ్దితో పని చేస్తున్నామని..పనులు కష్టపడి చేస్తున్నామని చెప్పుకోవడానికి..వెళ్లిన టిడిపి అభిమానుల చేత గొట్టాల ముందు మాట్లాడించడానికే ఈ యాత్రలని అర్ధమవుతూనే ఉంది. ఐతే ఈ తంతులో స్పీకర్ పాత్ర ఏంటనేది కూడా వివాదాలకు తావిస్తోంది. ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి..కనీసం అనుకోవాలి కానీ ఎన్నోసార్లు తాను స్వయంగా టిడిపి కండువా ధరించి కార్యక్రమాల్లో హాజరవడం విమర్శలు ఎదుర్కొన్నది. ఇప్పుడు ఆయన టూర్‌లో ఆయన కొడుకు కూడా పక్కనే ఉండటం గమనార్హం. గత రెండు మూడు దఫాలుగా స్పీకర్లుగా పని చేసినవారెవరూ తిరిగి గెలిచిన దాఖలాలు లేవు.

అందుకే ఈయన ముందుగానే తన పుత్రరత్నాన్ని ఇందుకు సిధ్దం చేస్తున్నాడని ఇప్పటికే నరసరావుపేట సత్తెనపల్లిలో టాక్ ఉంది. దానికి తగ్గట్లుగానే అతగాడు కూడా తన దందాని బోలెడుసార్లు జనంపై సాగించాడని సమాచారం ఉంది. కేబుల్ ఆఫీస్ పై దాడి, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ కాంట్రాక్టర్ పై దాడి తదితర ఘటనల్లో ఈయన హస్తం ఉందని కేసులు కూడా నమోదు అయ్యాయ్. అలాంటప్పుడు స్పీకర్ బాహాటంగా ఇలా ప్రదర్శనలకు, యాత్రలకు రైతులను సమీకరించవచ్చా అనేది తేలాలి

Comments