ఏసీ బిల్ కూడా చంద్రబాబే కట్టాలంటూ అమరావతి వాసుల ధర్నా


సమ్మర్ ఎండలు మండిపోతున్నాయ్..ఐనా అమరావతిలో మాత్రం జనం హ్యాపీగా ఆ ఊసే తెలీనట్లు ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా ఇంట్లో ఉన్నా...బయట ఆఫీసుల్లో ఉన్నా కూడా చెమట అనేదే లేకుండా తెగ పని చేస్తున్నారు..పైగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదోయ్ అంటూ పాత పాటలను నెమరు వేస్తున్నారు..ఇంతలో ఓ నెల గడవగానే..బాగా కోపమొచ్చేసింది వాళ్లకి..మేమింత సుఖపడటానికి కారణం టిడిపి,  ఆ పార్టీ చేసిన పనికి మాకు ఎంత ఖర్చువుతుందో తెలుసా అంటూ ఒకరి తర్వాత ఒకరు సెక్రటరియేట్ బాట పట్టారు.

బాబూ బైటి రావాలి..మాకు ఏసీ అలవాటు చేసిన ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు..ఇదేంట్రా బాబూ ఇలాగ ఉన్నట్లుండి జనం ఇలా మీద పడ్డారు..అసలే ఎన్నికలు ఇంకో పదిరోజుల్లోనే ఉన్నట్లున్నాయ్..ఇదేంటి అని అమాత్యగణంబైటికి వచ్చి చూసారు..ఏంట్రా సామీ మీ గొడవ అంటూ అడిగితే..ఓ గొంతు లేచి..బాబూ మీరు మా ఇళ్లలో ఏసీ పెట్టించారు..అది కూడా  కాలనీలకు కాలనీలే ఏసీ చేశారు..ఎండ వేడి మాకు తెలీకుండా పోయింది..దీంతో మాకు తెలీకుండానే మా కరెంట్ బిల్లు ఎక్కువైపోనాది..ఎందుకంటే..24 గంటలూ కరంట్ ఉంటుంది..అలానే ఏసీ కూడా ఆడించేశాం..ఇప్పుడు చూస్తేనేమో కరంట్ బిల్లు 2వేలు..3వేలు వస్తోంది..అన్నారు
ఆ..మరి..రాక ఊరకుంటదా..వాడారు కాబట్టి కట్టండి అన్నారు అమాత్యగణం..దానికి జనం ఊరుకుంటారా.".ఆ అట్టెట్టా కుదురుద్దీ..ఎటూ ఎలచ్చన్లే కదా..మా బిల్లు కూడా మీరే కట్టేయండి..మేం అడిగావా ఏసీ పెట్టీయమని..అమరావతి అంతా పెట్టిచ్చినోళ్లు ఈ మాత్రం బిల్లు కూడా కట్టేసారంటే చాలు. ఓట్లన్నీ మీకే పడతాయి కూడా.."
అంటూ సమాధానమిచ్చారు..దీంతో సదరు మంత్రులంతా నిజమే కదా..ఈ ఆలోచన కూడా బానే ఉందనుకున్నారు..ఏదైనా మా బాబుకే ఇలాంటి ఆలోచనలు వస్తాయ్..అసలెందుూ..ఆ జగనబ్బాయ్ ముందునుంచీ ఊరూరా  మైకుల్లో చెప్పబట్టి లీక్ చేయబట్టి కానీ..లేకపోతే ఇంటికీ పావుకేజీ బంగారం కూడా పంచిపెడతాం అని ప్రకటించేవాళ్లూ అనుకుంటూ లోపలకి లగెత్తారు
కింద లింక్ చూడండి సారూ
https://www.youtube.com/watch?v=b4pg9MaCSwE

(జస్ట్ కామెడీ..అమరావతి వాసులకు అవసరమైతే పైపులు పెట్టైనా ఏసీ పెట్టిస్తాం అని చంద్రబాబుగారి ప్రకటన చూసిన తర్వాత అన్పించింది..ఎందుకంటే గత  సమ్మర్ లో ఇలానే అమరావతి చుట్టుపక్కల పది డిగ్రీలు టెంపరేచర్ తగ్గించేలా చూడాలంటూ ఆదేశాలిచ్చిన ఘనత కూడా ఈయనదే మరి)

Comments

  1. సెల్ ఫోన్లు, కరెంటు అంతెందుకు సంక్రాంతి పండుగ సైతం కనిపెట్టిందే ఆయన. అంతటి మహనీయుడికి ఏసీ బిల్లు ఒక లెక్కా.

