నేనే రాజు..నేనే ముఖ్యమంత్రి..పవన్ కొత్త సినిమా టైటిల్


అటు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కానీ..ఇటు ప్రతిపక్షంలో ఉండి సిఎం అవ్వాలనుకుంటున్న జగన్‌కి కానీ లేనంత దమ్మూ ధైర్యం ఒక్క పవన్ కల్యాణ్‌కే ఉన్నాయని ఆయన ఫ్యాన్స్ భ్రమిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే
పాపం పవన్ కల్యాణ్ కూడా తనని తాను అప్పుడప్పుడూ ఎక్కువగా ఊహించుకోవడం కన్పిస్తుంది..ఇప్పుడలానే
ఎన్నికల ప్రచారంలో నేనే ముఖ్యమంత్రిని..నన్ను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరంటూ కేఏపాల్ డైలాగులు వేస్తున్నాడు
కనీసం ఏడాది కాలం నుంచి జనంలో తిరుగుతున్న జనసేనాధిపతి ముఖ్యలక్ష్యం జగన్ మాత్రమే అని ఆయన ప్రసంగాలు చూసినా..విన్నా అర్దమైపోతుంది..జగన్ గారు ఎప్పుడూ నేను సిఎం అయితే..నేను సిఎం అయితే అంటుంటారు నాకు అది నచ్చదు..ఏం గెలిస్తేనే ఏదోటి చేయగలరా..పదవులు లేకుండా ఎవరూ ఏం చేయలేరా..నాకు పదవులు లెక్కకాదు తలుచుకుంటే సిఎం అవడం పెద్ద పని కాదు( అంతలోనే నవ్వు) అంటూ కనీసం ఓ పాతికసార్లు ఎత్తిపొడిచిన పవన్ కల్యాణ్‌..సివరాఖరికి మాత్రం పదవులపై గాలి మళ్లింది..నేనే ముఖ్యమంత్రినవుతా అంటూ కేకలేస్తున్నారు

ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన ఎన్ని సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుందో చెప్పలేని పవన్ కల్యాణ్ ఏకంగా ముఖ్యమంత్రినే అవుతా అనడం పాపం పక్కన రాష్ట్రం కర్నాటక ఎఫెక్ట్ అనుకోవాలి..18-20 మంది ఎమ్మెల్యేలతోనే
కుమారస్వామి సిఎం అవడమంటే..అక్కడుంది కాంగ్రెస్, బిజెపిలు కాబట్టి..కానీ ఇక్కడున్నది రెండూ రీజినల్ పార్టీలే..అంత తొందరగా ఇంకో పార్టీకి పీఠం అప్పజెప్పిన చరిత్ర గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేదుమరి..

Comments

  1. ఆయన ఉద్దేశ్యం ఉపముఖ్యమంత్రి అయ్యుంటుంది.

    ReplyDelete

Post a Comment