జగన్ లక్షకోట్ల రూపాయల అవినీతి గుట్టు విప్పిన లక్ష్మీనారాయణ


అవి 2014 ఎన్నికలకు ముందు రోజులు..ఇంకా కాస్త ఖచ్చితంగా చెప్పాలంటే మే 1-మే 7 మధ్య  రోజులు..జగన్‌మోహన్ రెడ్డి ఓ ఆర్ధిక ఉగ్రవాది తమ్ముళ్లూ..లక్షకోట్ల రూపాయలు దోచుకున్న గజదొంగ..లక్ష కోట్లంటే ఎంతో తెలుసా..ఓ రెండు మూడు లారీలకు సరిపడే డబ్బు..ఆ డబ్బంతా దోచుకుని ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి వస్తున్నాడు అంటూ చంద్రబాబు సహా టిడిపి నేతలంతా హోరెత్తించారు. అదే బాటలో శ్రీమాన్ పవన్ కల్యాణ్ బాబు గారు కూడా పోలింగ్ రేపనగా ఇవాళ్టి ఈనాడు  పేపర్‌కి గదులు  గదులు..సూటుకేసుల్లో పట్టనన్ని ఫిర్యాదులున్న జగన్ గారు తన నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ఊరికే ప్రచారం చేస్తే కాదు అంటూ
శ్రీరంగనీతులు వల్లించారు. ఇంత జరిగినా..ఇలా కాదురా అబ్బాయ్..అసలు నిజంగా ఎంత తిన్నాడంటే ( తింటే) ఖచ్చితమైన లెక్క ఎవరూ చెప్పలేదు 
ఆఖరికి సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లపై ఇంకా విచారణే మొదలు కాలేదు..ఇలాంటి సందర్భంలో అప్పటి విచారణ అధికారిగా సంచలనం కలిగించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు పెదవి విప్పారు. 
నిజంగా జగన్‌మోహన్‌రెడ్డి ఎంత మేర అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు చేసారు అన్న ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం దాదాపుగా రూ.1500కోట్లు అది కూడా తనకి గుర్తు లేదని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలనేది పొలిటికల్ వెండెట్టా..రాజకీయకక్షతో చేసిన ఆరోపణలుగా ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.

 ఇంత నిర్ద్వంద్వంగా విచారణాధికారే చెప్పినప్పుడు ఇంకా వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేసేవారిని ఏమనాలి..మా పేపర్ రాసింది..మేం చదువుతాం..మేం చదువుతాం మా పేపర్ రాస్తుంది అన్న తరహాలో జరిగిన క్విడ్ ప్రోకోకి ఎవరు బాధ్యులు..ఊరికే పేపర్ చూసేసి తమకేదో గొప్ప జ్ఞానం లభించిందని కామెంట్లు పెట్టే మహామేధావులు సాక్ష్యాలు చూపకుండా ఏది మాట్లాడినా చెల్లిపోతుంది కానీ..వాస్తవంగా పరువు నష్టం దావాలు అఁటూ వేస్తే..ఎంత ఇరుక్కుపోవాలో గ్రహించరు. పైగా కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై కూడా యధేచ్చగా ఆరోపణలు చేస్తుంటారు.
దొంగ అనొచ్చు కానీ నువ్వు ఇంత దొంగతనం చేసావు అంటే మాత్రం అది డిఫమేషన్ కిందే వస్తుంది..ఇది తెలీకుండా..తమకి గిట్టనివారికి పార్టీలను కులాలను అంటగట్టడం ఏమేరకు తగును

Comments

  1. డెఫమేషన్ కేసు వేస్తే నేను ఎదుర్కొంటాను. ప్రచురించడానికి మీకు దమ్ము ఉందా ?

    ReplyDelete
  2. నేనే కనుక రాహుల్ గాంధీ ప్లేస్ లో ఉంటే 2 జీ కుంభకోణం ఆరోపణలు చేసినందుకు దేశం మొత్తo, మోదీ మీదా కేసు వేసేదాన్ని. ఆ కేసు నుండి అందరూ నిష్కళంకంగా బయటికివచ్చారు. బ్లాగర్లలో నేను ఒక్కదాన్నే కాంగ్రెస్ కి సపోర్ట్ చేసాను.బ్లాగర్లలో ముగ్గురు నలుగురు మాత్రమే వైఎసార్ సీ పీ ని సపొర్ట్ చేసారు. అవినీతి మనకిష్టమైనవారు చేస్తే తప్పు లేదా ? ఇంటర్ పిల్లల ఆత్మహత్యల గురించి గులాం గ్యాంగ్ లో ఒక్కడైనా మాట్లాడాడా ?


    ReplyDelete
  3. చంద్రబాబు స్టేలు తెచ్చుకొని కేసులు తప్పించుకున్నాడని కూడా "జేడీ" చెప్పాడు.

    https://www.ap7am.com/flash-news-647376-telugu.html

    ReplyDelete
  4. స్టేల చక్రవర్తి బాబు దశ తిరగడం మొదలయినట్టే ఉంది.

    లక్ష్మీపార్వతి వేసిన కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దు!

    https://www.ap7am.com/flash-news-647643-telugu.html

    2005లో లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇటీవల పెండింగ్‌లో ఉన్న స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేసింది

    https://www.andhrajyothy.com/artical?SID=776931

    ReplyDelete

Post a Comment