వంగవీటి రాధా..ఎందుకీ ఆత్మవంచన..అసలు రంగా స్థాయికి ఏనాడైనా ఎదగడానికి ప్రయత్నించావా


ప్రజా సంక్షేమం..ఆశయ సాధన  ఈ రెండు లక్ష్యాల ప్రయాణంలో ఆంక్షలు లేని రాజకీయ జీవితం.. ఈ లైన్‌ ఎంత ఉదాత్తంగా ఉంది ? 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అభ్యర్ధిగా పోటీ పడిన వంగవీటి రాధా ఆ పార్టీ నుంచి బైటికి రావడం తప్పేంకాదు..ఎవరి పొలిటికల్ గేమ్ వారు ఆడతారు..పైగా వంగవీటి రాధాకృష్ణ  పైన చెప్పిన ప్రజాసంక్షేమం కోసం ఉద్యమిస్తానంటున్నారు..ఆ మాటకి ఇక తిరుగులేదు. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి రాజకీయ జీవితం చేయను అని చెప్తున్న రాధాకృష్ణకి జనసేన టిడిపి ఆహ్వానం పలుకుతున్నాయంటున్నారు

నిజంగా టిడిపిలోకి వెళ్తే..ఆయనకి మంచి రాజకీయ( రాజకీయం వరకే) భవిష్యత్తు ఉండవచ్చు..తర్వాత మంత్రి పదవీ దక్కవచ్చు..కానీ ఇన్నాళ్లూ ఎవర్నైతే తన తండ్రి హత్యకు కారకులంటూ ఆరోపిస్తూ..రాజకీయ జీవితాన్ని అటు రత్నకుమారి కాని..ఇటు రాధాకృష్ణ గానీ గడుపుతూ వచ్చారో..ఆ ఆరోపణలు నిజం కాదని అంగీకరించినట్లే..దానికంటే జనసేన అయితే తన వర్గం వారు ఎక్కువ ఉన్న పార్టీ కాబట్టి..కాస్త స్వేఛ్చ లభించవచ్చు..కానీ అంతమాత్రాన ప్రతి పార్టీలో ఆయన కోరుకున్న సీటే ఇస్తారని..చెప్పినట్లే సాగుతుందనుకోవడం భ్రమ..చివరికి కేఏ పాల్ పార్టీలో చేరినా...పార్టీ అధ్యక్షుడో..ఇంకెవరో భవిష్యత్తుని నిర్దేశిస్తారు..ఇంకా అంతకంటే ఇండిపెండెంట్ గా గెలిస్తే..కింగ్‌లా బతకవచ్చు..

మరి రాధాకృష్ణ ఇన్నాళ్లూ సాగించిన ఉద్యమం గురించి కూడా మాట్లాడుకోవాలి..వంగవీటి రంగా గురించి బతికుండగా మాకు తెలీదు..ఆయన హత్య చేయబడిన తర్వాతే ఆయన గురించి తెలుసుకున్నాం..ప్రతి ఊరిలో ఆయన విగ్రహం పెట్టుకుని కాపు కులస్తులు ఆయన్నో రాష్ట్రస్థాయి లీడర్‌గా చేసుకున్నారు.. తర్వాత తర్వాత అది తగ్గిపోయింది.. మరి ఏ నాడైనా రాధాకృష్ణ ఆ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించారా.. రంగా హత్య జరిగి 30 ఏళ్లు అవుతుంది..మరి ఇప్పటి యువతకి ఆయన గురించి తెలియాలంటే ఉన్న మార్గం వారసులైనా చూపాలిగా..ఆ ప్రయత్నం కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీలో ఉండగా ఏమైనా చేశారు..కనీసం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు..కడప..అనంతపురం..జిల్లాలకు వెళ్తే వంగవీటి రాధాకృష్ణని గుర్తుపట్టేవాళ్లైనా ఉన్నారా..ఓ రాష్ట్రస్థాయి నేతగా ఎదిగే అవకాశాన్ని వదిలేశారు..కోల్పోయారు.. తర్వాత కృష్ణా జిల్లాలోనైనా దాన్ని నిలుపుకున్నారా..ఇప్పుడు కేవలం ఓ సీటు కోసం పార్టీ వదిలేశాడనే స్థాయికి చేరారు.. ఇదీ వంగవీటి ప్రస్తుత పరిస్థితి. కేవలం కులం ఓట్లే చాలు..కుల సంఘ నాయకుడిగా ఉంటామంటే కుదరదు..

ఓవైపు టిడిపి నేతలు ఆయన వస్తే వెల్‌కమ్ అంటున్నారు..బుద్దా వెంకన్న ఎటూ ఎమ్మెల్సీనే కాబట్టి..తన సీటుకి ఎసరు లేదు కాబట్టి కామెంట్లు చేయడం లేదు..కానీ అప్పుడే బోండా ఉమా గెలకడం మొదలెట్టేశాడు..విజయవాడలో సీట్లు ఖాళీగా లేవు..ఎవరొచ్చినా క్రమశిక్షణగా ఉండాలి.. ఎమ్మెల్సీ అయితే ఫర్వాలేదు అంటూ..భవిష్యత్తులో నా జోలికి వస్తే బావుండదన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తున్నాడు..ఇదే టిడిపిలోకి వెళ్తే జరిగేది..మరిక్కడ ఆంక్షలు ఉన్నట్లా లేన్నట్లా..దయతో ఇచ్చే ఎమ్మెల్సీ  తీసుకోవడానికి సిధ్దమేనా

జనసేనలోకి వెళ్తే..ఖచ్చితంగా సీటు ఇస్తారు ఇవ్వడమే కాదు..ఇంకో నాలుగు సీట్లలో తాను చెప్పినవారికి కూడా ఇస్తారు..ఐతే అసలు ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తదో వారికే తెలీదు..అసలు పోటీ చేస్తుందో..రాజకీయనిర్మాణం జరగలేదు..నా ప్రయాణం పాతికేళ్ల లక్ష్యం కోసం అంటూ పోటీనే పెట్టరో..తెలీదు కదా..ఇలాంటి అనివార్యతలు, అనుమానాల మధ్య 2019 నుంచి 2024 వరకూ వంగవీటి రాధాకృష్ణ ఎలాంటి ప్రయాణం చేస్తాడో చూద్దాం


Comments

  1. "2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా"

    2014లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ వైకాపా వంగవీటి రాధాను గట్టి మెజారిటీతో (>15,000) ఓడించారు.

    ReplyDelete

Post a Comment