    ReplyDelete
  2. >>>సమ్మర్ లో ఇలానే అమరావతి చుట్టుపక్కల పది డిగ్రీలు టెంపరేచర్ తగ్గించేలా చూడాలంటూ ఆదేశాలిచ్చిన ఘనత కూడా ఈయనదే మరి>>>

    హైదరాబాద్ లో నివాసముంటున్న మా ఇంట్లో సమ్మర్ లో 5 డిగ్రీలు తక్కువ టెంపరేచర్ ఉంటుంది. 20 సంవత్సరాల శ్రమ ఫలితం అది. చంద్రబాబు గారికున్న విజన్ అర్ధం చేసుకోవడానికి విజ్ఞత కావాలిలెండి.

    ReplyDelete
    Replies
    1. https://www.accuweather.com/en/in/hyderabad/202190/month/202190?monyr=4/01/2018

      ఇరవై ఏళ్ల కిందటి ఇంతకు 5 డిగ్రీలు ఎక్కువ ఉండేదా (e.g. 4/19: 41+5= 46)? నేను ఇన్నేళ్ల నుండి ఇక్కడే ఉన్నా ఎప్పుడు గమనించలేదు. గ్లోబల్ వార్మింగ్ అంటున్న రోజులలో లోకల్ కూలింగ్ ఉందంటే సంబరం ఆశ్చర్యం (విగ్గు బాబు భాషలో) కలుగుతుంది!

      ఇదే సైటులో రోజు వారీగా Hist. Avg. ఇచ్చారు చూడండి. This shows a trend of temperature increases, not fall.

      Delete
    2. విజన్ అంటున్నారు! తెలుగుగడ్డను పగులకొట్టటానికి కొందరికి ఉన్న విజన్ ఫలించింది. విజన్ అంటే అది! దీర్ఘకాలంలో ఎటువంటి మంచిచెడులను తెలుగుప్రజలు పొందుతారన్నది ఎవరికి తెలుసును కాబట్టి ఇప్పటికిప్పుడు లభించిన దానిలో కొందరికి ఉన్న మంచికే విజన్ అని పేరుపెట్టేసుకోవటమే జరుగుతున్నది అనిపిస్తోంది. అదటుంచి వెక్కిరించటమే పనిగా పెట్టొకొనేవారితో వాదించి లాభం ఉండదు. కార్యాలయాల్లో కరెంటువాడకంలో ఏసీలదీ లైట్లదీ ముఖ్యభాగమే. ఐతే నిర్మాణశైలిలో మార్పులద్వారా సహజమైన దినకాంతిని హెచ్చుగా లోనికివచ్చేలా చేయటం ద్వారానూ, భవనాల చుట్టుపట్ల పచ్చదనం పెంచటం, సూర్యరశ్మిలోని వేడిమిని తక్కువగా సంగ్రహించేవిధంగా గోడల నిర్మాణం వంటి చర్యలతో భవనాల్లో ఉష్ణోగ్రతలను ఆట్టేపెరుగకుండా చూసి ఏసీ అవసరాలను బాగా నియంత్రించటం ద్వారానూ విద్యుత్తువాడకాన్ని తగ్గించటం చేయవచ్చును. అదీకాక భవనాగ్రాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేయటం వలన విద్యుత్ అవసరాలు మరింత గణనీయంగా తగ్గించవచ్చును. ఇటువంటీ పర్యావరణహితచర్యలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొబ్బిన ఆలోచనలు కావు. తగినంత ప్రచారంలోనే ఉన్నవే. కరెంటును కనిపెట్టటం అవసరం కాదు కానీ బాగాపొదుపుగా వాడుకుందుకు దారులు -అవసరమైతే కొత్తవి- కనిపెట్టటం మాత్రం తప్పకుండా హర్షణీయమే. అంతెందుకు, భవనాలకు వైట్‍టాపింగ్ చేసి కొంతచల్లబరచటం కొత్తవిషయమా? ఐనా, ఇదంతా చెప్పనవసరం లేదేమో. కావాలని విమర్శలు చేసేవారికి ఏమి చెప్పి ఏమిలాభం? చేసేది లేదు కాబట్టి 'జై'మార్కు విమర్శలను చదివి ఎందుకో ఒకందుకు అనందించటమే మంచిది. శుభం.

