నరసరావుపేటలో పోటీ చేయ్ లోకేష్..కోడెల, రాయపాటి తిక్క కుదురుతుంది


పిల్లి పోరు..పిల్లి పోరు పిట్ట తీర్చిందన్నట్లుగా..గుంటూరు జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లిలో తన కుటుంబానికే టిక్కెట్లు కావాలని కోడెల..కాదు మాకు కావాలని రాయపాటి సాంబశివరావు పట్టుబట్టడంతో..కుటుంబరాజకీయాలు  ఎంతగా పాతుకుపోయాయో అర్ధం అవుతోంది..ఇలాంటి సమయాల్లోనే యువత ముందుకు రావాలనే టిడిపి స్లోగన్( ఇంకే పార్టీ అయినా కూడా) వారి ఎమ్మెల్యేలు, ఎంపిల పుత్రరత్నాలకు, కోడళ్లకి..అల్లుళ్లకి మాత్రమే పరిమితమేమో అన్పించకమానదు
మరోవైపు అతి పెద్ద  కుటుంబవారసుడు నారా లోకేసుడు ఉండనే ఉన్నాడు..అంతకుముందు పాపం ఎమ్మెల్సీగా చేసి మరీ మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబుకి ఈసారి మాత్రం పాపం ఎమ్మెల్యేగా గెలిపించి..అమ్మయ్య అనుకుందామనే తాపత్రయం కన్పిస్తోంది..అందుకే మంగళగిరిలో టిక్కెట్ ఇచ్చేశామని ప్రకటించేశాడు..దీంతో ఏ గంటా కూడా త్యాగం చేయాల్సిన పని లేకుండా పోయింది

కానీ ఇక్కడ గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాత్రం ఈ సీట్ల పంచాయితీ ఎడతెగడం లేదు..పైగా కోడెల నేనే పోటీ చేస్తా..నా కొడుకు రాజకీయాల్లోకి రాడు అని చెప్పి..మళ్లీ ఇప్పుడు ఇలా మాట మార్చడం ఆయన నైజానికే నిదర్శనంగా చెప్పాలి. ఇక రాయపాటి..ఈయన ఉండేది గుంటూరులో..కానీ నరసరావుపేటలో పోటీ చేస్తా అని చెప్పడం ఏంటి..కోడెల సత్తెనపల్లికి వెళ్లడం వెనుక ఓటమి భయం ఉంది..ఇప్పుడు మళ్లీ పేటలో సత్తెనపల్లి లో రెండింట్లో అనడం హాస్యాస్పదమే..ఇందుకే చంద్రబాబుకి పంబరేగి..బాబూ నువ్వే పేట ఎంపిగా పోటీ చేయమన్నాడు..కానీ అది కుదరలేదు..అసలు చంద్రబాబుకి ఎందుకు ఆలోచన రాలేదో కానీ..ఏకంగా లోకేష్ ని నరసరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయించాల్సింది..అందరికీ సరిపోయేది..అసలు కోడెల ఉన్న పరిస్తితికి అటు పేట..ఇటు సత్తెనపల్లి రెండింట్లోనూ ఓటమి తప్పదంటున్నారు..దాని బదులు ఇలా కొడుకుని నిలబడితే బ్రహ్మాండంగా ఉండేదిగా..
కానీ కొడుక్కి సేఫ్ ప్లేస్ చూసుకుని కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన మంగళగిరిని ఎంచుకున్నాడు..కానీ ఇక్కడ టిడిపి ఎప్పుడూ గెలవలేదు ఆ విషయం గమనించలేదు..ఇప్పుడక్కడ జనసేన కూడా పోటీ పెట్టిందా...మనోడు దెబ్బైపోతాడేమో  ట్రయాంగిల్ ఫైట్‌లో 

Comments

  1. శాసనసభ బరిలో దిగుతున్న మంత్రి నారాయణ & రామసుబ్బారెడ్డి ఇద్దరూ శాసనమండలి పదవికి రాజీనామా చేసారు, అదే కోవకు చెందిన లోకేషం బాబు ఇంకా ఆ ధైర్యం చేయలేదు. దీన్నిబట్టే ఇతగాడి నమ్మకం ఎంతుందో తెలుస్తుంది!

    ReplyDelete
    Replies
    1. చినబాబుకు సాయం అందిద్దామని పవనాలు సార్ మంగళగిరి సీటు కామ్రేడులకు ఇచ్చారు!

      Delete

Post a Comment