బాలకృష్ణ సినిమాకీ కల్యాణి మాలిక్‌కి డబ్బులు ఎగ్గొట్టారు


కల్యాణి మాలిక్ చాలా సెలక్టివ్ దర్శకుల కళ్లలో మాత్రమే పడిన ఓ మంచి సంగీత దర్శకుడు..ఆయన వ్యక్తిగతాన్ని ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూ చేయగా మనలో చాలామందికి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో ఆయన సినిమాలకు డబ్బు ఎగ్గొట్టిన నిర్మాతలు, ఛాన్సులు ఇచ్చి లాక్కున్న దర్శకులు, సిినిమా బావుండాలనే తపనతో మార్పులు చెప్తే తప్పించిన దర్శకులు, తన నోటి జారుడుతనంతో పోగొట్టుకున్న ఛాన్సులు..రాజమౌళిపై అక్కసుని కళ్యాణి మాలిక్ దగ్గర తీర్చుకున్న దర్శకుల గురించి చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఎంతగా ప్రేమించారో చెప్పుకున్నా..అవి మనకి బోరే..కానీ సినిమాలలోని విచిత్రాలు మాత్రం అందరికీ ఆసక్తి గొలుపుతాయి..వాటిలో కొన్ని చూద్దాం

మొదటిది రాజమౌళి గురించి ఓ పెద్ద దర్శకుడు చీప్ గా మాట్లాడేవాడట..అలా చేసినవాళ్లలో పరుచూరి మురళి, విఎన్ఆదిత్య ఈ ఇద్దరితోనే కల్యాణి మాళిక్ చేసారు..వాళ్లే కాస్తో కూస్తో పేరున్న డైరక్టర్లు..ఎటూ ఆయన గురించి ఏమన్నా కూడా సదరు దర్శకుడి దగ్గర  మ్యూజిక్ డైరక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఏమీ అనలేడనే అడ్వాంటేజ్‌తో తక్కువ చేసి మాట్లాడేవాడట..అలా చేస్తున్నప్పుడు అతనిది అది రెండోది అని చెప్పాడు..ఆ ఈక్వేషన్ ప్రకారం..వీళ్లిద్దరే తేలతారు..ఆ తర్వాత బాలయ్యకి చేసిన అధినాయకుడు మూవీకి కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వకపోవడంతో..కల్యాణి దగ్గర చేసిన మ్యూజిషీయన్స్ కల్యాణి మాలిక్ నే తిట్టేశారట. దీంతోనే పెద్ద ఛాన్సులు రావడమే కాదు..అదే స్థాయిలో పూర్తిగా డబ్బులు కూడా ఇవ్వాలని రూల్ లేదని మరోసారి ప్రూవైంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..అమ్మమ్మగారిల్లు అనే సినిమా బాగా రాలేదనే అభిప్రాయం వెల్లిబుచ్చినందుకు సినిమా నుంచి తప్పించేసిన సంగతి చెప్పారాయన. అంటే  అప్రియమైన సత్యం చెప్పడం మంచిది కాదనే విషయానికి తార్కాణం మరోసారి చూపించారు కల్యాణి మాలిక్..కల్యాణి మాలిక్ చెప్పిన విషయాలను బేరీజు వేసుకున్నప్పుడు నిజజీవితంలోనూ ప్రతి చోటా అన్వయించుకోవచ్చనిపించింది. కాకపోతే ఆయన ఓ ప్రముఖుడు..మనం కాదు అంతే..

Comments