      Delete
    3. శ్యామలీయం గారూ..మీరు స్పందించడమే మాకు సంతోషం....ఆచరణలో పెట్టనివారి మాటలపై ఓ కామెంట్ కూడా పెట్టకూడదా..ఎందుకంటే..పిల్లలను కనవద్దని చెప్పిన నోటితోనే ఎక్కువమంది పిల్లలను కనమని చెప్పవచ్చునా..మేనరికాలు మంచివి కాదన్న వారే మేనకోడలిని కోడలుగా చేసుకోవచ్చా..సిమెంట్ రోడ్లు వేస్తూ పోతే..వర్షపు నీరు ఇంకడానికి స్థలమే ఉఁడదు అని వాపోయినవారిని వెక్కిరించారు. పదేళ్ల తర్వాత అదే నోటితో సిమెంట్ రోడ్లతో పచ్చదనం పోయింది..నీళ్లు ఇంకడం లేదని ప్రకటించవచ్చా...అమరావతి చుట్టుపక్కల పది డిగ్రీలు తగ్గాలని ఆదేశించారని ఆంద్దర జ్యోతి వార్త చదవలేదా మీరు..చుట్టూ చెట్లు ఉన్న ఇళ్లలో టెంపరేచర్ మిగిలిన చోట కంటే తక్కువ (ఇంట్లో) ఉండటం సాధారణమే..దానికి జై గొట్టిముక్కల గారు అర్ధం చేసుకోవడం తప్పుగా చేసుకున్నారు..సిటీలో ఉష్ణోగ్రత తగ్గిందనుకున్నారు..ఆయన తప్పేం లేదులెండి..ఎటొచ్చీ..కావాలని విమర్శ అంటున్నారు చూడండి..ఏదైనా కావాలనే చేస్తారు కదా..తెలీకుండా చేయడం కొన్ని వాస్తవాల విషయంలోనే కానీ..భవిష్యత్తుని ఊహించడం ఎవరు చేయగలరు..సరదాకి పెట్టిన మాట..అది..ఇక వాస్తవంగా మాట్లాడుకుంటే..చంద్రబాబుగారు చెప్పేవి నిజంగా ఆచరణలోకి వస్తే..హండ్రడ్ పర్సంట్..మంచే జరుగుతుంది..కానీ మాటలే కదా..కోటలు దాటేవి..పనులు ఎక్కడ ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం సార్..

      Delete
    4. చంద్రబాబు గారు ఒక్కరే బిడ్డ చాలు అని పిలుపునిస్తే మావారు ఒక్కరే సంతానం చాలు అని ఆచరణలో పెట్టారు. మేనరికం వద్దని అనుకున్న మేము తప్పనిసరి పరిస్థితిలో తమ్ముడికి మేనరికం పెళ్ళిచేసి పురిటిలోనే బిడ్డలను కోల్పోయిన పరిస్థితిలో ఏమని సలహా చెప్పగలము ? ఒంటరిగా పెరిగినవారు జంటని కోరరు అని అంటే ఆ తల్లిదండ్రులు ఏమని సలహా చెప్పగలరో ఆలోచించండి.

