బాబూ చినబాబు సినిమా చూపిస్తాడట..సిధ్దమేనా



నారా లోకేష్ గారు ఈ మధ్య ఏ డైలాగూ వేయడం లేదని..అటు ప్రతిపక్షాలు..మీడియా ఆబగా ఎదురుచూస్తుంటే..టిడిపి మాత్రం గుండెలపై చేయి వేసుకుని హ్యాపీగా రిలాక్సవుతున్నారు..కానీ మళ్లీ కాకినాడ సభలో మళ్లీ ఏసేశారు..కాకపోతే ఈసారి వ్యాఖ్యలలో తడబాటు కాదు..అసలు మాటలే ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలికారు..ఇది టిడిపి స్కందావారానికి నచ్చకపోవచ్చు కానీ ఆయన మాటలు అచ్చంగా అవే

కర్నాటకలో తెలుగుజాతి ప్రధాని మోడీకి ట్రైలర్ మాత్రమే చూపించారట..2019లో మాత్రం అసలు సినిమా చూపిస్తారట..ఈ కామెంట్ చేసిన తర్వాత సభలో ఒకరిద్దరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే..వేదికపై  ఉన్న లీడర్లు మాత్రం ఇప్పుడెందుకా గతం అనుకున్నట్లుగా అసలు పట్టించుకోలేదు..వాస్తవానికి కర్నాటకలో బిజెపి గెలుపు తీరం చేరలేదు కానీ..చాలా దగ్గర్లోకి వచ్చి ఆగింది.. జేడిఎస్, కాంగ్రెస్ కూటమి వలన అక్కడ బిజెపి  అధికార పగ్గాలు చేపట్టలేదు కానీ..కుమారస్వామి ప్రతి రోజూ వాపోతూనే ఉన్నాడు..ఒరే బాబూ నేనిక్కడ క్లర్కులా పని చేస్తున్నాన్రా..ఈ  కాంగ్రెస్సోళ్లతో నా వల్ల కావడం లేదని రీసెంట్ గా కూడా వాపోయాడు..అలాంటిది అక్కడ మోడీకి కర్నాటకలో తెలుగుజాతి చూపించిన ట్రైలర్ ఏంటో మరి చినబాబుకి..పెదబాబుకే తెలియాలి. ఈ ప్రసంగ వీడియో యూట్యూబ్ లో ఉండగా.. దానికి కింద మనోళ్లు పెట్టిన కామెంట్లు కూడా చూడండి..



నిజమే కదా..మరి తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయినా..నిస్సిగ్గుగా..కర్నాటకలో మోడీకి ట్రైలర్ సంగతి చెప్తుంటే కామెడీ కాక ఎలా ఉంటుంది. పైగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో లేదో చెప్పుకోకుండా..మోడీని గద్దె దింపడమే మా లక్ష్యం అని..కేఈ కృష్ణ మూర్తి నుంచి..నారా లోకేష్ వరకూ అందరూ చెప్పుకుని తిరుగుతుంటే..టిడిపి కార్యకర్తలకు అసలు అర్ధం అంతుపట్టడం లేదు..బిజెపి ఎటూ రాష్ట్రంలో లేదు..అలాంటిది తమకి అచ్చివచ్చిన ఓ స్లోగన్ ని పక్కనబెట్టేసి..ఇలా మోడీ గద్దె దిగడమే లక్ష్యమనే ప్రసంగాలు ఎందుకు..వైఎస్సార్సీపీకి ఓటేస్తే..అది బిజెపికి ఓటేసినట్లే అనే నినాదం నిజంగానే మంచి స్ట్రాటజీ దాన్ని వదిలేసి మోడీనే టార్గెట్ చేస్తే ఏంటి ప్రయోజనం..అంటే ఇటు ఎటూ వేస్టైపోయింది కాబట్టి..ఇక అట్నుంచి నరుక్కున్నట్లు భ్రమించమంటారా..బిజెపి కేంద్రంలో ఓటమి పాలైతే..అదేదో తమ ఖాతాలో వేసుకునే పేలపిండి కాన్సెప్ట్‌ని తలకెత్తుకుంటున్నారా ఏమిట్..?

పైగా ఇదే ప్రసంగంలో మోడీకి దమ్మూ ధైర్యం ఉంటే చంద్రబాబుని కాకుండా..ప్రతిపక్షాలను ఎదుర్కోవాలట..ఇదేం సవాలో అర్ధం కావడంలేదు..అంటే ప్లీజ్ మీకు దమ్ముంటే మా జోలికి రావద్దని చెప్పుకోవడమా

Comments

  1. తెలంగాణాలో చావు దెబ్బలు తిన్నాక కూడా చెంద్రాలు సారు & పప్పు గార్లకు సోయి రాలేదు. ఈ సినిమాలు గట్రా మీ విగ్గు మామకు వదిలేయండి చిన్నబాబూ.

    ReplyDelete

Post a Comment