ఏక్..దో..తీన్..మాధురీ వచ్చేస్తోందట పాలిటిక్స్ లోకి



ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీదీక్షిత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం కాబోతోంది. ఇప్పటికే ఇఁదుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తైనట్లు బిజెపి చెప్తోంది. సంపర్క్ ఫర్ సమర్ధన్ అనే పార్టీ కార్యక్రమంలో భాగంగా అమిత్‌షా దేశవ్యాప్తంగా అనేక నగరాలు తిరిగారు. సెలబ్రెటీలను కలిశారు. వీరందరిలో మంచి ఫాలోయింగ్
ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానించడమే సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమం లక్ష్యం. అలా ఆరునెలల క్రితం అమిత్‌షా మాధురి దీక్షిత్‌ని కూడా కలిశారు. తాజాగా మాధురిని పూణే నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతారంటూ ప్రచారం జరుగుతోంది. పుణె లోక్‌సభ స్థానంలో మాధురి దీక్షిత్ సులభంగా గెలుస్తుందని బిజెపి అంచనా.  2014 లోక్‌సభ ఎన్నికలలో పుణె లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బిజెపి కైవశం చేసుకుంది. బిజెపి అభ్యర్థి అనిల్ షిరోలె మూడు లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. కాబట్టి..ఇక్కడ 2019లో మాధురి దీక్షిత్ కనుక అంగీకరిస్తే, గెలవడం పక్కా అని బిజెపి అంచనా వేస్తోంది. ఐతే మాధురి దీక్షిత్ మాత్రం ఈ విషయానికి సంబంధించి పెదవి విప్పలేదు



వ్యతిరేకత వ్యక్తమైన సందర్భాలలో మోడీ ఇలా కొత్త ముఖాలను తెరపైకి తెస్తుంటారని..అందులో భాగంగానే మాధురి దీక్షిత్ పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు.  2017లో ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిట్టింగ్ కౌన్సిలర్లు ఎవరికీ టిక్కెట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చారు. ఆ ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. అందుకే ఇలా కొత్త ముఖాలను..పొలిటికల్ స్క్రీన్‌పైకి తీసుకువచ్చే సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమం ఏర్పాటైనట్లు తెలుస్తోంది..
అసలు ఇంతకీ మాధురి దీక్షిత్ ఎంట్రీతో ఎవరికెంత లాభం అనేది లెక్కగడితే..మాధురి దీక్షిత్ ని పోటీకి దించడం ద్వారా మహారాష్ట్రతో పాటు మిగిలిన నియోజకవర్గాలలో స్టార్ క్యాంపైనర్‌గా పని చేయించుకోవచ్చనేదే బిజెపి ప్లాన్‌గా అర్ధమవుతోంది. ఎఁదుకంటే
ఓ డ్రీమ్ గాళ్ 70ఏళ్లకి దగ్గరపడటంతో..మరో డ్రీమ్ గాళ్‌ని తీసుకురావడం ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకోవడమే కమలనాధుల వ్యూహం

Comments