      Delete
  3. @ జై గారు,
    ఆచరణలో పెట్టని ఆలోచనలకే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు తెలుసా మీకు ? ఆయన పేరు చెప్పండి చూద్దాం !
    కేవలం 5 మామిడి చెట్లు పెంచినందుకు 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గింది అని చెపితే 46 ఉండేదా 50 ఉండేదా అని ప్రశ్నించేవారికి ఏమని చెప్పాలి ? బయట 50 డిగ్రీలు ఉంటే మాకు 45 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఇపుడు శీతాకాలం లో అందరికంటే ఎక్కువ చలిగా కూడా ఉంటుంది. మెడ మీద తలకాయ మాత్రమే ఉంటే ఎవరేమైనా పర్వాలేదు నేను మాత్రమే సుఖపడాలి అని కోరుకుంటాడు. తలకాయలో తెలివి ఉన్నవాడు తనతో పాటు తనచుట్టూ ఉన్న ప్రపంచం కూడా బాగుండాలని కోరుకుంటాడు.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిని శాసించే స్థాయికి మనం ఎదిగామని ఆయన చెప్పుకుంటారు. దాన్ని వదిలేసి మీరు గ్రీన్ బిల్డింగ్ వైపు మరలించారు.

      పోనీ అదే అనుకున్నా మీ ఇల్లు చంద్రబాబు కట్టాడా లేదా ఆ టెక్నాలజీ కనిపెట్టిందా ఆయనా?

      తాను సాంకేతిక ప్రగతి నుండి కొన్ని మంచి విషయాలను తీసుకున్నానని చంద్రబాబు అతని భజనపరులు చెప్పుకుంటే నాకూ ఒకే. సదరు గొప్ప విషయాల వెనుక తన విజన్ కారణమంటూ కోతలు కోయడం పైన మాత్రమే ఆక్షేపణ.

      Delete
    2. తెలంగాణా ప్రజలు ఏళ్ళతరబడి పోరాటం చేసినా రాని ఫలితం కేసీఆర్ నిరాహారదీక్షతో వచ్చేసిందని చెప్పుకుంటూ మావల్లే తెలంగాణా వచ్చిందని చెప్పుకునే హరిదాసులకన్నా, చేసిన దానిని చెప్పుకుంటున్న చంద్రబాబు గారు నయమే కదా ?

      Delete
    3. అబ్బే అది కాదండీ. కేసీఅర్ గారు తప్ప, ఆ కేసీఆర్ గారు సమర్థిస్తున్నవారు తప్ప మరెవరన్నా ఏదన్నా చేసారని ఎవరన్నా అంటే సదరు కేసీఆర్ గారి వీరాభిమానులూ (తత్కారణంగా అయా సమర్థితపార్టీలకు అబిమానులూ) ఒప్పుకోరండి. ఒప్పుకోరంటే ఒప్పుకోరంతే. పైగా మీరు కీసీఆర్ గారిని (వారి పార్టీ అన్నది వారికి ఛాయామాత్రమైనదేను కాబట్టి దాన్ని ప్రస్తావించనక్కరలేదు విడిగా) అన్యాపదేశంగా నైనా సరే కించిదపివిమర్శనం చేసినా సరే మీరు కాస్తా ఆంధ్రాదురభిమానులై పోతారు కూడాను.

      Delete
    4. తెలంగాణా వాళ్ళందరూ ఒద్దు బాబో ఆంధ్రతో కలిసే ఉందామని మొత్తుకుంటున్నా కెసిఆర్ ఒకడే సోనియా గాంధీతో కలిసి కుట్ర చేసి తలుపులు మూసి మరీ తెలంగాణా తెచ్చాడని తెగ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు?

      కెసిఆర్ వల్లే తెలంగాణా వచ్చిందని నేనెప్పుడూ అనలేదు. ఆయనకు సదరు "పాపం" అంటకట్టింది "విశాలాంధ్ర వీరాభిమానులు" తప్ప వేరే కాదు.

      Delete
  4. శ్యామలీయం గారూ .... ఋుషిమూలం, నదిమూలం శోధించే ప్రయత్నం చెయ్యరాదు .... ఇటువంటి సూక్తి ఏదో ఉందని విన్నాను. మరి అలాగే ప్రస్తుత తెలుగు బ్లాగ్ లోకంలో వృధాప్రయాసలు రెండు ఉన్నాయి కదా 😀. (1). "జిలేబి" గారి నిజ నామధేయం / వివరాలు కనుక్కునే ప్రయత్నం 😀. (2). కరడు గట్టిన వాదులతో తర్కించే ప్రయత్నం 🙁.

    ReplyDelete

Post a Comment