ఎందుకు బాబూ..ఈ సినిమా...బయోపిక్ ఇంకెవడూ ట్రై చేయకుండా నాశనం చేశారుగా


బయో పిక్ అంటే..నేనే తీయాలి..ఎవడికీ సాధ్యం కాదు..నా తర్వాత నేనే అన్నట్లుగా బిహేవ్ చేసేవారికి సినిమా ఫలితమే ఓ గుణపాఠం అవుతుంది. ఎందుకంటే పోలికలు..పోషించిన పాత్రలు కూడా కాదు..బయోపిక్ అంటే..ఓ వ్యక్తి జీవితంలో ఏ ఏ దశల్లో ఎలాంటి వైఖరి తీసుకున్నాడు..దాంతో సమాజం ఎలా ప్రభావితం అయింది..లేదంటే ఆయన ఎలాంటి దశకు చేరుకున్నాడు..అనే అంశాలతో తీస్తేనే అది సక్సెస్ అవుతుంది..దానికి వారి పేర్లే పెట్టక్కర్లేదు..అలాని కావాలని ఎవాయిడ్ చేయక్కర్లేదు. దీనికోసం ఆయా పాత్రల్లాగానే కన్పించాలని లేదు..

ఓ పేద్ద నాయకుడు..అయన నటుడు కూడా..అలాంటప్పుడు ఆయన జీవితంపై సిినిమా తీయాలనుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు..దానికి లేనిపోని అతిశయోక్తిలు జోడిస్తేనే విషయం విషమిస్తుంది. అసలు అందులోనూ సదరు లీడరు జీవితం ఇప్పటి తరానికి పెద్దగా తెలియనది కూడా కాదు..ఆ మాటకి వస్తే కొంతమంది బయోపిక్ తీయాల్సిన అవసరం ఏముంది అని కూడా వాదిస్తున్నారు. సిినిమా తెరపై ఎలాంటి పాత్రలు ధరించాడనేది ఇంకోసారి రిపీట్ చేయక్కర్లేదు..ఆ సినిమాలు చూస్తే చాలు..ఇక రాజకీయజీవితంలో ఎలాంటి ఎత్తుగడలు వేశారనడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు..కన్పిస్తూనే ఉన్నాయి.ఇక్కడే అసలు నిజాలు లోపల ఉండి..ఎవరు ఎలా తీస్తే..అలా బైటికి వస్తాయి..ఇక్కడే మహానాయకుడికి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి కాస్త అట్రాక్షన్ కన్పిస్తుంది.

ఓ వృధ్దుడు మరో యువకుడి పాత్ర పోషిస్తున్నాడంటే దానికి ఆహార్యం అతకాలి..ఇక్కడ  అది లేదని అర్ధమైపోయింది ..కొడుకు కాబట్టి..ఏం చేసినా చూడాలి..వందిమాగధులు పొగడాలి అంటే కుదరదు..పైగా భావితరానికి ఇదో మార్గదర్శి అనో..ఇది చూసే ఆయన ఇలా చేసాడు అని అనుకోవడమే లక్ష్యంగా చెప్పుకున్నప్పుడు ....అస్సలు బావుండదు..సరికదా ఈయనేంటి ఇలా ఉన్నాడనిపిస్తుంది అలాంటప్పుడు ఇంకాస్త వేషధారణ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదెటూ డైరక్టర్ తీసుకోడని ఈయన వందో సినిమాలోనే ప్రూవ్ అయింది కనీసం సురభి నాటక కంపెనీ( కనీసం అనే పదం తప్పేమో) యుధ్ద సన్నివేశాలకు కూడా సరితూగని యుధ్దసన్నివేశాలను జొప్పించి ఆయన తీసిన ఆ శాతసినిమా...కర్ణకఠోరంగా ఉండటంతోనే అతగాడి ప్రతిభ ఇలాంటి సినిమాలకు పనికిరాదని అర్దమైపోయింది. ఐనా..వేరే దిక్కులేనట్లు అతగాడిని పెట్టుకోవడం కరెక్ట్ కాదు..భావోద్వేగ..భావపూరిత సినిమాలు వేరు..చారిత్రక, జీవిత కథలు వేరు..ఇప్పటికైనా మనస్సులో అంతర్మథనం చేసుకుంటే..వెంటనే బైటికి వచ్చి సినిమాలోని లోపాలకు బాధ్యులం మేమే అని పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి..లేదంటే మహానాయకుడి ఆత్మ క్షోభించడం ఖాయం

