రాహుల్ రవీంద్రన్ రేంజ్ అంత పెరిగిపోయిదా..? మహేష్ ఆ ఛాన్స్ ఇస్తాడా?


చిలసౌ సినిమా మూవీతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా నిరూపించుకున్న రాహుల్ రవీంద్రన్ తన మనసులో మాట బైటపెట్టాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా రెగ్యులర్ తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమా సక్సెస్ అంటున్నాకలెక్షన్లు రావడం లేదంటూ వాపోతున్న రాహుల్ రవీంద్రన్ తన బిగ్ డ్రీమ్ ఒకటి బైటపెట్టాడు. మహేష్ బాబుతో సినిమా చేయడమే తన లక్ష్యమని అందుకోసమే శ్రీమంతుడిలో క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చాడు. పైగా ప్రిన్స్ మహేష్ బాబే స్వయంగా తన సినిమా అందాల రాక్షసి చూసి శ్రీమంతుడిలో రికమండ్ చేశాడని..ఆయనకి తనకి పరిచయం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. శ్రీమంతుడి షూటింగ్‌లోనే మహేష్ బాబు గొప్పతనం తెలిసిందని..అద్భుతమైన నటన ప్రదర్శిస్తూనే..ఆ సీన్‌కి స్టార్‌డమ్ అద్దడంలో మహేష్ మాస్టరని పొగిడేశాడు.
 ఇప్పుడు చిలసౌ సినిమా తర్వాత తనకి మహేష్ అప్పాయింట్ మెంట్ ఈజీగా దొరుకుతుందని చెప్పాడు
రాహుల్ రవీంద్రన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే, తమిళ సినిమా మదరాసితో తెరంగ్రేటం చేశాడు. చెన్నైలో పుట్టి పెరిగిన రాహుల్, ఎంబిఏ పూర్తి చేసిన తర్వాత ముంబైలోని ఓ లీడింగ్ మీడియా కంపెనీకి అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా కూడా పని చేశాడు. అక్కడే ఓ రోజు రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా..దివాకర్ బెనర్జీ అనే జింగిల్స్ డైరక్టర్ రాహుల్‌ని చూసి టెలివిజన్ కమర్షియల్‌కి ఎంపిక చేశాడట. అలా బుల్లితెరకు పరిచయమైన తర్వాత చాలా కార్టూన్ సీరియల్స్‌కి తమిళ్ డబ్బింగ్ చెప్పాడు. పవర్ రేంజర్స్‌లో రెడ్ రేంజర్ క్యారెక్టర్‌కి విన్పించేది అతని గొంతే. కొన్నాళ్ల తర్వాత చెన్నైకి మకాం మార్చిన రాహుల్ రవీంద్రన్ మాస్కోవిన్ కావేరీ అనే సినిమాలో నటించాడు. అదే సినిమాలో సమంత కూడా నటించడం విశేషం. సినిమా ఫ్లాప్ అవడంతో రాహుల్ రవీంద్రన్‌కి పెద్దగా గుర్తింపు దక్కలేదు

 అలా సినిమాలు చేస్కుంటూ వస్తోన్న అతనికి తెలుగులో అందాలరాక్షసి కాస్త గుర్తింపు తెచ్చింది. తర్వాత నేనేం చిన్నపిల్లనా, గాలిపటం, టైగర్ చేసినా సుకం లేకుండా పోయింది. మధ్యలో వచ్చిన అలా ఎలా మాత్రం బాగా మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు అతన్ని చాలామంది దృష్టిలో పడేలా చేసింది. ఈ మధ్యలోనే సింగర్ చిన్మయితో లవ్ ఎపైర్..తర్వాత పెళ్లాడటం జరిగింది. ఇక ఈ ఏడాది హౌరా బ్రిడ్జ్ అనే సినిమా వచ్చినట్లే వచ్చి పోయింది. కానీ అక్కినేని కాంపౌండ్‌ని రాహుల్ బాగా ఆకట్టుకుని సుశాంత్‌తో చిలసౌ తీయడం అతని కెరీర్‌ని మరో మలుపు తిప్పిందనే చెప్పాలి. మంచి అభిరుచి ఉన్న సినిమా తీయడంతో ఇతనిలోని దర్శకుడు కూడా బైటికి వచ్చాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున రాహుల్ రవీంద్రన్‌కి పాతికలక్షల రూపాయల చెక్ అడ్వాన్స్ తర్వాతి సినిమా కోసం  ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. ఇంత క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ చెప్పే కథ తమ హీరోల్లో ఎవరికి సూటవుతుందో చూసి వారితో తీస్తాడని అంటున్నారు. అలా హీరోగా ఎంటరై..దర్శకుడిగా హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ మరో బ్రేక్ తెచ్చుకుని  ఏకంగా సూపర్ స్టార్ మహేష్‌తో తీయాలని టార్గెట్  పెట్టుకున్నాడు

Comments