పవన్ కల్యాణ్ తేల్చేశాడు ఇక ప్రజాసేవేనట..అంటే 2020లో సినిమా రిలీజ్ ఖాయం

"సార్ ఆపరేషన్ సక్సెస్...పేషెంట్ డైడ్
" టాస్క్ కంప్లీటెడ్ సార్.." ఓకే పని ఇక మొదలుపెట్టండి " ఇదేంటి ఇప్పుడేగా పనైపోయిందంటుంటే...మా నాయకుడు మళ్లీ పని మొదలైందంటున్నాడు..అవును..ఎన్నికల క'మిషన్' అయిపోయింది..ఇక అసలు పని రెడీ స్టార్ట్..యాక్షన్ కెమెరా..మొదలవ్వాలిగా..!

టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్‌లాగా  జనసేన సీట్ల లెక్క వేయదు..జనం కోసమే పని చేస్తుంది..అంటూ ఓ ఉదాత్తమైన డైలాగ్ వేయగానే..జనం నిజమే అని మురిసిపోయే రోజులు కావివి..2014లో తమరి వేషాలు చూశారు..ఆ తర్వాత అసలు రంగు బైటపడింది..మళ్లీ 2019లోనూ ఇంకోరకం వేషాలు వేశారు..కానీ చివరికి వచ్చేసరికి పసుపు కుంకుమ కారిపోయింది..ఇక ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేస్తామంటూ ఫోజులు కొడితే నమ్మేదెవరు..

మరీ అందరూ అడుగుతున్నారు కాబట్టి..వచ్చినట్లు వచ్చి ఓటింగ్ సరళి గురించి లీడర్లని అడిగి తెలుసుకున్నా అని చెప్పడం చూస్తుంటే..ఇతగాడినా కొన్ని లక్షలమంది ఆరాధించేది అన్పించకమానదు..పదకొండు రోజులకు ఓటింగ్ ట్రెండ్ గురించి..అదీ ఇంకోడ్ని అడిగి తెలుసుకోవడమంటే..మనోడికి ఎంత ప్రజాషేవ్ చేయాలనే దుగ్ధ ఉందో అర్ధం అవుతోంది..ఇవి తెలుసుకుంటే సేవ చేసినట్లేనా అని అడగొద్దు..ఆ లెక్కన అసలు ఎన్నికలలో పోటీ చేయకుండా కూడా గతంలో చేసినట్లు బాబుగారితో పాటు జనాలకు సేవ చేయొచ్చు ..పైగా ఆయన చెప్పే మార్పు మొదలైందని కూడా అంటున్నారు..మరదేంటో ఎవడికైనా కన్పిస్తుందేమో చూడాలి..

ఒకటి మాత్రం ఖాయం 2020లో కొత్త సినిమా రిలీజ్

Comments