Comments

 1. బరువు వంద కిలోలు దాటి వయసు అరవైకి దగ్గర పడుతున్న హీరో గారు అరకిలో మేకప్పు, గంగిరెద్దులను తలపించే అంగీలు (రెండు గుండీలు విప్పి మరీ) & లొడం బడం బెల్లుబాటం ప్యాంట్లు ధరించడం, ఆయన తన బరువులో సగం వయసులో మూడో వంతు ఉన్న నటీమణులతో ఎబ్బెట్టు కలిగించే విన్యాసాలు చేయడం & అసహ్యం వేసే ఏకార్ధక/ద్వందార్ధక బూతు పాటలు చిత్రీకరించడం నాలుగు దశాబ్దాల కిందటి పరమ చెత్త ఫార్ములా.

  అప్పుడు ఎందుకు నడిచాయో ఏమో కానీ వాటినే ఇప్పుడు అద్భుత కళాఖండాలుగా భావించాలంటే ప్రేక్షకులను అవమానం చేసినట్టే.

  ReplyDelete
 2. Very sad. Biopic is not a copy paste of old movie clippings. What these guys did was big blunder and mistake. First Balakrishna should remember ,NTR is not GOD. He is an ordinary man , struggled to fulfill his passion and became one of the greatest actors. It should focus this way. Its clearly evident that Makers left that idea in planning stage itself.

  ReplyDelete
 3. ఇతర భాషల సినిమాలు మనవాళ్ళు చూడకపోవటం వల్ల ఏ చెట్టూ లేనిచోట మహావృక్షం అన్నట్టు చెల్లిపోతున్నది గానీ తమిళ శివాజీ గణేశన్,కన్నడ రాజ్ కుమార్ ఇంతకన్న గొప్ప నటులే కదా!

  వాల్మీకి సినిమా తెలుగులో రామారావుతొనూ కన్నడంలో రాజ్ కుమార్ తోనూ తీశారు.రెండు వెర్షన్లూ నేను చూశాను.రాజ్ కుమార్ ముందు రామారావు స్టేల్ అయ్యాడని అనిపిస్తుంది!యూట్యూబులోనే చూశాను రెండిట్నీ.

  తను అసలు కష్టప్డకుండా పైకొచ్చాడని ఎవరూ అనలేరు కానీ అతనొక్కడే మహానటుడు,ఇంకెవరూ లేరు అని అనకూడదు.రామారావు మిస్సమ్మ సినిమాలో ఎంత సన్నగా ఉన్నాడు?రాముడు భెముడు సినిమాకే ఎంత లావైపోయాడు!అదే రాజ్ కుమార్, ప్రేం నజీర్ చివరి వరకు రివటల్లా ఎంత చక్కగా ఉన్నారో చూడండి!మొహంలో యూత్ ఎఫెక్ట్ అలాగే ఉంది,తెర మీద కనపడే రూపంలో వయసు కూడా పెరగలేదు.అయినా వాళ్ళు ఆరేసుకోబోయి పారేసుకునే చెత్త పాటలకి డ్యాన్సులు చెయ్యలేదు.

  ఇతర భాషల వాళ్ళతో పోల్చకుండా మన భాషలో మనవాడు గ్రేట్ అని డప్పు కొట్టుకుంటే ఎల్లకాలం నిల్వదు.వాల్మీకి లాంటి సినిమాలు ఎప్పుడైనా ఎవరైనా చూసే అవకాశమూ ఉంది,అప్పుడు ఎలా కవర్ చేసుకుంటారో!

  ReplyDelete
  Replies
  1. 100% agreed.

   తెలుగులో సైతం ఎన్టీఆర్ ఒక్కడే గొప్ప నటుడనడం కరెక్ట్ కాదు, పైగా అక్కినేని & రంగారావు గార్లను ఆవమానించినట్టే.

   Delete
 4. Really NTR seems to be over rated actor, unnecessarily media is projecting him as God.

  Really if u see he did almost nothing for people

  ReplyDelete

Post a Comment