ట్రబుల్ షూటరా...మేకరా..ప్రియాంక ఆగమనం


ఎవరు కొడితే మైండ్ బ్లాకై..దిమ్మ తిరుగుతుందో..ఆమే ప్రియాంక..ఇదీ కాంగ్రెస్‌ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న నమ్మకం..పార్టీని నడిపించేందుకు ప్రియాంక గాంధీ రావాలని చాలామంది నేతలు బహిరంగంగా కోరేవారు..ఇలా పదేళ్ల నుంచి అడిగి అడిగీ విసిగిపోయారు కూడా..ఈ కాలంలోనే కాంగ్రెస్ ఓటమి పాలవడం కూడా చూశారు. ఐతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ కాస్త పుంజుకున్నట్లు కన్పిస్తోంది..ఇలాంటి సమయంలో ప్రియాంక ఎంట్రీ ఏ పొలిటికల్ అనలిస్ట్ ఊహించలేదు..కానీ రాహుల్ గాంధీ కోరారు..ప్రియాంక వచ్చేసింది.ఉత్తరప్రదేశ్ తూర్పు ఇన్ ‌ఛార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమిస్తూ..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పండగ చేసుకున్నారు. సంబరాలకు దిగారు. వాస్తవానికి ప్రియాంకగాంధీ ప్రత్యక్షంగా ఎన్నికలలో లేకపోయినా..గత పదేళ్లలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగానే పాల్గొన్నారు..2014 ఎన్నికల సమయంలోనైతే పార్టీ అభ్యర్ధుల ఎన్నిక,  ప్రచారంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గెలుపు ఓటముల సంగతి పక్కన బెడితే ప్రియాంక చరిష్మా కాంగ్రెస్ ప్రభని ఉత్తరప్రదేశ్‌లో తిరిగి వెలుగొందేలా చేస్తుందని అంటున్నారు. రాహుల్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ..సమర్ధవంతమైన యువనేతగా తన చెల్లెలిని వర్ణించారు ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తే..రాహుల్ గాంధీ సొంతంగా తన టీమ్‌కే యూపీని పర్యవేక్షించే బాధ్యత అప్పగించడంలో మర్మం అర్ధమవుతోంది. మహాకూటమిలో భాగం కాకుండా..బిఎస్పీ, ఎస్పీ పొత్తు కుదుర్చుకున్నాయ్. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి స్టార్ క్యాంపైనర్‌తో పాటు..స్థానికంగా బలంగా ఉన్న నేతల దన్ను కావాలి..అందుకే తమ కుటుంబానికి కోటలా ఉన్న ప్రాంతంలో తమకంటే పెద్ద నేతలు లేరని రాహుల్ గుర్తించాడుకోవాలి. అనుకున్నదే తడవుగా ప్రియాంకగాంధీని దింపేశారు. దీంతో అటు మాయావతి..అఖిలేష్‌, యోగి ఆదిత్యనాధ్‌ కి ధీటుగా కాంగ్రెస్ నిలబడినట్లైంది..ప్రియాంక, రాహుల్ పార్టీని ఓ కాపు కాసేందుకు ఈ పరిణామం అవసరమనేది రాహుల్ ప్లాన్ అనుకోవచ్చు....ఆరోగ్య సమస్యలతో సోనియాగాంధీ ప్రచార బాధ్యతలకు దూరంగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే..అఁదుకే ఇప్పుడు ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి సొంత స్థలం అనవచ్చు..ఇప్పుడంటే యూపీలో దారుణంగా దెబ్బతిన్నదేమో కానీ..ఒకప్పుడు నెహ్రూ-గాంధీ ఫ్యామిలీకి ఇదో కోట లాంటి ప్రాంతం. ఐతే ఈ కోటకి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో బీటలు వారాయ్. ఒకప్పుడు 85 ఎంపీ సీట్లున్న యూపీలో 72 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రెండు సీట్లకి పరిమితమైంది..ఇందిరగాంధీ హత్యకు గురైన తర్వాత జరిగిన ఎన్నికలలో 83 సీట్లలో గెలుపొందడం గమనార్హం. ఆస్థాయిలో ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానులు ఇక్కడ ఉన్నారు.. ఇప్పటికీ ఇక్కడ నెహ్రూ, ఇందిరాగాంధీని అభిమానించే కుటుంబాలు ఉన్నాయ్. ఐతే వారంతా ఇప్పుడు వృధ్దులైపోయారు..వారికి ఇప్పుడా గాంధీ నెహ్రూ కుటుంబీకులను గుర్తు చేసే నేతలు కావాలి..రాజీవ్ గాంధీ హయాం వరకూ కూడా కాంగ్రెస్ మంచి సంఖ్యలోనే సీట్లు దక్కించుకునేది..ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీ మరింత కుదేలైపోయింది..ఆ తర్వాత గాంధీ కుటుంబీకులు పార్టీకి దూరంగా ఉండటం కూడా ఈ పరిణామానికి కారణంగా చెప్పుకోవాలి..తిరిగి సోనియా పగ్గాలు చేపట్టిన తర్వాతే కాంగ్రెస్ ఉనికి నామమాత్రమైంది..పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నట్లుగా..కాంగ్రెస్ ఇప్పుడదే పని చేస్తోంది..
కాంగ్రెస్ కూటమితో కలవబోమని..రెండు సీట్లు మాత్రం వదిలిపెట్టామన్న..ఎస్పీ, బిఎస్పీ నేతల ఎగతాళికి సరైన సమాధానం చెప్పాలన్న వ్యూహంతోనే ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. అమెథీ, రాయ్‌బరేలీనే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్ అంతా ఒంటరిగా పోటీ చేసే సత్తా చూపించాలని రాహుల్ పట్టుదలగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేసింది. నానమ్మ పోలికలున్న ప్రియాంక గాంధీని మొత్తం సగం రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌ని చేయడం ద్వారా ఎక్కువ సీట్లలో గెలుపొందే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు
ఐతే బిజెపి మాత్రం ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తూనే ఆక్షేపించింది. కేంద్రమంత్రుల నుంచి అధికార ప్రతినిధుల వరకూ కాంగ్రెస్ కుటుంబరాజకీయాలకు ప్రియాంక ఆగమనమే ఓ ఉదాహరణ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్  పార్టీకి రాజకీయాలంటే ఓ కుటుంబమేనంటూ ఐనా ఆమె పాత్ర ఒక్క ఉత్తరప్రదేశ్‌కే పరిమితం చేయడం ఏమిటంటూ చమత్కరించారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్..

