రాపూరులో రచ్చ రచ్చ పోలీసులకు కన్పించింది సీన్


ఒక్క రోజే రెండు ఇన్సిడెంట్లు పోలీసుల డొల్లతనాన్ని బైటపెట్టాయ్. ఒకటి ఓ లేడీ స్టేషన్లోనే తన జతగాడిపై రెచ్చిపోయి బాదిన దృశ్యం..రెండోది నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్ఐ తలపగలకొట్టినది. పోలీసులే ఎప్పుడూ జులుం  ప్రదర్శించాలా...జనం తిరగబడితే..మూకుమ్మడిగా దాడి చేస్తే ఎలా ఉంటుందో ఈ రెండో సీన్ స్పష్టంగా చూపించింది. ఎప్పుడూ ఒక్కడిని చేసి పోలీసులు తెగ బాదిన దృశ్యాలు టివీలో చూసేవారికి..ఈ రెండో దృశ్యం బాగా ఆనందం కలగజేసింది..ఇదేదో శాడిజంతో చెప్తున్న మాట కాదు

ఫ్రెండ్లీ పోలీసింగ్..పేరుతో ఎన్ని షెకలు పడ్డా...ఓ పోలీస్ సామాన్యుడిని మర్యాదగా పలకరిస్తాడంటే దాదాపు ఎవరూ నమ్మరు..ఎవరో ఒకరు..ఎక్కడో ఓ చోట చక్కగా ప్రవర్తించవచ్చు కానీ జనరల్‌గా పోలీసులు జోలికి ఎవరూ పోరు. ఇది ఫ్యాక్ట్. కానీ రాజేష్ అనే కుర్రాడిని కేసు విషయంలో కొట్టారని..బలవంతంగా సెల్‌లో వేశారని స్థానికులు కొంతమంది బంధువులతో కలిసి స్టేషన్‌పై దాడి చేశారు..ఐతే అలా చేసినవారు పసిబిడ్డలతో సహా రావడం చూస్తే..ఏదో సమ్ ‌థింగ్ తేడా ఉఁదనుకోకతప్పదు.


ఎందుకంటే సామాన్యులుగా కన్పిస్తున్నవారికి అలా స్టేషన్‌పై దాడి చేసేంత ధైర్యం ఉండదు
అలా చెలరేగిపోయి ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇద్దరిపై దాడి చేశారంటే జీవన్మరణ సమస్య అయి ఉంటుందనుకోవాలి..కానీ కేసులో డీప్ గా దర్యాప్తు చేసామని చెప్తున్న పోలీసులు... ఈ దాడి వెనుక స్థానిక టిడిపి నేత మధు ఉన్నాడని చెప్తున్నారు. అతని బెల్ట్ షాపులు మూసేసినందుకు పగబట్టి ఎస్‌ఐని ట్రాప్ చేసి ఇలా దాడి చేశారని పోలీసుల కథనం.  ఎంత దాడి చేసినా...తర్వాత అదే ఊరిలో తిరగాలంటే పోలీసులతో పని పడకుండా ఉఁడదు..ఐనా ఇలా చేశారంటే పోలీసింగ్ వ్యవస్థ మారాలేమో మరి

Comments