అత్యుత్సాహంలో రికార్డులు బద్దలు అయ్యాయని ప్రచారం..కానీ నిజం ఏమిటంటే...


హరీష్ రావ్ మెజారిటీ విషయంలో కొన్నిసార్లు కొన్ని పత్రికలు కొన్ని చానళ్లు అదే పనిగా ఊదరగొడుతూ...తమకి ఇష్టంలేని నిజాలను దాచిపెడుతున్నాయ్. ఆయనకి ఇప్పుడు వచ్చిందే బంపర్ మెజారిటీ..2010లో ఆయన రికార్డు రెండోదే తప్ప మొదటిది కాదు..అప్పట్లో ఆయనకి 95858 ఓట్ల మెజారిటీ అంటున్నారు..అదే నంబర్ వన్ ..ఏపీ (అంటే విడిపోని ఆంధ్రప్రదేశ్) అని చెప్తున్నారు..కానీ అప్పటికే అంతకన్నా ముందే లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిచినవాళ్లున్నారు..అంటే క్లియర్ గా హరీష్ రావ్ ఇప్పుడు గెలిచిన మెజారిటీనే అతి ఎక్కువగా చెప్పుకోవాలి..ఇంతకీ ఆ పాత రికార్డు ఎవరి పేరిట ఉందంటే...
ఇదిగో కింద టేబుల్ చూడండి


2004లోనే ఎంఐఎం నుంచి గెలిచిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి బీభత్సమైన ఆధిక్యంతో గెలిచినట్లు తేలిపోయింది కదా , లక్షా ఏడు వేల తొమ్మిదివందల ఇరవై ఒకటి...ఇదీ ఆయన మెజారిటీ . గెలిచింది. టిడిపిపైన..ఆ ఎన్త్నికలలో టిడిపి అభ్యర్ది తయ్యబా తస్లీమ్‌కి వచ్చిన  ఓట్లు 22958..

అంటే ముందు చెప్పినట్లు హరీష్ రావ్ కి వచ్చిన 95858 ఓట్ల మెజారిటీ రెండోదో...మూడోదో మాత్రమే..( వాస్తవాలే తప్ప గెలుపును తక్కువ చేసి చూపించడం కాదు) ఐతే 2018లో వచ్చిన మెజారిటీ మాత్రం అత్యధికమే..
తెలంగాణ జనసమితి అభ్యర్ధిపై ఆయన లక్షా 20వేల 650 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇది ప్రస్తుతానికి నంబర్ వన్..






Comments