వ్యాపం పాపానికి అంతం లేదు


53 మరణాలు
అన్ని ఒకే విషయంతో ముడిపడ్డవే
అవెలా జరిగాయో నేటికీ అంతు పట్టడం లేదు
దేశంలోని విద్యావ్యవస్థ అవకతవకలకు అద్దం పట్టిన ఉదంతం వ్యాపం..విద్యార్హతలు లేకపోవడం, అడ్డదారిలో అడ్మిషన్లు, ఆ తర్వాత వాటి రద్దు ఇలా రకరకాల కారణాలతో మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న మోసం వ్యాపం..ఇదే అంశంతో సంబంధం ఉన్న 53మంది వ్యక్తులు చనిపోయారు. అన్నీ అసహజ మరణాలే. ఎలా జరిగాయో ఇప్పటికీ తేల్చలేదు..ఈ కేసులో సాక్షులుగా ఉంటారనో..ఉన్నారనే కారణంతోనే ఇవన్నీ జరిగాయని మాత్రం ఖచ్చితంగా
చెప్పగలరు ఆధారాలు మాత్రం చూపలేరు..తాజాగా ఎన్నికలు రాబోతోన్న తరుణంలో కేసుకి సంబంధించిన కీలకంగా అనుకుంటున్న కొన్ని డాక్యుమెంట్లు కన్పించడం లేదని  అంటున్నారు..అసలు ఏంటి ఈ కేసు

వ్యావస్యిక్ పరీక్షా మండల్ -వ్యాపం పూర్తి పేరు..
ఇది  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు పర్యవేక్షించే ఓ బోర్డు. ఈ కేసు పూర్వాపరాలు ఓ సారి చూద్దాం.

2009లో ఆషిష్ చతుర్వేది అనే గ్వాలియర్ వాసి తన తల్లికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం స్థానిక ఆస్పత్రులకు వెళ్లాడు..అక్కడే అతనికి వైద్యుల అర్హతల గురించిన అనుమానాలు బయలుదేరాయ్. పేరుకే డాక్టర్లు కానీ, ఎందుకూ పనికిరాని మనుషులు వైద్యం చేయడం చూశాడు. ఫలితంగా అతని తల్లి మరణించింది. ఆ తర్వాత
రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సదరు డాక్టర్ల అడ్మిషన్ ఫామ్స్, ఆన్సర్ షీట్లు, వైద్యవృత్తిలో ప్రవేశించడానికి పెట్టిన పరీక్షలలో వారికి వచ్చిన మార్కులు, ఓఎంఆర్ షీట్లు అన్నీ..అన్నీ...సంపాదించాడు.

సరిగ్గా ఇదే సమయంలో ఇండోర్‌లో ఓ వ్యక్తికీ ఓ సందేహం వచ్చింది. వచ్చింది ఏ సామాన్యుడికో కాదు. ఓ పిజి డాక్టర్‌కి. పేరు ఆనంద్ రాయ్. స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్‌లో తనకంటే తక్కువ సమర్ధత కలిగిన వారికి ఎలా ఎక్కువ మార్కులు వచ్చాయి అని ఆనంద్ రాయ్‌కి అనుమానం వచ్చింది. వెంటనే ఓ రాతపూర్వక ఫిర్యాదు
చేశాడు. అసలు పరీక్షకి హాజరైన వారి ఫోటోలు, వారి అడ్మిషన్ కార్డు, పొందిన మార్కులు ఇవన్నీ ఎంక్వైరీ కోరాడు. అలా తనిఖీ చేస్తే 600మంది పరీక్ష రాస్తే, 114 మంది ఫోటోలు వేరు పరీక్ష రాసినవారు వేరు. అంటే ఈ 114మంది వేరేవారి ద్వారా పరీక్షను రాయించారని తేటతెల్లమైపోయింది.  మరి అసలు 114మంది తర్వాత ఏం చేశారు..?
ఇది 2009 వరకూ జరిగిందా..ఇంకా వెనక్కి వెళ్లి చూస్తే...ఫలితాలు ఇంకాస్త షాక్. 2007-13 వరకూ ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వాటిలో పరీక్ష కోసం అప్లై చేసుకున్నవారి స్థానంలో వేరే వారు వచ్చి రాయడం
అధికారులు ఈ మోసగాళ్లైన అభ్యర్దుల కోసం సీటు అరేంజ్‌మెంట్లు కూడా మార్చడం అలానే కరెక్ట్ ఆన్సర్లు రాసే విద్యార్ధుల ఆన్సర్ షీట్లను వెనుకవారికి కన్పించేలా చేయడం ఆ తర్వాత ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ కోటాలో కూడా ఇలానే మోసపూరిత రిక్రూట్ మెంట్లు జరిగాయ్. అవి ఎలాగంటే ప్రతి సీటునూ ముందే ఓ సీనియర్ స్టూడెంట్‌తో ఫిల్ చేసినట్లు చూపించడం తర్వాత మిడిల్ డ్రాప్ చేసి..వారికి కావాల్సిన వారికి అమ్మడంతో తమ ప్లాన్ అమలు చేసేవారు.

