పవన్ కల్యాణ్ ఇందులో నీకు భాగం లేదా?


పోరాట యాత్ర అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో జనంలో తిరుగుతూ వారినే ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్ ఇవాళ ఓ వాదన తెరపైకి తెచ్చారు. జిల్లాలో టిడిపికి 15 సీట్లు కట్టబెట్టామని..అయినా జిల్లాకి టిడిపి ఏమీ చేయలేదని ఆరోపించారు. అలానే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

జిల్లాల్లో బిసిలు కానీ..కాపులు కానీ ఎవరికైనా అన్యాయం చేసిందంటే అది టిడిపినే అని ఆరోపించిన పవన్ కల్యాణ్ అసలు పశ్చిమగోదావరిజిల్లాలోని వారు ఓట్లు వేయకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా అంటూ ప్రశ్నించడంతో పాటుగా..అలా అవబట్టే కదా..నారా లోకేష్ ఇవాళ మన నెత్తిన కూర్చుంది అని ఎద్దేవా చేశారు..బాగానే అడిగారు కానీ..ఆ తప్పేదో పశ్చిమగోదావరి ఓటర్లు చేసినట్లు ఎందుకు అడగాలి..అందులో ఆయనకీ భాగం ఉందనే విషయం మర్చిపోతే ఎలా? కులాన్ని నమ్ముకుని రాలేదని అంటూనే మళ్లీ వెంటనే కులసంఘాలపై వ్యాఖ్యలు, చేయడం..బ్యానర్లపై కొంతమంది కులనేతల ఫోటోలు పెట్టడం..(వీళ్లని దేశ్‌కీ నేతాలుగా ఎవరూ భావించరు..తమ వర్గాలకు చెందిన నేతలుగానే ఆయా వర్గాలు చెప్పుకుంటాయ్..పైకి  ఎన్ని మాటలు చెప్పినా..)వాళ్ల ఫోటోలు పెట్టడం ద్వారా ఆయా వర్గాలని ఆకట్టుకోవచ్చని అనుకుంటే పొరపాటు

ఓ రెండు మూడు గదుల్లో పట్టేంత చార్జిషీట్లుతో కేసుల్లో ఉన్న జగన్‌కి ఎందుకు ఓట్లు వేయాలి..అనుభవజ్ఞుడు తెలుగుజాతికి న్యాయం చేసే సామర్ధ్యం ఉన్న లీడర్ చంద్రబాబు..అందుకే ఆయన్నే గెలిపించండి అని పవన్ కల్యాణ్ ఎన్ని సభల్లో చెప్పలేదు..మరిప్పుడు ఖచ్చితంగా ఆ తప్పుకి తాను బాధ్యత వహించకుండా కేవలం టిడిపినే నిందిస్తే ఏంటి ప్రయోజనం? ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చెప్పలేం కానీ..అప్పట్లో తాను కూడా బాబుకి ప్రచారం చేసానని..దానికి తనని మన్నించమని కోరితే..ప్రజాదరణ దక్కుతుంది కానీ..ఇలా ఎప్పటి మాటలు అప్పటిలా చెప్తే ఎలా..?

Comments

Post a Comment