ద్రవిడవార్ లో లీడర్లే లేరు..అమ్మా..కలైంజ్ఞర్ లేని తొలి ఎన్నికలు..


అమ్మ లేదు కాబట్టి..ఇక మాకు అయ్య మోడీనే అంటూ అన్నాడిఎంకే నేతలు ఈ మధ్యనే ప్రకటించడం గమనించాలి. అసలు జయలలిత-కరుణానిధి మధ్య వైరం 30 ఏళ్లు కొనసాగింది. రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఇద్దరూ కన్నుమూయడంతోనే ఇక పార్టీల మధ్య వైరం కూడా పలచబడిపోయిందనే చెప్పాలి. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత స్టార్ క్యాంపైనర్లు లేకుండా..డిఎంకే, అన్నాడిఎంకేలు పోటీ చేయబోతున్నాయ్. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హసన్ కొత్తగా ఎంట్రీ ఇస్తే ఇవ్వొచ్చు కానీ..జయలలిత వర్సెస్ కరుణానిధి పోరు మాత్రం దేనితోనూ పోల్చలేం. కేవలం వ్యక్తుల పాపులారిటీ ప్రాతిపదికగా ప్రచారం సాగడమనేది, 1967లో ఎంజీఆర్ ఎంట్రీతో ప్రారంభమైంది.  అన్నాదురై డిఎంకేకి 80సీట్లు వస్తాయని అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో అంచనా వేశారు. కానీ డిఎంకేకి ఏకంగా 179 సీట్లు వచ్చాయ్. దానికి కారణం
ఎంజిఆర్ పోస్టర్లు..అప్పట్లోనే ఎంఆర్ రాధా ఎంజిఆర్‌పై కాల్పులు జరపగా మెడపై తీవ్రగాయాలు అయ్యాయ్. దీంతో ఆ పోస్టర్‌తోనే డిఎంకే ప్రచారం చేసింది. ఆ తర్వాత ఎంజీఆర్ 1972లో ఏడిఎంకేని స్థాపించి సొంతంగా అధికారం చేపట్టారు. అలా అన్నాడిఎంకే ప్రభంజనం కొనసాగగా..డిఎంకేకి కరుణానిధి ప్రసంగాల మద్దతు లభించింది.

రీజినల్ సెంటిమెంట్‌ కి కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. ఢిల్లీ కాదు కదా...ఏ ఇతర భాషల ఆధిపత్యాన్ని సహించని మొండితనం ఇక్కడి వారి సొంతం..అలాంటి అరవనాట ఇప్పుడు పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయ్. ద్రవిడ ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తమిళనాడులో తొలిసారిగా దిగ్గజనేతల కొరత వేధిస్తోంది
ఇందుకు కారణం ముఖ్యమంత్రి జయలలిత..మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించడమే..సుదీర్ఘకాలం కత్తులు దూసుకున్న ఈ నేతలు ఇప్పుడు కనుమరుగు కావడంతో..డిఎఁకే, అన్నాడిఎంకే రెండూ లీడర్లు లేని పార్టీలుగా మిగిలిపోయాయ్. డిఎంకేకైనా ఎంకే స్టాలిన్ నేతృత్వం లభించగా..అన్నాడిఎంకేలో మాత్రం పళనిస్వామిని
తమిళ అమ్మ జయ స్థానంలో ఊహించలేకపోతున్నారు. ఒకప్పుడు ఎన్నికలంటేనే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించిన ఈ పార్టీల ప్రచారం ఇప్పుడు చప్పగా సాగుతోంది
అప్పట్లో ఎంజీఆర్ ప్రసంగించే ప్రదేశాలకు మూడు రోజుల ముందే జనాలు వచ్చి ఆ గ్రౌండ్లపైనే పడుకునేవారుట. ఇదే క్రేజ్ జయలలితకీ వచ్చింది. 2001లో ఏర్కాడులో తన ప్రచారరధంనుంచి జయలలిత ఓ చోట దిగగా..జనం ఆమె తిరిగిన నేలనే ముద్దులు పెట్టుకున్నారట. జనం ఇంత పిచ్చగా అభిమానిస్తారు కాబట్టే..జయలలిత, కరుణానిధి తమ మధ్య వైరాన్ని పార్టీల కేడర్ మధ్య వైరంగా కూడా మార్చగలిగారు.
ఇదంతా ఈ ఇద్దరు లెజెండ్రీ నేతలకు ఉన్న ఫాలోయింగ్ కావచ్చు కానీ..అటు కరుణానిధి..ఇటు జయలలిత లేని ఈ సమయంలో ఇప్పుడు తమిళనాడు ఓటర్లు ఎక్కువగా కులం, ఇతర సమస్యలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో అన్నాడిఎంకే 37 పార్లమెంట్ సీట్లు గెలుచుకోగా..బిజెపి ఒకటి..పిఎంకే ఒకటి దక్కించుకున్నాయ్. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిని ఊహించలేం.
జయలేని అన్నా డిఎంకే సపోర్ట్ కోసం ఏ కారణాల వల్లనైనా... ఆల్రెడీ బిజెపిని కావలించుకుంటోంది. డిఎంకే కాంగ్రెస్ గూట్లో చేరిపోయింది.  ఇద్దరు దిగ్గజ నేతల అదృశ్యంతో ఇప్పుడు తమిళనాడులో అసలైన రాజకీయాలు
ప్రారంభం అవుతాయని అంటున్నారు..మాస్ మేనియా(MANIA)ని పక్కనబెట్టి..సమస్యలపై మాట్లాడే పార్టీలవైపే మొగ్గు చూపుతారంటున్నారు. 

Comments