అచ్చెన్నా ..నువ్వలా తల రైలుకింద పెట్టొద్దు.. 2019 తర్వాత కూడా అసెంబ్లీలో ఉండాలి


జగన్ మోహన్ రెడ్డి బిసి గర్జన పేరుతో సభ పెట్టడం..దానికి భారీగా జనం హాజరు కావడం టిడిపి నేతలకు బాగా అక్కసు కలిగించినట్లు వారి మాటల్లోనే అర్ధమవుతోంది..ఎందుకంటే..బిసి గర్జన సభకి తెలంగాణ నుంచి జనం తరలించారంటూ మంత్రి అచ్చెనాయుడు ఎద్దేవా చేయడం దాన్నే తెలుపుతోంది.. ఓ వేళ అది నిజమే అయితే అది జగన్ కే నష్టం..ఎందుకంటే..పక్కరాష్ట్రం జనం ఏపీలో ఓట్లేయలేరు కదా..కానీ ఈ సందర్భంగా అచ్చెనాయుడు పాపం
మరీ ఓవరాక్షన్ చేసేసి తెలంగాణలో బిసిలను కేసీఆర్ తొక్కేస్తున్నాడని..తానే ఆ ప్లేస్‌లో ఉంటే..రైలుకింద తలపెట్టి చచ్చేవాడ్నంటూ కామెంట్ చేయడమే.

తెలంగాణలో బిసిలే ప్రబలశక్తులు..వారికి కేసీఆర్ ఆన్యాయం చేశారో న్యాయమే చేశారో తెలీదు కానీ..ఎక్కువమంది ఎమ్మెల్యేలు వాళ్లే ఉన్నారు..ఆ తర్వాత స్కీములు కూడా వారి కులవృత్తులకు సంబంధించినవి బ్రహ్మాండంగా అమలు చేస్తున్నట్లు కన్పిస్తుంది. గొర్రెలు బర్రెలు పంచడమేనా అభివృధ్ది  అంటూ కాంగ్రెస్, టిడిపి ఎగతాళి చేసినా
ఆ స్కీములే ఇక్కడి జనానికి నచ్చాయ్..వాటితో ఎంత ఆదాయం ఉంటుందో..ఆ గొల్లలు..యాదవులను అడిగితే చెప్తారు..ఏ గొర్రె చనిపోయినా..దానికి ఇన్సూరెన్స్ స్కీములు కూడా ఉన్నాయ్..బాగా చదువుకున్న వాళ్లకి వీటితో పని లేదేమో కానీ..తెలంగాణ పల్లెల్లో వీటిపై వచ్చే ఆదాయం గురించి తెలిస్తే.ఇంకోసారి అలా మాట్లాడరు..అలాంటి స్కీములు చేస్తన్న రాష్ట్రంలోని లీడర్ తలసాని..ఆయన ఎక్కడ ఏపీలో గొల్లలు యాదవులను సమీకరించి వైఎస్సార్ కాంగ్రెస్ కి ఓట్లేసేలా చేస్తారేమో అనేది టిడిపి భయం..అది ఏ పార్టీకైనా ఉంటుంది..కానీ ఆ వర్గాలు ఇప్పటికే ఎటు ఓటు వేయాలో డిసైడ్ చేసుకుని ఉంటాయి...దాని కోసం పోయి..రైలు కింద తలపెట్టుకుంటా అంటూ నోరు జారడం కరెక్ట్ కాదు..
ఆంధ్రప్రదేశ్ లో బిసిల్లోని 31 కులాలను ఓబీసీల్లో చేర్చకపోవడంపై నోరెత్తని మంత్రులు ఇలా ఓ బిసి గర్జన పెట్టుకునేసరికి..ఇప్పుడే జగన్ కి బిసీలు గుర్తొచ్చారా అనడం వ్యూహాత్మక తప్పిదం. ఎెందుకంటే జగనేమైనా ముఖ్యమంత్రా..ఇప్పుడు గుర్తొచ్చారా అనడానికి పైగా... ఐదేళ్లలో బిసిలకు 42వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తూ..మరో తప్ప చేశారు..ఆ లెక్కన ఏడాదికి చేసిందెంతో ఓపెన్ గానే ఒప్పుకున్నట్లైంది..ఏడాదికి 8వేల కోట్లు అని చెప్తున్నా..అందులో ఎంత నిజంగా అయిందో బ్రేకప్ లేదు..పైగా ప్రతి ఏటా లక్షా 70వేలకోట్ల బడ్జెట్ లో 8 వేలకోట్ల రూపాయల పైచిలుకే ఇలా ఖర్చు పెట్టామని చెప్పడం..ప్రత్యర్ధులకు అస్త్రం ఇచ్చినట్లే..ఈ రెండు లెక్కలు చాలవా అచ్చెనాయుడు తొందరపడ్డాడని చెప్పడానికి..!


Comments

  1. Our journey from tanuku to Hyderabad got screwed up because of this bc garjana meeting. I am still in my vehicle along with my old parents and small kids. Nobody cares the public. Leaders(?) in Andhra should learn from kcr

    ReplyDelete
  2. "2019 తర్వాత కూడా అసెంబ్లీలో ఉండాలి"

    అచ్చన్నాయుడు టెక్కలిలో ఓడడం ఖాయం కనుక వచ్చే అసెంబ్లీలో ఆయన ఉండడు. లోకసభ బరిలో అబ్బాయి (హిందీ పండితుడు) పరిస్థితి కూడా బాలేదు.

    ReplyDelete
  3. ఆజ్ కా తాజా కామెడీ:

    పాక్ ప్రధానిని భయపెడుతున్న బాలయ్య ఫ్యాన్ !

    http://www.andhrajyothy.com/artical?SID=715840

    ReplyDelete

Post a Comment