ఆయన ఓడిపోతాడని..కొండా సురేఖ మాత్రమే గ్రహించింది..కానీ..

 తాను ఓడిపోయింది కానీ..ఈ పరకాల చెల్లెమ్మ..ఆయన ఓడిపోతాడని మాత్రం ఖచ్చితంగా చెప్పింది..ఐతే ఈ మాటే వాళ్ల పెద్దసారుకి నచ్చకపోవడంతో టిఆర్ఎస్ నుంచి బైటికి రావాల్సి వచ్చింది..ఇంతకీ ఎవరీ ఆయన అంటే...తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మధుసూదనాచారి.
మాములుగానే స్పీకర్లుగా  పని చేసినవాళ్లు తిరిగి గెలవరని అంటుంటారు. నిజంగా ఫలితాలు కూడా అలానే వచ్చాయ్. ఈ తాజా మాజీ స్పీకర్..మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి విషయంలో కూడా ఇదే జరిగింది. " ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు..అక్కడ వేరేవాళ్లకి కనుక అవకాశం వస్తే మాకు ఇవ్వండి..మేం పరకాలలో ఒకటి..వరంగల్ లో ఒకటి పోటీ చేస్తాం...పాప కూడా వస్తానంటోంది అని కేటీఆరుకు..కేసీఆరుకు ఇద్దరికి చెప్పినం " అని పాపం కొండా సురేఖ ఎన్నికలకు ముందు వాపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.   ఐతే 105 మంది అభ్యర్ధుల లిస్టు ప్రకటించేసి..ఆమెని మాత్రం పొగబెట్టి బైటికి పంపేసింది టిఆర్ఎస్. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు..రౌడీయిజం ఈ మాటలు పక్కనబెడితే..వరంగల్ జిల్లాలో కొండా గ్రూప్ ప్రముఖమైనదే..మరీ అంత తీసేసేదేం కాదు..ఐనా కేసీఆర్ ఆమెని పట్టించుకోకుండా..సాగనంపడంలో ఆయన
లెక్కలు ఆయనకి ఉండి ఉఁటాయి.
భూపాలపల్లిలో ఓడిపోతాడని తెలిసే టిక్కెట్ ఇచ్చారంటే ఎందుకు ఆయన్ని టిక్కెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఫీలింగే అయి ఉంటుంది. తన ఓటమి సంగతి తెలీకపోయినా...మధుసూదనాచారి ఓటమి మాత్రం ఖచ్చితంగానే సురేఖ అంచనా వేసింది..ఏదేతైనేం పాపం కొండా సురేఖ అటు పార్టీకి దూరమై..ఇటు గెలవలేక రెండింటికీ చెడ్డ రేవడి కాగా...ఇక సారు నుంచి పిలుపు వస్తే కారు ఎక్కుతారేమో చూడాలి

Comments