కేసీఆర్ ఏ కులానికి ఎన్ని సీట్లు కేటాయించారో తెలుసుకోండి


కులమతాలను పట్టించుకోం..ఎవరైనా ఒకటే ఈ స్లోగన్లు ఎక్కువగా లీడర్ల దగ్గరనుంచి వింటుంటాం. అదే
నోటితో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామనీ అంటారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల సమయంలో పార్టీల తీరును గమనిస్తే...కులం లెక్కలు ఎంత పక్కగా పట్టించుకుంటారో అర్ధమవుతోంది..

తెలంగాణ రాష్ట్ర సమితి విషయమే తీసుకుంటే..ఆ  పార్టీ 2018 డిసెంబర్ లో ఎన్నికలలో పోటీ కోసం
తమ అభ్యర్ధులను ముందే ప్రకటించింది. పైగా ఖచ్చితంగా వందసీట్లు గెలుస్తామంటూ హడావుడి
చేస్తోంది కూడా..మొత్తానికి మొత్తం 117సీట్లలో పోటీకి కాండిడేట్లను అనౌన్స్ చేయడం ద్వారా ఏ పార్టీతో
అఫిషియల్‌గా దోస్తీ లేదని చెప్పినట్లైంది. వీళ్లని కులం సర్కిల్‌లో కనుక ఎంచి చూస్తే.. ఆ లెక్కలు ఇలా
తేలతాయి..37 సీట్లలో రెడ్డి, 12 సీట్లలో వెలమలకు..ఆ తర్వాత కమ్మ కులం అభ్యర్ధులకు 6 సీట్లు కేటాయించారు.
 అంటే 55 సీట్లు పక్కా డామినేషన్ క్యాస్ట్‌ల సీట్లన్నమాట..ఇక ఆ తర్వాత బ్రాహ్మణ అభ్యర్ధి ఒకరు..కోమట్లనబడే..వైశ్యులకు  ఒక సీటులో పోటీకి కాండిడేట్లను ప్రకటించారు.

 తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని చెప్పే గౌడ..యాదవ..వర్గాలకు దక్కిన ప్రాతినిధ్యం చూస్తే ఆశ్చర్యపోకతప్పదు..
6-ఆరుగురు గౌడ్, యాదవులకు 5 సీట్లు..మున్నూరుకాపులకు 8 సీట్లు ప్రకటించారు.
ఓసీలు మొత్తంగా చూస్తే..57 సీట్లు..అంటే ఉన్న 117 సీట్లలో సగం ఓసీలకే పోతే..మిగిలిన వాటిలో బిసిలకు 24 సీట్లు..ఎస్సీలకు 19,  ఎస్టీలకు 12 సీట్లు కేటాయించారు..ఇవి కూడా ఆయా వర్గాలకు రిజర్వ్డ్ కేటగరీ కాబట్టే నిలబెట్టాల్సి వచ్చింది తప్ప..జనరల్ సీట్లలో బీసీలు..ఎస్సీలను నిలబెట్టే ధైర్యం చేయలేదు. ఇదీ టీఆర్ఎస్‌లో కులానికి ప్రాధాన్యాల వారీగా దక్కిన ప్రాతినిధ్యం

Comments