ఇక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ప్రశాంత్ పాండే కూడా ఈ వ్యాపం బోర్డులోని మరో కోణాన్ని బైటపెట్టాడు. ఈయన అభిప్రాయం ప్రకారం 20వేల అభ్యర్ధుల విషయంలో కుట్రపూరితంగా మోసం చేసి ర్యాంకులు పొందేలా చేయడం జరిగింది. ఈ మోసాలన్నీ బైటపడిన తర్వాత వ్యాపం బోర్డు కంట్రోలర్ పంకజ్ త్రివేది, ప్రిన్సిపల్ సిస్టమ్ అనలిస్టి నితిన్ మోహింద్ర‌పై సిబిఐ చార్జ్ షీట్ వేసింది. తమ ఎంక్వైరీలో ప్రశాంత్ పాండేకి డజన్లకొద్దీ ఎక్సెల్ షీట్లు మొహీంద్ర కంప్యూటర్‌లో కన్పించాయి. వీటిలో కాండిడేట్ల పేర్లు, ఓఎంఆర్ షీట్ల నంబర్లు ఎలా మ్యాప్ చేయాలి..ఎలా మేనిప్యులేట్
చేయాలి వంటి విషయాలన్నీ నీట్‌గా రాసి పెట్టి ఉన్నాయట.  ఐతే విచిత్రం ఏంటంటే స్థానిక రాష్ట్రప్రభుత్వం పాండేపైనే కేసు పెట్టింది. అరెస్ట్ చేసింది. ఎస్‌టిఎఫ్‌లో పని చేస్తున్నప్పుడు ఫోన్ డేటా టేంపరింగ్ చేసాడని ఆరోపించింది. ఐతే పాండే మాత్రం ఓఎంఆర్ షీట్లు, ఒరిజినల్  స్కాన్ చేసిన కాపీలను తనిఖీ చేయాలని సిబిఐను కోరుతున్నాడు. తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన వ్యాపం స్కామ్‌ జరగలేదని అనవద్దని..కావాలంటే ఆధారాలుంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరాడు

కట్ చేస్తే, వ్యాపం స్కామ్‌ బైటపడిన తర్వాత 250 ఎఫ్ఐఆర్‌లు దాఖలు అయ్యాయ్. ఐతే ఈ కేసులో సంబంధం ఉన్న 35మంది చనిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో వారిలో చాలామందికి బెయిల్‌తో ఇప్పుడు బైట తిరుగుతున్నారు. చతుర్వేది, పాండే చెప్పడాన్ని బట్టి  సిబిఐ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత కొత్త  అరెస్ట్ ఒక్కటి కూడా జరగలేదు. అలానే చతుర్వేదిపై 16 హత్యాప్రయత్నాలు జరిగాయట..ఇదొక్కటి చాలు దర్యాప్తు జరుగుతున్న తీరు, దానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్న తీరు అర్ధమవడానికి. అలానే జగదీష్ రాయ్ అనే ప్రధాన నిందితుడు చతుర్వేదిని ప్రత్యక్షంగానే ఎయిర్‌పోర్టులో బెదిరించిన సందర్భం కూడా ఉందట. విచిత్రం ఏమిటంటే,
"ఎవరిపైనైతే నేను నేరారోపణ చేసానో..ఎవరైతే తప్పు చేశారో వారు ఫ్రీగా బయట తిరుగుతున్నారు నేను మాత్రం ఏదో తప్పు చేసినవాడిలా ప్రతి క్షణం ప్రాణభయంతో 
తిరుగుతున్నా "  
ఈ కామెంట్లు చాలు దేశంలో నిజాయితీపరుల దుస్థితిని తెలియజేయడానికి

Comments

Post a Comment