అసలు కాంగ్రెస్‌లో రాహుల్ కంటే సోనియా రాక తర్వాత ప్రియాంకగాంధీనే వస్తారని ..రావాలని కోరుకున్నారు. ఎందుకంటే,  ఈరోజుకీ దేశవ్యాప్తంగా  ఇందిరాగాంధీ అభిమాన కుటుంబాలు ఉన్నాయి. ఇందిరే ఇండియా..ఇండియానే ఇందిర అనుకున్న రోజులు ఉన్నాయ్. అలాంటివారికి ప్రియాంక గాంధీని చూస్తే
ఇందిరనే చూసినట్లుందనేవారుంటారు. ముఖ్యంగా ప్రొఫైల్ లుక్‌లో..హెయిర్ స్టైల్..ఇందిరాగాంధీతో పోల్చి చూసేవారుంటారు. ఇప్పటి కొత్త ఓటర్లు..35 ఏళ్లు వయసు వారు కాకుండా..యాభై, అరవైఏళ్లున్న ప్రతి వ్యక్తి..ఇందిరాగాంధీకి వారసురాలంటే ప్రియాంక గాంధీగానే చెప్తుంటారు. పైకి ఎన్ని చెప్పినా..రాజకీయపార్టీల్లో వారసత్వం ప్రవహిస్తూనే ఉంటుంది. అలా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌లో ఇదీ మరీ ఎక్కువ..నెహ్రూ.. ఇందిరాగాంధీ..రాజీవ్ గాంధీ..తర్వాత చిన్న బ్రేక్..తప్పితే తిరిగి సోనియా చేతిలోనే కాంగ్రెస్ పగ్గాలు వచ్చి చేరాయ్. ఆ తర్వాత రాహుల్ గాంధీ..ఇలా ఎంత కాదనుకున్నా..వారసత్వరాజకీయాలకు ఆ పార్టీ లీడర్లు అలవాటు పడిపోయారు..జనాలకూ అలవాటు పడ్డారని ప్రచారం చేస్తుంటారు..ఇలాంటి సందర్భంలో ప్రియాంక గాంధీకి కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర దక్కడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు..అసలు ఇన్నాళ్లు ఆమె పార్టీ పదవులకు..ఎలక్షన్స్‌కి దూరంగా ఉఁడటమే అసలు ఆశ్చర్యం. పైగా ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రంలో నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా బ్రహ్మరధమే పట్టారు. పలు సందర్భాల్లో ఇది రుజువైంది కూడా..రాయ్‌బరేలీలోని కొంతమంది జనమైతే..మరీ మూఢంగా..కాంగ్రెస్ పార్టీని కాపాడే శక్తి ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రియాంక గాంధీ మాత్రమే అని అంటుంటారు.
ఇక ప్రియాంక గాంధీ అసెట్ విషయానికి వస్తే..హిందీలో ఏకధాటిగా మాట్లాడటం..ఓటర్లలో కలిసిపోవడంగా చెప్తుంటారు. ఓ పెద్ద కుటుంబానికి వారసురాలిగా కాకుండా.. మన మధ్య తిరిగే సామాన్యమైన వ్యక్తిగా కన్పిస్తారని అంటుంటారు. ఓ ప్రధానమంత్రికి మనవరాలు..మరో ప్రధానమంత్రికి కూతురు  పొలాల్లో కూర్చుండిపోయి మాట్లాడటం ఎప్పుడైనా చూసి ఉఁటారా... రాజకీయాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద విజయాలకు
దారి తీస్తాయి. అందుకే ప్రియాంకగాంధీ ఎంట్రీ ఆసక్తి కలిగిస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కి ఇటీవలికాలంలో ఉత్సాహం తెప్పించగా..ప్రియాంక దాన్ని విజయతీరాలకు చేర్చుతుందనే అఁచనాలో కాంగ్రెస్ ఉంది.

Comments

  1. యూపీలో కాంగ్రెస్ బలం 6-7% మాత్రమే ఉంటుంది. బీజేపీ సపా బసపాల తరువాత నాలుగో స్థానం. ప్రియాంకా గాంధీని యూపీకి పరిమితం చేసే బదులు మొన్నీమద్యే గెలిచిన ఎంపీ రాజస్థాన్ రాష్ట్రాలలో పార్టీని పటిష్టం చేసేందుకు వాడుకుంటే రాహుల్ గుజరాత్, కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణా & మహారాష్ట్రలలో దృష్టి సారించడం మంచిది.

    ReplyDelete

Post a Comment