మోడిఫైడ్ రైతుబంధు స్కీమ్‌లో ఈ మతలబులు చూడుడిహు...ఆరువేలట ఆరువేలు అని ఈసడిస్తున్నారు..వాళ్లకేం తెలుసు 6వేల రూపాయల విలువ అంటూ..మోడీ గారు సెంటిమెంట్ రంగరించారు..జనం కూడా పడిపోతున్నారనే భ్రమలోనే ఉన్నారు..ఒక్క తెలంగాణలోని లెక్కే ఇంతకుముందు చూశాం కదా..ఇప్పుడు దేశం మొత్తం స్కీమ్ నుంచి సున్నా చుట్టేందుకు ఏం ప్లానేశారో చూడండి

ఆ 6వేలు అందుకోవడానికి కూడా అడ్డంకులు ఎలాగంటే..మీ కుటుంబంలో పన్ను కడుతున్నవారు..అలానే నెలమొత్తం మీద పదివేల రూపాయలు పెన్షన్ కనుక తీసుకునేట్లైతే మీరు అనర్హులు..అంటే మీకు ఆదాయం వస్తూ..పన్ను కడుతూ..ఓ ఎకరం పొలం ఉందనుకోండి..మీకు ఎలాంటి ధనం ఇవ్వబోరు. ఇక డాక్టర్లు..ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్  అక్కౌంట్లను ఎటూ డిలీట్ చేసేసారు. అయితే ఇందులో ఏ కుర్ర ఇంజనీరో అప్పుడే ఓ పదివేల ఉద్యోగానికి చేరిపోయినా..అతని తల్లిదండ్రుల పొలానికి స్కీమ్ డబ్బులు రావన్నమాట.

అంటే ఓరకంగా బతకలేకపోతున్నా..ఏదోలా నెట్టుకొట్టుకొచ్చే చిన్నకారు రైతులు ఉఁటారు చూడండి..వాళ్లకన్నమాట ఈ ఆరువేల రూపాయలు..అంటే స్కీమ్ కోసం అర్జంట్ గా దరిద్రులు అయిపోవాలన్నమాట..నోట్లోకి నాలుగువేళ్లూ పోకూడదు..మరి ఏ లెక్కన ఈ దేశంలో 12కోట్ల మంది రైతులకు ఈ సన్మానం అందజేస్తారో మోడీ ప్రభువులకే తెలియాలి..ఓ వేళ అదే నిజమైతే..ఈ దేశంలో 12 కోట్ల మంది నిష్టదరిద్రం అనుభవిస్తున్నవారు ఉఁటే..ఈ మాత్రం నేల కూడా  లేనివాళ్లు ఉండేదెంతమంది.. ఆ లెక్కా తీయండి సార్..విని తరిస్తాం..వాళ్లకీ ఏడాదికి ఏ మూడువేల రూపాయల పథకమో ప్రకటించండి..

Comments