ఢిల్లీ పీఠానికి ఈ ఆరు రాష్ట్రాలే కీలకం


వచ్చే ఐదేళ్లకి దేశాన్ని పాలించే పార్టీ ఏది బిజెపినా..కాంగ్రెస్సా...లేక ఇంకేదైనా పార్టీనా..ఈ ప్రశ్న కాసేపు పక్కనబెడితే..అసలు ఇప్పుడు చెప్పబోయే ఆరు రాష్ట్రాలలో గెలుపే ఆ పార్టీని డిసైడ్ చేస్తుందంటే ఆశ్చర్యపోవద్దు. ఈ ఆరు రాష్ట్రాలలోని గెలుపోటములే..బిజెపి స్థానాన్ని నిర్ణయించబోతున్నాయ్


ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా బిజెపికి మాత్రం ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీనే..ఆయన్ని కాదని మరో కాండిడేట్‌ని బిజెపి ప్రకటించలేదు..2014లో పీఠాన్ని అనూహ్యమైన ఆధిక్యతతో గెలిపించిన మోడీ..తిరిగి ఆ మ్యాజిక్ చేయగలరా...  చేస్తారు..అదెలాగంటే..ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఓ రకంగా ఇవి ఒకప్పుడు బిమారు రాష్ట్రాలనేవారు..ఇప్పుడా పరిస్తితి లేదు..ఈ ఆరు రాష్ట్రాలలో గెలవగలిగితే..బిజెపి తిరిగి పీఠం దక్కించుకోవడం ఖాయమంటున్నారు..ఇక్కడ ఇంకో విషయం గమనించాలి..ఉత్తరాఖండ్, జార్ఘండ్..చత్తీస్ ఘడ్‌ని కూడా కలిపి విశ్లేషకులు గెలవాలని చెప్తున్నారుకానీ అంత సీన్ ఉందా....ఎందుకంటే..వీటిలో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఆల్రెడీ బిజెపి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది..గుజరాత్‌లో బొటాబొటీగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.. 
ఈ తొమ్మిది రాష్ట్రాల సంగతే  ఎందుకు చెప్తున్నారంటే..మొత్తం ఎన్నికలు జరిగే 542 సీట్లలో 278 ఎంపి సీట్లు వీటిలోనే ఉన్నాయ్.. 2014 ఎన్నికలలో బిజెపి ఇక్కడ్నుంచే ఎక్కువ సీట్లు దక్కించుకుంది. ఇక్కడే పార్టీకి బలమైన ఓటింగ్ జరిగింది..మరిప్పుడు అలానే జరుగుతుందా...మోడీ మ్యాజిక్ తిరిగి పని చేస్తే మాత్రం బిజెపికి 2019 లోక్ సభ ఎన్నికలు కేక్ వాక్ అనే చెప్పాలి. ఐతే పరిశీలకులు మాత్రం అదంత సులభం కాదంటున్నారు..ఎందుకంటే 2014 వేరు..2019 వేరు..అప్పటి మిత్రులు ఇప్పుడు ఎన్డీఏలో లేరు. ఉత్తరప్రదేశ్ విషయమే చూస్తే బువా, భటీజా అంటే మాయావతి అఖిలేష్ యాదవ్‌ కలిసి పోటీ చేయబోతున్నారు. ఇది 80సీట్లున్న యూపిలో బిజెపి గెలిచే సీట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది..ఇప్పటికే విడుదలైన సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టంగా కన్పించింది. దీనికి తోడూ ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ గణనీయంగా ఓ పది సీట్లైనా గెలుచుకుంటుందనే అంచనాలు ఉన్నాయ్. అంటే గతంలో ఇక్కడ వచ్చిన సీట్లలో సగానికి కమలనాధులు నీళ్లొదులుకోవాల్సిందే
అలానే మధ్యప్రదేశ్‌లో 2014లో 26 సీట్లు గెలిచింది బిజెపి..కానీ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. తాజా అంచనాల ప్రకారం కనీసం 13 సీట్లు బిజెపి కోల్పోతుంది..రాజస్తాన్‌లో 24 ఎంపి సీట్లని 2014లో దక్కించుకోగా..ఇప్పుడు ఆ సంఖ్య ఏ పన్నెండుకో  పరిమితం అని సర్వేలు చెప్తున్నాయ్. చత్తీస్‌గఢ్‌లో 10 ఎంపి సీట్లు గెలిచిన బిజెపి వచ్చే ఎన్నికలలో మూడు గెలుచుకుంటే గొప్పే అని అంటున్నారు. బిహార్‌లో 22 సీట్లను 2014లో గెలవగా..ఇప్పుడు పోటీ చేసే సీట్లే అన్ని లేవు. ఇలా ప్రతిచోటా ప్రతికూల వాతావరణం కన్పిస్తున్న తరుణంలో బిజెపి మోడీ మ్యాజిక్, సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య వంటి అంశాలపై మాత్రమే ఆధారపడి ప్రచారం సాగిస్తోంది
విలియం లాండే అని ఓ అమెరికన్ నవలా రచయిత టెన్షన్ వాతావరణంలో, హేమాహేమీల మధ్య ఉండే పోటీతోనే రసవత్తరమైన కథలు పుడతాయి అంటారు..ఇప్పుడు భారత్‌లోనూ అలాంటి వాతావరణమే కన్పిస్తోంది..మే 23దాకా అలాంటి ఎన్నో కథలు మనం చూస్తుండొచ్చు

Comments

  1. ఎన్నికల తేదీలు ప్రకటించగానే స్టాక్ మార్కెట్ ఊపు అందుకుంది. ఫలితాల గురించి వాణిజ్య రంగాల అంచనా ఏమిటో ఈ పోకడలు తేటతెల్లం చేస్తున్నాయి.

    ReplyDelete
  2. వార్ ఒన్ సైడ్ అయితే కధలేమి పుడతాయి ? సీక్వెల్ కూడా అద్భుతంగా ఉండడానికి ఇదేమైనా బాహుబలి సినిమానా ? ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ఎన్నిక మాత్రమే ఆసక్తికరంగా ఉంది.

    ReplyDelete

Post a Comment